Diwali 2023 : ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ 12 అంటే ఆదివారం నాడు జరుపుకోబోతున్నాం. ఈ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు నివసిస్తారని ప్రతీతి. అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవి సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయట. అంటే ఈ రోజు మీరు కొన్ని జీవులను చూస్తే మీకు అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే?
Lizard at home
ఇది శుభసూచకం
బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. అయితే పవిత్రమైన దీపావళి పండుగ నాడు రాత్రి గణేష్-లక్ష్మీ పూజ తర్వాత వీటిని చూడటం శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. దీపావళి రోజున బల్లిని చూడటం అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందని సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. అలాగే దీపావళి నాడు రాత్రిపూట గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉందని అర్థమట.
పిల్లి
శకున శాస్త్రం ప్రకారం.. ఇంట్లోకి పిల్లి రావడం చాలా శుభప్రదం. ఒకవేళ దీపావళి నాడు మీరు పిల్లిని చూస్తే అది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. చూసిన వ్యక్తికి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు.
చీమ
దీపావళి రోజు మీ ఇంట్లో నల్ల చీమను చూడటం కూడా శుభసూచికమే. మీ ఇంట్లో బంగారు వస్తువులు ఉంచిన చోట నల్ల చీమలు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం. అలాగే మీ ఇంటి పైకప్పు నుంచి చీమలు బయటకు రావడం కూడా శుభసూచకమే. అంటే మీకు ఆకస్మిక డబ్బు కలుగుతుంది.