Kisi Ka Bhai Kisi Ki Jaan Review
కథ:
సల్మాన్ ఖాన్ గత అనుభవాల రీత్యా ప్రేమ మీద విరక్తి పెంచుకుంటాడు. తన జీవితంలోకి మరో ఆడది రాకూడదు. జీవితాంతం బ్యాచ్ లర్ గా ఉండిపోవాలని కోరుకుంటాడు. అయితే అతని ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. వాళ్ళ ప్రేమలు పెళ్లి వరకూ వెళ్లాలంటే అన్నయ్యకు జోడీని వెతకాలి. వైరాగ్యం పోయాలా చేసి ఆయన మనసులో ప్రేమ విత్తనాలు నాటాలి. అప్పుడు పూజా హెగ్డే రంగంలోకి దిగుతుంది. ఈ హైదరాబాద్ అమ్మాయికి సల్మాన్ దగ్గరవుతాడు. ఆమెకు ఓ బీభత్సమైన బ్యాగ్రౌండ్ ఉంటుంది. అసలు పూజా హెగ్డే ఎవరు? ఆమె సమస్య ఏమిటీ? సల్మాన్-పూజాల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ...
Image: Our Own
విశ్లేషణ:
స్టార్ డమ్ చట్రంలో ఇరుక్కుపోయిన సల్మాన్ ఖాన్ రొటీన్ చిత్రాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. తమిళ సూపర్ హిట్ మూవీ వీరమ్ రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. కథ ఏమిటో చెప్పుకుండానే దర్శకుడు మొదటి సగం నడిపించేశాడు. అన్నదమ్ముల మధ్య సన్నివేశాలు. పూజా హెగ్డే-సల్మాన్ సన్నివేశాలతో కామెడీ పంచే ప్రయత్నం చేశారు. అటు పూజా తో రొమాన్స్, ఇటు బ్రదర్స్ పాత్రలతో కామెడీ రెండూ వర్క్ అవుట్ కాలేదు.
Kisi Ka Bhai Kisi Ki Jaan
లెక్కకు మించిన పాత్రలతో గజిబిజిగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. భాయ్ జాన్ సల్మాన్ కండల రూపం, దుమ్మురేపే ఫైట్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. యాక్షన్ సన్నివేశాలు ఉన్నతంగా ఉన్నాయి. అయితే కథలో అవి ఇమడలేదు. ఒక సన్నివేశం సాంగ్ అన్నట్లు అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో ఆసక్తి లేకుండా సాగుతుంది. సాంగ్స్ కూడా ఆకట్టుకోలేదు. రవి బస్రూర్ బీజీఎం మాత్రం మెప్పిస్తుంది.
Kisi Ka Bhai Kisi Ki Jaan
వెంకటేష్ వంటి స్టార్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. బహుశా ఆయనకు నార్త్ లో ఫేమ్ లేదనుకున్నారేమో కానీ సాదాసీదాగా తేల్చేశారు. అలాంటి పాత్ర వెంకటేష్ తో చేయించాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో నడిపించేసినా బాగుంటుంది. విలన్ రోల్ లో జగపతిబాబు మెప్పించారు. పూజ పాత్రకు స్పేస్ ఉంది కానీ ప్రభావం చూపలేక పోయింది. ఎమోషనల్ గా కథ, పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. సాంగ్ లో రామ్ చరణ్ ఎంట్రీ చెప్పుకోవాల్సిన అంశం.లుంగీ సాంగ్ కి ఆయన ప్రజెన్స్ ఎనర్జీ నింపింది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. సౌత్ ఇండియా రెసిపీకి దర్శకుడు ఫర్హాద్ సామ్జీ జోడించిన నార్త్ ఫ్లేవర్స్ రుచించలేదు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే సల్మాన్ ఖాన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు. సల్మాన్ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చేస్తుంది. ఆయన మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్లతో ఈలలు వేయిస్తాయి. మొత్తంగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రొటీన్ సల్మాన్ ఖాన్ మాస్ మసాలా ఎంటర్టైనర్. ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే ఈద్ రిలీజ్...
రేటింగ్: 2.5/5
నటీనటులు: సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే, జగపతిబాబు తదితరులు...
దర్శకుడు: ఫర్హాద్ సామ్జీ
నిర్మాత: సల్మా ఖాన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.మణికందన్
సంగీతం: హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్, అమల్ మల్లిక్
మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & సౌండ్: రవి బస్రూర్