సనాతన ధర్మంలో పూజా ఆరాధనకు ఎన్నో నియమాలు ఉన్నాయి. పూజా సామగ్రితో పాటుగా పూజలో గంటలు, శంఖం కూడా ఖచ్చితంగా ఉంటాయి. పూజ చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు శంఖం ఊదడంతో పాటుగా గంటలు మోగిస్తారు. గంటలు, శంఖ శబ్దలు లేకుండా పూజ, హారతి సంపూర్ణం కావు. అయితే పూజలు, శుభకార్యాల సమయంలో శంఖం ఊదడం ఎన్నో ఏండ్ల తరబడి ఒక ఆనవాయితీగా వస్తోంది. నిజానికి శంఖం ఊదడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. శంఖం శబ్దం మన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని పురాణాల్లో ఉంది. అంతేకాదు పర్యావరణాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసే గుణం శంఖానికి కూడా ఉందని నమ్ముతారు. దీన్నిఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. అందుకే అసలు శంఖం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.