భారత్‌లో ఫిఫా క్రేజ్! అర్జెంటీనా, ఫ్రాన్స్ అంటున్నారు... టీమిండియా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే ఒక్కడైనా వచ్చాడా...

First Published | Dec 18, 2022, 3:57 PM IST

భారతీయులకు ఫుట్‌బాల్‌ పెద్దగా ఎక్కదు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇక్కడ మంచి రేటింగ్ వచ్చింది. మెస్సీ, రొనాల్డో, నేమర్ తప్ప మరో ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు తెలియనవాళ్లు కూడా ఫిఫా మ్యాచులను ఎగబడి చూశారు...

fifa

అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్‌‌లో ఎవరు గెలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖతర్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ బరిలో దిగుతుంటే... అర్జెంటీనాకి ఈ సారి ఎలాగైనా టైటిల్ అందించి రిటైర్ అవ్వాలని లియోనెల్ మెస్సీ ఆశపడుతున్నారు...

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారని కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. సాధారణంగా భారత్ ఆడే వరల్డ్ కప్ మ్యాచులకు, ఐపీఎల్ సమయంలో మాత్రం ఇలాంటి బెట్టింగులు జరుగుతాయి... కేరళతో పాటు ముంబై, ఢిల్లీ వంటి కొన్ని నగరాల్లో ఫైనల్ మ్యాచుల కోసం కొన్ని నైట్ క్లబ్‌లు స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నాయి.


ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచును ప్రత్యేక్షంగా చూసేందుకు కొంతమంది ఫుట్‌బాల్ ప్రియులు, లక్షలు ఖర్చుబెట్టి అక్కడికి వెళ్లారు కూడా. అందుకే ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కి ఇండియన్ ఫ్లేవర్ అద్దేందుకు బాలీవుడ్ హీరోయిన్లతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేస్తోంది ఫిఫా.. 

Image credit: Getty

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్‌కి ఇంత క్రేజ్ రావడం చూసి భారత ఫుట్‌బాల్ టీమ్ ఆశ్చర్యపడుతోంది. కారణం భారత ఫుట్‌బాల్ టీమ్ ఆడిన ఏ మ్యాచులకు కూడా జనాలు రాకపోవడమే. భారత్‌లో ఫుట్‌బాల్‌కి క్రేజ్ తేవాలనే ఉద్దేశంలో ఇండియన్ సూపర్ లీగ్‌ని తీసుకొచ్చారు. అయినా ఫలితం శూన్యం...

హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్, ఐఎస్‌ఎల్ టైటిల్ గెలిచినా ఆ విషయం ఎంతమంది హైదరాబాదీలకు తెలుసంటే వేళ్ల మీద లెక్కించాల్సిందే. స్వయంగా భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, భారత జట్టు ఆడే మ్యాచులను స్టేడియానికి రావాల్సిందిగా ప్రేక్షకులను వేడుకున్నారు. అయినా పట్టించుకున్నవారు లేరు...

Image credit: Getty

ఇప్పుడు వరల్డ్ మ్యాప్‌లో ఎక్కడ ఉంటుందో కూడా తెలియని (చాలామందికి) అర్జెంటీనాకి, ఫ్రాన్స్‌కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కొట్టుకోవడం చూసి భారత ఫుట్‌బాల్ టీమ్ అవాక్కు అవుతోందట. ఎవరో ఆడుతున్నప్పుడు వస్తున్న సపోర్ట్, టీమిండియా ఆడుతున్న మ్యాచులకు ఎందుకు రావడం లేదన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.. 

Image credit: Getty

అయితే ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్‌కి వస్తున్న క్రేజ్‌ని కరెక్టుగా వాడుకుంటే భారత ఫుట్‌బాల్ జట్టుకి త్వరలో ఆదరణ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్రచారం చేసి, షెడ్యూల్‌కి కరెక్టుగా ప్లాన్ చేస్తే... భారత ఫుట్‌బాల్‌కి కూడా క్రేజ్ తేవచ్చని అంటున్నారు మార్కెట్ నిపుణులు.. 

Latest Videos

click me!