ప్రతిరోజూ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడింది. గుడికి వెళ్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తారు. గుడికి వెళ్లడం వల్ల జీవితంలో ఆనందం ఉంటుంది. దేవుడి ఆశీస్సులు మనపై ఉండాలి. సద్గుణాలు పెరుగుతాయని పండితులు చెప్తారు. అయితే గుడికి ఎప్పుడూ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లోనే వెళ్లాలని పురాణాల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం పూట గుడికి వెళ్లకూడదంటారు జ్యోతిష్యులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మధ్యాహ్నం గుడికి ఎందుకు వెళ్లకూడదు?
మధ్యాహ్నం గుడికి వెళ్లడం నిషిద్ధం వెనుక మూడు బలమైన కారణాలున్నాయంటారు జ్యోతిష్యులు. మొదటి కారణం.. మధ్యాహ్నం మన శరీరం సోమరిగా ఉంటుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మధ్యాహ్నం సోమరితనం నిండిన మనస్సుతో దేవుడిని చూడకూడదంటారు.
రెండో కారణం.. మధ్యాహ్నం స్వామికి నిద్రించే సమయం. కాబట్టి చాలా దేవాలయాల తలుపులు మధ్యాహ్నానికి మూసివేయబడతాయి. మధ్యాహ్న పూట స్వామివారు గుడిలో సేదతీరుతారు. ఇలాంటి సమయంలో మీరు గుడికి వెళితే దేవుని నిద్రకు ఆటంకం కలుగుతుంది.
Meenakshi Temple
పురాణాల ప్రకారం.. ఉదయం, సాయంత్రం పూటే ఆలయాన్ని సందర్శించేవాళ్లు మానవులు, పవిత్ర జీవులు. మధ్యాహ్నం దెయ్యాలు, పూర్వీకులు, తీరని ఆత్మల కాలమని నమ్ముతారు. ఇలాంటి సమయంలో స్వామి దర్శనం కోసం ఆలయంలో కనిపించని శక్తులు ఉంటాయి. వీళ్లకు బాధల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది
మధ్యాహ్నం పూట గుడికి వెళ్లినప్పుడు మన కంటికి కనిపించని శక్తులకు, భగవంతుడికి మధ్య జరిగే సమావేశానికి ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మధ్యాహ్నం దేవాలయాలు తెరిచే ఉన్నప్పటికీ భక్తులు వెళ్లకూడదు.