Diwali 2023: దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

First Published Nov 7, 2023, 11:43 AM IST

Diwali 2023: దీపావళి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పూజ మన ఇంటికి అదృష్టాన్ని, ఆస్తిని తెస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. అసలు దీపావళి నాడు వినాయకుడిని కూడా ఎందుకు పూజిస్తారో తెలుసా? 
 

భారతదేశం సంస్కృతి, సంప్రదాయం, పండుగల సుసంపన్నమైన దేశం. మన దేశంలో ఎన్నో పండుగలను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. మనం జరుపుకునే ప్రతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  మన దేశంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే పండుగల్లో  దీపావళి ఒకటి. ఒక్క ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం.. వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, అదృష్టం కలుగుతాయి. అంతేకాక ఈ పూజ శాంతి, సౌభాగ్యం,మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ అంటే ఈ నెల 12 న జరుపుకోబోతున్నాం. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తారు. ఎందుకిలా పూజిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా?
 

దీపావళి రోజున ఎందుకు పూజిస్తాం?

దీపావళి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవిని, వినాయకుడిని నిష్టగా పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీ దేవి, వినాయకుడిని పూజించడం వల్ల భక్తుల ఇంటికి సంపద వస్తుంది. దీపావళి పూజను రాత్రి నిర్ణీత సమయంలో చేస్తారు. భక్తులు నిష్టగా పూజ చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
 

లక్ష్మీదేవితో వినాయకుడిని ఎందుకు పూజిస్తారు?

హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి సంపదకు దేవగా పరిగణించడం వల్ల అమ్మవారికి అహంకార భావన వచ్చింది. ఈ అహంకారానికి ముగింపు పలకడానికి.. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు మాత్రమే ఆమె జీవితం పరిపూర్ణమవుతుందని విష్ణువు అమ్మవారికి చెప్పాడట. అది విన్న లక్ష్మీదేవి నిరాశ చెంది పార్వతీదేవి వద్దకు వెళ్లి ఈ విషయాలన్నింటినీ చెప్తుందట. 
 

diwali 2023 puja muhurat

అంతేకాదు పార్వతీమాత కొడుకును ఇవ్వమని కూడా కోరిందట.  పార్వతీదేవికి.. లక్ష్మీ దేవి ఎక్కువ కాలం ఒకే చోట ఉండదని తెలుసు. అందుకే పార్వతీదేవి తన కొడుకు వినాయకుడిని ఆమెకు ఇచ్చిందట. దీంతో లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలిగిందట. అందుకే  లక్ష్మీదేవి కంటే ముందు వినాయకుడిని పూజిస్తారు. అందుకే దీపావళి రోజున వీరిద్దరికీ కలిపి పూజ చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. 

click me!