కోహ్లీ బాటలోనే అభిషేక్ శర్మ.. సెంటిమెంట్ వర్కవుటైతే ఇతడి వల్లే టీ20 వరల్డ్ కప్ గెలుపు..!

Published : Feb 19, 2026, 02:16 PM IST

2024 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ పరిస్థితే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో అభిషేష్ శర్మకు ఎదురవుతోంది. అయితే సెంటిమెంట్ వర్కవుట్ అయి కోహ్లీ లాగే అభిషేక్ శర్మ కూడా వరల్డ్ కప్ గెలిపించాలని అభిమానులకు కోరుకుంటున్నారు. ఇంతకూ ఆ సెంటెమెంట్ ఏంటో తెలుసా? 

PREV
14
టీమిండియాకు వరల్డ్ కప్ అందించేది అభిషేకేనా?

Abhishek Sharma, T20 World Cup 2026: టీమిండియా స్టార్ ప్లేయర్, యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ అతను ఖాతా తెరవకుండానే సున్నాకే ఔటయ్యాడు. దీంతో అభిషేక్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి... అతడిని గతంలో పొగిడినవాళ్లే ఇప్పుడు తిడుతున్నారు.

అయితే మీకు ఓ విషయం తెలుసా? సరిగ్గా ఇలాంటి పరిస్థితే 2024 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీకి కూడా ఎదురైంది. అప్పుడు కూడా తొలి మూడు మ్యాచుల్లో కోహ్లీ బ్యాట్ సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత కింగ్ కోహ్లీ ఇచ్చిన కమ్‌బ్యాక్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అభిషేక్ శర్మ నుంచి కూడా అలాంటి కమ్‌బ్యాక్‌నే అందరూ ఆశిస్తున్నారు. అదే జరిగితే 2024లో లాగే భారత జట్టు కప్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.

24
విరాట్, అభిషేక్ మధ్య టీ20 కనెక్షన్

టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఈ పేలవమైన ఆరంభమే ఒక కనెక్షన్‌గా మారింది. ఇద్దరూ టోర్నమెంట్ ఆరంభ మ్యాచుల్లో తేలిపోయారు. అభిషేక్ శర్మ మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 బంతులు ఎదుర్కొన్నా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అమెరికాపై ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడినా సున్నాకే వెనుదిరిగాడు. ఇక నెదర్లాండ్స్‌పై మూడు బంతులు ఎదుర్కొని మళ్లీ జీరోకే ఔటయ్యాడు. గత కొంతకాలంగా అతని ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడమే పేలవ ప్రదర్శనకు కారణమని చెబుతున్నారు.

34
2024 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ప్రదర్శన కూడా ఇంతే...

అభిషేక్ లాగే విరాట్ కోహ్లీ కూడా 2024 టీ20 వరల్డ్ కప్‌లో మొదట్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ టోర్నమెంట్‌లో ఐర్లాండ్‌పై ఐదు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌పై మూడు బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. ఇక యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అయితే కోహ్లీ కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత అతని ఆట గేర్ మార్చింది. మిగిలిన మ్యాచుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని ప్రదర్శన వల్లే భారత్ 2024 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది.

44
2024 విజయాన్ని భారత్ రిపీట్ చేస్తుందా?

విరాట్ కోహ్లీ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో మొత్తం 8 మ్యాచుల్లో 151 పరుగులు చేశాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా మిగతా మ్యాచుల్లో కమ్‌బ్యాక్ ఇచ్చి, విరాట్ కోహ్లీ లాగే జట్టును విజయాల బాట పట్టిస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరన్న విషయం తెలిసిందే... అతడిలోని అసలైన ఆటగాడు బయటకు వచ్చాడో ప్రత్యర్థులకు దబిడిదిబిడే.

Read more Photos on
click me!

Recommended Stories