మంచు కురిసే ఎడారిని ఎప్పుడైనా చూశారా..? ప్రపంచంలోనే అతి చిన్నఎడారిలో వింతలు , విశేషాలెన్నో.

First Published | Dec 26, 2024, 7:36 PM IST

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. ఆ వింతల్లో ఏడారి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ఎడారి వింతల్లో ఒకటి కార్ క్రాస్ ఎడారి. ప్రపంచ రికార్డ్ ఉన్న ఈ ఎడారి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
 

ఎన్నో రహస్యాలను, ప్రకృతి తనలో దాచుకుంది  .అందులో చిక్కు ముడి వీడని రహాస్యాలు చాలా ఉన్నాయి. మానవుడికి అంతు చిక్కని  రహస్య ప్రదేశాలు కూడా బోలెడు ఉన్నాయి. అందులో  ఒకటి   కార్‌క్రాస్ ఎడారి. మనం సహారా లేదా రబ్ అల్-ఖలీ వంటి పెద్ద పెద్ద  ఎడారుల గురించి చాలా విషయాలు  తెలుసుకునే ఉంటాం. సౌదీ అరేబియా,ఈజిప్ట్, మంగోలియా, మొరాకో నమీబియా, ఒమన్ లాంటి ఫేమస్  ఎడారులు గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. కాని ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి గురించి మీకు తెలుసా... 
 

 కెనడాలోని యుకాన్ ప్రావిన్స్‌లో కార్‌క్రాస్ ఎడారి ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి. దీని వైశాల్యం కేవలం ఒక చదరపు మైలు మాత్రమే. వినడానికి  విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం. ఈ ఎడారికి సమీపంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు కార్‌క్రాస్. ఈ గ్రామంలో 4500 సంవత్సరాల క్రితం ప్రజలు ఎక్కువగా నివసించేవారు. కాని  పరిస్థితుల ప్రభావంతో అందరు వలస వెళ్లగా..  ఇక్కడ ఇప్పుడు 301 మంది మాత్రమే నివసిస్తున్నారు. 

Also Read: ఆ ఊరిలో ఆడవారిదే పెత్తనం, మరి మగవారు ఏం చేస్తారో తెలుసా..?


ఇక్కడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎంత కాలం ఉన్నా.. ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. ఎన్నో అరుదైన వింతలకు ఈ ప్రాంతం ప్రసిధ్ధి.  అంతే కాదు సాధారణంగా ఎడారి అంటే  ఎక్కువ  వేడి ఉంటుంది. అది చలికాలం అయినా సరే అంతే ఉంటుంది. ఎడారిలో  ఉష్ణోగ్రత ఇతర ప్రదేశాల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచంలోని అతి చిన్న ఎడారి అయిన ఈ ప్రాంతంలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఎడారిలో మంచు ఏంటి..? నిజంగా విచిత్రంగానే ఉంది కదా..? 
 

అందుకే ఈ సీజన్‌లో ఇక్కడికి టూరిస్ట్ లు ఎక్కువగా వస్తుంటారు.ఎడారిలో మంచు కురవడం ఏంటో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. మంచు కురుస్తున  ప్రాంతంలో ఈ చిన్న ఎడారి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సరస్సు ఎండిపోవడం వల్లే ఈ ఎడారి ఏర్పడిందని కొందరి అభిప్రాయం. ఇసుకతో కూడిన గాలుల వల్లే ఇంత ఎత్తులో ఎడారి ఏర్పడిందని మరికొందరు అంటున్నారు. కానీ నిజం ఏంటో ఎవరికీ తెలియదు.

ఇక ఇక్కడి అడవుల్లో  చాలా అరుదైన జాతి  వృక్షాలు కూడా  ఉన్నాయి.  కానీ చాలా తక్కువ మందికి వాటి గురించి తెలుసు.కార్‌క్రాస్ ఎడారి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజలు డెవలప్ మెంట్ కు చాలా దూరంగా ఉన్నారు. ఈ ఎడారికి కార్‌క్రాస్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో ముందుగా కారిబౌ అనే అడివి తెగ ఉండేవారట. వారు సంచారజీవితం గడిపేవారట. వారికి ఈ ప్రాంతం నచ్చడంతో  అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరితో పాటు మరికొన్ని  టిల్లింగిట్ మరియు టాగిష్ సంచార జాతులు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. 

వేటాడటి ఆహారం సంపాదించేవారు వీరు.  ఈ రెండు తెగల పేరు మీదిగా కారిబౌ మరియు క్రాసింగ్ అనే పదాల శబ్దాలను కలిపి ఈ ప్రదేశానికి కార్‌క్రాస్ అని పేరు పెట్టారు. ఈ ఏడారిలో అన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇంత చిన్న వైశాల్యం ఉన్నా.. ఇక్కడ వింత జీవులకు కొదవ లేదు. ఈ ఏడారి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

భయాన్ని పుట్టిస్తుంది.... థ్రిల్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఎప్పుడు చూడని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది.  వేసవిలో ఇక్కడ యూకాస్ తోడేళ్లు ఎక్కవగా కనిపిస్తాయి. బైకాల్ సేజ్ పువ్వులు ఎంతో అందంగా దర్శనం ఇస్తాయి. వీటి అందానికి మీరు ముగ్థులై పోతారు. ఇవే కాదు ఇంకా రీసెర్చ్ చేయగదిగిన ఎన్నో వింత జీవులు ఈ ఏడారిలో మనకు కనిపిస్తాయి. 

Latest Videos

click me!