అయితే ఇక్కడ ఈ ఆచారం మెల్లిగా తగ్గుతూ వస్తోందట. దానికి కారణం లేకపోలేదు. నివేదికల ప్రకారం ఈ ద్వీపాన్ని దాదాపు 50 సంవత్సరాలు సోవియట్ యూనియన్ ఆక్రమించింది. అప్పుడు ఇది మహిళల ఆధిపత్యంలోనే ఉంది. వారు వచ్చిన తరువాత.. పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావం ఈ దీవిపై పడింది.
మారుతున్న కాలంతో ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఈ దీవి నుంచి బయటకు వెళ్లి చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు. దాని కారణంగానే ఇక్కడి మొదటి నుంచీ వస్తున్న కొన్ని ఆచారాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రత్యేక సంప్రదాయం మెల్లమెల్లగా దూరం కావడానికి ఇదే కారణం