శ్రావణ మాసం చివరి సోమవారం నాడు ఇలా చేస్తే శివుని అనుగ్రహం పొందడమే కాదు.. మీ కోరికలు కూడా నెరవేరుతాయి

First Published | Aug 28, 2023, 10:13 AM IST

shravana masam 2023: శ్రావణ సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల కోరకున్న ఫలితాన్ని పొందుతారని నమ్మకం ఉంది. అలాగే మీకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయి. శివుడికి నీటిని పెట్టడం ద్వారానే సంతోషిస్తాడని సనాతన గ్రంధాలలో నమ్ముతారు. అందుకే శ్రావణ సోమవారం నాడు భక్తులు శివుడికి నీటితో అభిషేకం చేస్తారు. 
 

శ్రావణ మాసం విశ్వ సృష్టికర్త అయిన శివుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో శివపార్వతులను నిష్టగా పూజిస్తారు. అలాగే శ్రావణ మాసం సోమవారం కూడా ఉపవాసం ఉంటారు. శివుడిని పూజిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయని నమ్మతారు. అలాగే ఇంట్లో సంతోషం, సౌభాగ్యం, అదృష్టం పెరుగుతాయని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుడికి నీటిని పెట్టినా ఎంతో సంతోషిస్తాడని సనాతన గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసం సోమవారం నాడు భక్తులు శివుడికి నీటితో అభిషేకం చేస్తారు. మీరు కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. శ్రావణ మాసం చివరి సోమవారం నాడు ఈ చర్యలు చేయండి. శివుని అనుగ్రహం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. 
 

శ్రావణ సోమవారం కోసం పరిహారాలు

శ్రావణ మాసం చివరి సోమవారం నాడు స్నానం చేసి ధ్యానం చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుడికి తేనె, గంధం కలిపిన గంగా నీటితో అభిషేకం చేయాలి. ఈ జలాభిషేకం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమట. దీంతో అతని కృప మీకు కలుగుతుంది. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


శివుడు ఎంతో దయగలవాడు. కరుణామయుడు. కేవలం పండ్లు, పూలు, నీరు మాత్రమే ఈ దేవుడుకి ఎంతో ఇష్టమట. మీరు కూడా మహాదేవుని అనుగ్రహం పొందాలనుకుంటే పూజ సమయంలో ఆయనకు మారేడు ఆకులు, ధతురా, మందార పువ్వులు, విరిగిపోని బియ్యాన్ని సమర్పించండి. అలాగే గోధుమ పిండి, పంచదార, నెయ్యితో చేసిన స్వీట్లు సమర్పించండి.

మీరు ఒక ప్రత్యేక పనిలో శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే శ్రావణ సోమవారం నాడు శివుడికి పచ్చి పాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివుని అనుగ్రహం లభిస్తుంది.

శ్రావణ సోమవారం నాడు విరాళాలు కూడా ఇస్తుంటారు. శ్రావణ సోమవారం నాడు దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని మత విశ్వాసం. ఇందుకోసం శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజించిన తర్వాత తెల్లని వస్తువులను దానం చేయండి. పాలు, పెరుగు, అన్నం ను దానం చేయొచ్చు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల శివుడు కూడా సంతోషిస్తాడు.

దేవతల దేవుడైన మహాదేవుని ఆశీస్సులు పొందడానికి శ్రావణ సోమవారం నాడు పంచాక్షరీ మంత్రం 'ఓం నమః శివాయ' జపించండి. మీరు దుఃఖం, రోగాల నుంచి విముక్తి పొందాలనుకుంటే స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. 

Latest Videos

click me!