రక్షాసూత్రం కట్టడం వెనకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
పూజ సమయంలో చేతికి రక్షా సూత్రం లేదా కంకణం కట్టడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాల్లో ఉంది. ముగ్గురు దేవుళ్లు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా మహాలక్ష్మి, మాతా సరస్వతి, కాళీమాత. పూజ సమయంలో కంకణం కట్టడం వల్ల ఒక వ్యక్తికి బలం, తెలివితేటలు, జ్ఞానం, సంపద లభిస్తుందని నమ్ముతారు. అలాగే దేవుళ్ల అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుందట. మణికట్టుకు రక్షాసూత్రం కట్టే ఆచారం పురాతన కాలం నుంచి వస్తోంది.