శనివారం వేంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసా?

First Published | Mar 15, 2024, 3:44 PM IST

వేంటకేశ్వేర స్వామి భక్తులు ప్రతి శనివారం నాడు గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టి తమ కోరికలు తీర్చమని మొక్కుకుంటారు. అయితే గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. మరి శనివారం నాడు ఇంట్లో బాలాజీని ఎలా పూజించాలో తెలుసా? 
 

శనివారం వేంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజు వేంకటేశ్వర స్వామిని పూజిస్తారు. వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం మనపై ఉంటే ఎలాంటి కష్టాలు, బాధలున్నా తీరిపోతాయనే నమ్మకం ఉంది. అందుకే ప్రతి శనివారం నాడు వేంకటేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. 
 

వేంకటేశ్వర స్వామికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. శ్రీనివాడుసు, వేంకటేశ్వరుడు, బాలాజీ అంటూ ఎన్నో పేర్లతో ఈ దేవుడిని పిలుస్తారు. వేంకటేశ్వర స్వామి శ్రీవిష్ణుమూర్తి రూపాలలో ఒకడు. ఈ శ్రీనివాసుడి అనుగ్రహం పొందేందుకు చాలా మంది వేంకటేశ్వర స్వామికి గుడికి వెళ్లి కొబ్బరి కాయను కొడుతుంటారు. మరికొంతమంది ఇంట్లోనే పూజిస్తుంటారు. 
 

Latest Videos


ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి. దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో, దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలి. 
 

వేంకటేశ్వర స్వామి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామి వారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి. తర్వాత దీపాలను వెలిగించాలి. తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు, పలారాలను సమర్పించాలి. మీరు నైవేధ్యం పెట్టాలనుకుంటే పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టొచ్చు. 
 

ఈ రోజు మీరు ఖచ్చితంగా శ్రీనివాసుడి మహత్వాన్ని తెలిపే పుస్తకాలను చదవండి. వేంకటేశ్వర స్వామి నామాలను పఠించండి. అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామి వారిని పూజించండి. దీపం వెలిగించి మొక్కుకోండి. సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెళిగిస్తే మంచిదని పండితులు చెప్తారు. 

అలాగే ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నేలపై పడుకోండి. అలాగే శనివారం నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామి వారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 

click me!