ఉదయాన్నే ఈ పనులు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏ కొదవా ఉండదు

First Published | Sep 29, 2023, 3:27 PM IST

హిందూమతంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు ఎలాంటి ఇబ్బంది రాదని నమ్ముతారు. అయితే ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు. 
 

ధార్మిక గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపద, ఆనందం, కీర్తి లకు దేవతగా భావిస్తారు.  డబ్బుకు సంబంధించిన సమస్యలు పోవడానికి లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు. అయితే ఉదయం కొన్ని పనులను చేస్తే మీకున్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి.. మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పరిహారాల వల్ల మీరు జీవితాంతం ఆనందంగా కూడా ఉంటారు. ఇందుకోసం ఏం పరిహారాలు చేయాలంటే? 
 

ప్రవేశ ద్వారం శుభ్రంగా ..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడి నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆమె మొదటి దర్శనం ప్రవేశద్వారంపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తూ మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని క్లీన్ చేయండి. అలాగే వాకిలి అంటే మెయిన్ గేటు చుట్టూ ముగ్గులు కూడా వేయొచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తుంది.
 


ప్రధాన ద్వారం వద్ద దీపం 

పలు గ్రంధాల ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందుకే సాయంత్రం పూట మీ ఇంటి ప్రధాన ద్వారా వద్ద ద్వీపం వెలిగించండి. దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు ఏ కొదవా ఉండదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. 
 

తులసి పూజ

మత విశ్వాసాల ప్రకారం.. తులసి మొక్క శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. అందుకే దీన్ని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అలాగే పూజ చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తులసి కోటకు ప్రతిరోజూ పూజచేయండి. అలాగే నెయ్యి దీపం వెలిగించండి. ఇలా ప్రతిరోజూ పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తుంది.

Latest Videos

click me!