ఆసియా కప్ 2023 : "సూపర్ నాక్, సూపర్ గై".. విరాట్ పై అనుష్క శర్మ పోస్ట్ వైరల్...

Bukka Sumabala | Published : Sep 12, 2023 10:55 AM
Google News Follow Us

ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత అనుష్క శర్మ స్పెషల్ మెసేజ్ ఇచ్చింది.

19
ఆసియా కప్ 2023 : "సూపర్ నాక్, సూపర్ గై".. విరాట్ పై అనుష్క శర్మ పోస్ట్ వైరల్...

సోమవారం నాడు జరిగిన ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపులో తన 47వ వన్డే సెంచరీని సాధించి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. 

29

కేవలం 94 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి, కేఎల్ రాహుల్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో తన జట్టును రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. 

39

భర్త సాధించిన ఈ విజయంపై విరాట్ కోహ్లి భార్య.. బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ సోషల్ మీడియాలో నాలుగు పదాలతో తన సంతోషాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా పంచుకుంది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో "సూపర్ నాక్, సూపర్ గై" అనే క్యాప్షన్‌తో కోహ్లీ ఫోటోను అనుష్క షేర్ చేసింది.

Related Articles

49

పాకిస్థాన్‌పై భారత్ సాధించిన 228 పరుగుల రికార్డు విజయంలో కోహ్లీ తన 47వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో ఇది శుభారంభంగా పేర్కొన్నాడు. వికెట్ల మధ్య కోహ్లి మెరుపు వేగంతో పరిగెత్తాడు. అలా 94 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా ఉండడం మామూలు విషయం కాదు. 

59

కోహ్లీ ఫిట్ నెస్ ఎంతుందో ఇది చూపిస్తుంది. అయితే కోహ్లీ ఈ సింగిల్స్, డబుల్‌లను "ఈజీ రన్స్" అన్నాడు. ఇది కోహ్లి మార్క్ సెంచరీ, దీనిలో అతను ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 38 సింగిల్స్, 15 టూ రన్స్ చేసి ఈ పెద్ద పరుగులు సాధించాడు. "నా ఆటను ఎప్పుడూ... జట్టుకు సహాయపడే విధంగా ఉండేలా సిద్ధం చేసుకున్నాను. 

69

కేఎల్ రాహూల్ అద్భుతంగా ఆరంభిచాడు.. దానికి నా ఆట తోడయ్యింది. నేను అతనిని స్ట్రైక్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించాను. సెకండ్ ఫెడిల్ చేరుకున్నాం" అని కోహ్లీ తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు.

79

"ఆ తరువాత మేము ఆగలేదు. ఆటలో ఏం చేయగలమో.. అక్కడికి చేరుకున్నాం. నా ఫిట్‌నెస్‌ విషయంలో చాలా గర్వపడుతున్నాను. పెద్ద షాట్‌తో పోలిస్తే డబుల్స్ కోసం పుష్ చేయడం చాలా తేలికైన పరుగులు. ఇది ఇంతకు ముందు ఫలించింది, అదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాను"అన్నారాయన. 

89

రాహుల్‌తో భాగస్వామ్యం గురించి కూడా  కోహ్లి మాట్లాడారు. విరాట్ మాట్లాడుతూ.. "కేఎల్, నేను ఇద్దరం సంప్రదాయ ఆటగాళ్లం. నేను, రాహుల్ ఆడిన విధంగా మీరు బ్యాటింగ్ చేసినప్పుడు, ఈ భాగస్వామ్యాలను బ్రేక్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరం ఫాన్సీ షాట్లు ఆడాం". 

99

అంతేకాదు మేమిద్దరం భాగస్వామ్యం గురించి పెద్దగా ఆలోచించలేదు, 'బ్యాటింగ్ కొనసాగించాలనే' ఆలోచన మాత్రమే ఉంది.  ఇది మాకు, భారత క్రికెట్‌కు కూడా మరపురాని భాగస్వామ్యాల్లో ఒకటి. దీనివల్ల మేము నేరుగా ప్రపంచ కప్‌లోకి వెళ్లడానికి కావాల్సిన ఫామ్‌ని అందించాడు" అన్నారు.

Read more Photos on
Recommended Photos