షర్మిల తెలంగాణ పార్టీ: కేసీఆర్ కు రాబోయే ముప్పు ఇదే....

First Published | Feb 9, 2021, 6:27 PM IST

కొద్దిసేపు షర్మిల ఎవరు వదిలిన బాణం అనే విషయం పక్కనబెడితే... షర్మిల పార్టీ పెడితే తెలంగాణాలో మారే రాజకీయ సమీకరణాల గురించి మనం మాట్లాడుకోవలిసి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అధికారాన్ని దక్కించుకున్నాక, కాంగ్రెస్ ప్రాభవం బాగా మసకబారుతూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ కి వీర విధేయులుగా ఉన్న కొందరు రెడ్లు తెరాస వైపు చూసారు.

తెలంగాణలో జగన్ సోదరి షర్మిల పార్టీనయితే ఏర్పాటు చేయబోతున్నారనేది సుస్పష్టం. రాజన్న రాజ్యం తెలంగాణలో ఆవశ్యకం అనే ఆమె మాటలను బట్టి, తెలంగాణలో ఏ వర్గం వారూ ఆనందంగా లేరని చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.... ఆమె తెలంగాణాలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొనేందుకు సిద్ధపడినట్టు అర్థమవుతుంది.
undefined
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ జైలుకెళ్ళినప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసిన షర్మిల.... ఇప్పుడు ఎవరు వదిలిన బాణం అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడంలేదు. కేసీఆర్ వంటివారు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అనడం, షర్మిల కేసీఆర్ ని నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టు కనిపించడం వల్ల కొందరు మాత్రం కేసీఆర్ హస్తం ఉంది అని అంటున్నారు.
undefined

Latest Videos


ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ప్రతిపక్ష ఓటు చీలి కేసీఆర్ లాభపడవచ్చు అనేది తెరాస ఆలోచన అని అంటున్నారు. కానీ తెరాస కు లాభం చేకూర్చేపని షర్మిల చేస్తుంటే జగన్ చేయనిస్తారా అనేది ఇక్కడ ఒక అంతుచిక్కని ప్రశ్న. బీజేపీతో ఏపీలోనే డైరెక్ట్ ఫైట్ కి సుముఖంగా లేని జగన్ తెలంగాణాలో అందుకు కాలు దువ్వడానికి మాత్రం ఆస్కారంలేదు.
undefined
ఇక కొద్దిసేపు షర్మిల ఎవరు వదిలిన బాణం అనే విషయం పక్కనబెడితే... షర్మిల పార్టీ పెడితే తెలంగాణాలో మారేరాజకీయ సమీకరణాల గురించి మనం మాట్లాడుకోవలిసి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అధికారాన్ని దక్కించుకున్నాక, కాంగ్రెస్ ప్రాభవంబాగా మసకబారుతూఉన్న తరుణంలో కాంగ్రెస్ కి వీర విధేయులుగా ఉన్న కొందరు రెడ్లు తెరాస వైపు చూసారు. మరికొన్ని బలమైన స్తంభాలు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజగా డీకేఅరుణ వంటి వారు బీజేపీలో కూడా చేరారు.
undefined
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి మరింత క్లిష్టమవుతుండడంతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటివారు బీజేపీలో చేరుతామని ప్రకటిస్తున్నారు. కానీ చేరడానికి మాత్రం వెనకాడుతున్నారు. కారణం బీజేపీలోకి బయట పార్టీ వ్యక్తులకి తలుపులు తెరిచినప్పటికీ... నాయకత్వ బాధ్యతలను మాత్రం ఆర్ఎస్ఎస్. వి హెచ్ పి, కోర్ బీజేపీ నుంచి వచ్చినవారికి మాత్రమే అప్పజెప్పుతారు. సహజంగా పటేళ్ళుగా తెలంగాణ సమాజంలో కొనసాగిన రెడ్లు ఇలా నాయకత్వం లేకపోవడం వల్ల బీజేపీలో చేరడానికి తటపటాయిస్తున్నారు. అలాఅని తెరాస లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు.
undefined
కాంగ్రెస్ గనుక నాగార్జున సాగర్ ఉపఎన్నికలో బలపడితే, పార్టీగనుక పుంజుకుంటే... మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇటు బీజేపీకి, అటు తెరాస కు బాగా నష్టం కలగవచ్చు. ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టిన నేపథ్యంలో ఎందరు రెడ్లు షర్మిల గొడుగుకింద ఒక్కతాటిపైకి వస్తారో చూడాలి. కాంగ్రెస్ నుండి ఎందరు బయటకు వస్తారో చూడాలి. వీరి సంఖ్యను బట్టి తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
undefined
ఇక మరొక ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకునే ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో సైతం రాజశేఖర్ రెడ్డికి కొన్ని వర్గాల్లో డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు. క్రైస్తవ మైనార్టీలను గనుక షర్మిల ఆకట్టుకోగలిగితే.... అది తెరాస కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇక దీనికి తోడుగా షర్మిల పార్టీతో గనుక ఒక పొత్తు పొడిస్తే అది తెరాస కు శరాఘాతంగా మారవచ్చు.
undefined
తెలంగాణలో మైనారిటీ ఓట్ బ్యాంకు కన్సాలిడేషన్ కోసం షర్మిల పార్టీతో ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకుంటే..... ఇక తెలంగాణలో మెజారిటీ వర్సెస్ మైనారిటీ పాలిటిక్స్ గా రాజకీయ సమీకరణాలు మారే ఆస్కారం ఉంది. గ్రేటర్ ఎన్నికల ముందు వరకు ఇది తెలంగాణాలో సాధ్యపడదు అనుకున్న వారికందరికి షాక్ ఇస్తూ బీజేపీ హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించింది. ఇదే గనుక జరిగితే బీజేపీ వర్సెస్ ఎంఐఎం+ షర్మిల గా ఈక్వేషన్ మారిపోతుంది. గ్రేటర్ ఎన్నికల మాదిరి తెరాస పొలిటికల్ స్పేస్ కోసం ఫైట్ చేయాల్సి రావొచ్చు. గ్రేటర్ ఎన్నికల సమయంలో తమకు ఎంఐఎం కు పొత్తు లేదు అని తెరాస ప్రకటించింది.
undefined
TMC MP Saugata Roy claimed that the AIMIM has been sent by the BJP to reduce the vote share of the TMC, while Congress leader Adhir Ranjan Chowdhury said that Owaisi’s party will aim at further polarising the society.
undefined
click me!