రక్షా బంధన్ 2023: రాఖీలను ముందుగా ఈ దేవుళ్లకు కట్టాలి.. ఎందుకంటే?

First Published | Aug 28, 2023, 9:34 AM IST

Raksha Bandhan 2023: రాఖీ పండుగ హిందూ ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావన మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టేముందు దేవుళ్లకు రాఖీ కట్టడం పవిత్రంగా భావిస్తారు. 
 

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధం పవిత్రతకు ప్రతీక. ఈ రోజున అక్కా చెల్లెల్లు తమ అన్న, తమ్ముళ్లకు రాఖీని కట్టి.. వారి ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. అలాగే అన్నదమ్ములు తమ అక్కా చెల్లెల్లను కాపాడతామని వాగ్దానం చేస్తారు. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున పంచకం, భద్రకాలం ఏర్పడటంతో ఆగస్టు 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ పండుగను జరుపుకోకున్నారు. అయితే అన్నదమ్ముల్లకు రాఖీ కట్టేముందు ముందుగా దేవుళ్లకు రాఖీ కట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా కట్టడం వల్ల ఏమౌతుంది? ఏయే దేవుళ్లకు రాఖీ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 దేవుడికి రాఖీ

ముందుగా మీ ఇష్టదైవానికి రాఖీ కట్టండి. ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుందట. రాఖీ పండుగ రోజున శివలింగానికి మొదటి రాఖీ కట్టాలని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో.. మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
 

Latest Videos


వినాయకుడికి

రాఖీ పండుగ రోజున సోదరుడికి రాఖీ కట్టే ముందు ముందుగా వినాయకుడికి రాఖీ కట్టి, ఆ తర్వాత అన్నదమ్ములకు రాఖీ కట్టాలట. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల బంధంలో సమస్యలు తొలగిపోతాయి. అలాగే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే వారి జీవితంలో వచ్చే అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 
 

rakshabandhan 2023

ఈ దేవతలకు రాఖీ కట్టండి

రక్షాబంధన్ రోజున హనుమంతుడికి రాఖీ కట్టడం వల్ల జీవితంలో వచ్చే అన్ని రకాల భయాలు, ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే రాఖీ పండుగ రోజున శ్రీకృష్ణుని విగ్రహానికి భక్తిశ్రద్ధలతో రాఖీ కట్టడం వల్ల రక్షణ లభిస్తుంది. రక్షాబంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టే ముందు అక్కాచెల్లెల్లు విష్ణువుకు రాఖీ కట్టాలని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది మీ జీవితంలో అన్ని సమస్యలను తొలగిస్తుంది.

click me!