కృష్ణాష్టమి 2023: శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులు ఇవి.. దీనిలో మీ రాశి ఉందా?

First Published | Sep 2, 2023, 10:20 AM IST

krishna janmashtami 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదో రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీకృష్ణుడిని ఆరాధించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Janmashtami

krishna janmashtami 2023: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీకృష్ణుని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మత విశ్వాసాల ప్రకారం.. శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, బలం, జ్ఞానం లభిస్తాయి.
 

Janmashtami

పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను సెప్టెంబర్ 06,  సెప్టెంబర్ 07 న జరుపుకోనున్నాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం..  నాలుగు రాశుల వారిపై శ్రీకృష్ణుడికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట. అవేంటంటే.. 


వృషభ రాశి 

వృషభ రాశి కృష్ణునికి ఇష్టమైన రాశులలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ జాతకులు వివిధ పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఈ రాశి వారు జన్మాష్టమి రోజున ఖచ్చితంగా శ్రీకృష్ణుడిని ఆరాధించాలి.
 

కర్కాటక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశి వారికి శ్రీకృష్ణుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని క్రమం తప్పకుండా పూజించిన వల్ల వీరికి అన్ని పనుల్లో విజయం లభిస్తుందని నమ్ముతారు. అలాగే జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి.
 

సింహ రాశి

శ్రీ కృష్ణునికి ఇష్టమైన రాశులలో సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి జాతకులు పేరుకు తగ్గట్టుగా ఎంతో కష్టపడి పనిచేస్తారు. అలాగే నిర్భయంగా మాట్లాడుతారు. ప్రతిరోజూ శ్రీకృష్ణుడిని ఆరాధించే వారికి భగవంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే బలం,  జ్ఞానం కూడా పొందుతారు. సింహ రాశి జాతకులు జన్మాష్టమి నాడు రాధా శ్రీకృష్ణులను పూజించాలి. 
 

తులా రాశి

తులా రాశి వారికి కూడా  శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రాశిని శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రాశివారు ప్రత్యేక ఆరాధన ఫలాలను పొందుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఆరాధించే వారు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు.

Latest Videos

click me!