ఈ శివరాత్రికి మొదటిసారి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

First Published | Mar 7, 2024, 9:43 AM IST

మహాశివరాత్రి 2024: ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. అంటే రేపే శివరాత్రి పండుగను జరుపుకోబోతున్నాం. ఫాల్గుణ మాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే మీరు ఫస్ట్ టైం శివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నట్టైతే కొన్ని నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే? 
 

మహాశివరాత్రి పండుగ హిందువులు జరుపుకునే హోలీ, దీపావళికి ఏ మాత్రం తీసిపోదు. ఈ పండుగ భోళాశంకరుడికి అంకితం చేయబడింది. ఈ పండుగ ఉత్తర ప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు, పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు దాదాపు ప్రతిచోటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి పండుగను దక్షిణ భారత క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసంలో, ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారు. మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తులు పూర్ణాహుతితో పూజలు చేస్తారు. శివలింగానికి పాలు, దతుర పువ్వులు, బిల్వపత్ర ఆకులు మొదలైనవి సమర్పించి రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం వల్ల దేవుడు మన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్ముతారు. మీరు కూడా మొదటిసారి మహాశివరాత్రి ఉపవాసం ఉండబోతున్నట్టైతే దానికి సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకోండి. 

శివరాత్రి ఉపవాస నియమాలు

1.ఈ  మహాశివరాత్రి నాడు మీరు ఉపవాసం ఉంటే ఒకేసారి మాత్రమే పండ్లను తినాలి. అంటే ఈ రోజు మీరు ఒక్కసారి మాత్రమే ఫుడ్ ను తినాలన్న మాట. అయితే గర్భిణులు లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నవారు పండ్లను రెండు మూడు సార్లు తినొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 


2. ఉపవాసంలో సింఘారా హల్వా, కుట్టు, సామ రైస్, బంగాళాదుంపలు మొదలైనవి తినొచ్చు. 

3. ఉపవాస సమయంలో గోధుమలు లేదా బియ్యాన్ని అసలే తినకూడదు. అలాగే ఈ రోజు మీరు తృణధాన్యాలతో చేసిన ఆహారాలను కూడా తినకూడదు.
 

మహాశివరాత్రి ఉపవాసం సమయంలో ఏవి తినకూడదు? 

ఉపవాస సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను తినడం నిషిద్ధం.

మహాశివరాత్రి నాడు తెల్ల ఉప్పును తినకూడదు. దానికి బదులుగా రాక్ సాల్ట్ ను మీరు తినొచ్చు.

ఉపవాసం సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఉపవాస సమయంలో మాంసం, ఆల్కహాల్ జోలికి అస్సలు వెల్లకూడదు.

మహాశివరాత్రి ఉపవాసం సమయంలో నిద్రపోకూడదు.

మహాశివరాత్రి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు

మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం వల్ల సంపద, గౌరవం, సంతోషం, శాంతులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే కన్యలు శివరాత్రికి ఉపవాసం ఉంటే తొందరగా పెళ్లి కుదురుతుందని కూడా చెబుతున్నారు. అలాగే పెళ్లికి ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. 
 

Latest Videos

click me!