మరో మూడు రోజుల్లో ప్రణయ్ పరిణయం... ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లతో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్...

First Published | Sep 12, 2022, 1:31 PM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్, మరో 3 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న హెచ్‌ ఎస్ ప్రణయ్, తన గర్ల్‌ఫ్రెండ్ శ్వేతా గోమ్స్‌ని వివాహం చేసుకోబోతున్నాడు...

తన ఫియాన్సీ శ్వేతా గోమ్స్‌తో కలిసి దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హెచ్.ఎస్. ప్రణయ్... ‘నాకు ఎప్పుడూ కావాల్సిందల్లా నువ్వు మాత్రమే... లవ్... మరో 3 రోజుల్లో..’ అంటూ కాప్షన్ జోడించాడు. 

ఢిల్లీలో జన్మించిన ప్రణయ్ పూర్తి పేరు ప్రణయ్ హసీనా సునీల్ కుమార్. హైదరాబాద్‌లో పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ప్రణయ్, ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో తన స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడు...


2022 థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెచ్ ఎస్ ప్రణయ్, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. 

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ 2022లో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌ని ఓడించి, క్వార్టర్ ఫైనల్ చేరిన హెచ్ ఎస్ ప్రణయ్... జపాన్ ఓపెన్ 2022లోనూ క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లాడు..

Latest Videos

click me!