Virat Kohli: కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను సైతం సైక్యా తోసిపుచ్చారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా..
2027 వన్డే వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీని తప్పించి యువ ఆటగాళ్లను తీసుకురావాలనే ప్రచారాలను బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైక్యా తోసిపుచ్చారు. కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని స్పష్టం చేశారు.
25
విరాట్ కోహ్లీని తప్పించి
భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందనే ప్రచారాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైక్యా స్పందించారు. ఈ ప్రచారాలను ఆయన పూర్తిగా ఖండించారు.
35
గంభీర్ తో విబేధాలు
కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను సైతం సైక్యా తోసిపుచ్చారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇటీవల బీసీసీఐ వన్డే ఫార్మాట్‌లో మార్పులు చేపట్టినప్పటికీ, విరాట్ కోహ్లీ స్థానంలో బలవంతంగా ఎవరినీ తీసుకోలేదని సైక్యా నొక్కిచెప్పారు. కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 616 పరుగులు సాధించాడని గుర్తు చేశారు.
55
జూలై 2026లో ఇంగ్లాండ్‌తో..
123.2 సగటుతో పాటు 108.64 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయగా, ఇందులో మూడు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జూలై 2026లో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ మళ్లీ మైదానంలో కనిపిస్తాడని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.