Janmashtami 2023
రోహిణి నక్షత్రంలో ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటాం. ఇలా ఈ ఏడాది కృష్ణాష్టమి సెప్టెంబర్ 6న వచ్చింది. ఈ రోజు లోకాధిపతి అయిన శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కోసం భూలోకానికి వచ్చాడు. వైష్ణవ సమాజానికి ఈ రోజు ఒక వేడుక లాంటిది. ఈ రోజున ఆయన భక్తులు శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకోవడమే కాకుండా ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో గోపాలుడిని నిష్టతో పూజిస్తారు. శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలను పొందుతారని నమ్ముతారు. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలనుకుంటే కృష్ణాష్టమి రోజున మీ రాశిచక్రం ప్రకారం.. ఈ మంత్రాలను పఠించండి.
మేష రాశి: 'ఓం గోవిందాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుతారు.
వృషభ రాశి: వీరు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
మిథున రాశి: వీరు బాలగోపాలుడి అనుగ్రహం పొందడానికి 'ఓం అచ్యుతాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
కర్కాటక రాశి: వీళ్లు శ్రీకృష్ణాష్టమి రోజున రోజున పూజ సమయంలో 'ఓం మాధవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
సింహరాశి: వీరు గోపాలుడి అనుగ్రహం పొందడానికి 'ఓం వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
కన్యా రాశి: వీళ్లు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజ సమయంలో 'ఓం ఆదిత్యాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
తులా రాశి: వీరు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి 'ఓం బలభద్రప్రియనుజయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
వృశ్చిక రాశి: శ్రీ కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశివారు 'ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
Janmashtami
ధనుస్సు రాశి: ఈ రాశివారు జన్మాష్టమి నాడు మధుసూదనుడి అనుగ్రహం పొందడానికి 'ఓం మధురకృతే నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
మకర రాశి: వీళ్లు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి 'ఓం గోపీశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
కుంభ రాశి: ఈ రాశి జాతకులు 'ఓం గోపాలాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
మీన రాశి: వీరు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి 'ఓం జగన్నాథాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.