ధనత్రయోదశి నాడు వీటిని కొంటే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి

First Published | Nov 6, 2023, 12:06 PM IST

ధనత్రయోదశి పండుగను ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుపుకుంటారు. అయితే ఈ రోజున కొన్ని  వస్తువులను కొంటే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదని చెప్తున్నారు. అవేంటంటే? 
 

హిందూ ముఖ్యమైన పండుగల్లో ధన త్రయోదశి ఒకటి. ఈ పండుగను మనం ఈ నెల 10 న జరుపుకోబోతున్నాం. ఈ ధనత్రయోదశి ఐదు రోజుల దీపావళి పండుగను కూడా సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజు  శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అందుకే కొన్ని వస్తువులను ఖచ్చితంగా కొంటుంటారు. మరి ధనత్రయోదశి నాడు ఎలాంటి వస్తువులను కొంటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బంగారం, ఆభరణాలు

ధనత్రయోదశి నాడు బంగారం లేదా ఆభరణాలను ఎక్కువగా కొంటుంటారు. ఈ రోజు బంగారాన్ని కొనడం వల్ల శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు. మీకు తెలుసా? చాలా మంది సంపద, ఆర్థిక భద్రతకు బంగారు నాణేలను, ఆభరణాలను చిహ్నంగా భావిస్తారు. 
 


వెండి వస్తువులు

ధనత్రయోదశి నాడు అత్యంత పవిత్రమైందిగా భావించే మరొక విలువైన లోహం వెండి. మీ ఇంట్లో సంపద, శ్రేయస్సును తీసుకురావడానికి ఈ రోజున మీరు వెండి పాత్రలు, నాణేలు లేదా అలంకరణ వస్తువులను కొనొచ్చు. వెండిని స్వచ్ఛతకు చిహ్నం భావిస్తారు. 

వంటగది పాత్రలు

ధనత్రయోదశి నాడు కొత్త వంటగది పాత్రలను కూడా కొనే సంప్రదాయం ఉంది. లక్ష్మీదేవి పరిశుభ్రంగా, చక్కగా ఉండే ఇంటికే వెలుతుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు వంటగది పాత్రలను కొని తమ వంటగదిని అందంగా తీర్చిదిద్దుతారు. దీన్ని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు

ప్రస్తుత కాలంలో ధనత్రయోదశి రోజు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఉపకరణాలను కూడా కొంటున్నారు. కొత్త ఉపకరణాలతో మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయడం పురోగతిని, మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని సూచిస్తుంది. ఈ వస్తువులు మన రోజువారి అవసరాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. 
 

నూనె దీపాలు, దీపాలు

ధనత్రయోదశి  నాడు ఖచ్చితంగా నూనె దీపాలు లేదా దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాల నుంచి వచ్చే కాంతి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందని, అలాగే చీకటి, ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున మీరు దీపాలను కొనొచ్చు. 

Latest Videos

click me!