తెలంగాణలో పార్టీ: వైఎస్ షర్మిల వ్యూహం ఇదీ...

First Published Mar 9, 2021, 9:51 AM IST

రాజకీయాల్లో నిలవాలంటే తొలుత చేయాల్సిన పని సర్కారులో సమస్యలను అందరికంటే భిన్నంగా ఎత్తి చూపడమే కాకుండా దానిని తాము ఎలా తీరుస్తామో తెలపడం. అదృష్టవశాత్తు షర్మిల రాజన్న రాజ్యం అనే రెడీమేడ్ కాన్సెప్ట్ ద్వారా కేసీఆర్ సర్కార్ లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు.

తెలంగాణలో షర్మిల పార్టీ ప్రస్తుతానికి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. షర్మిల ఎవరు వదిలిన బాణం అనే చర్చ ఇంకా సాగుతూనే ఉన్నప్పటికీ.... ఆమె తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కి విసురుతున్న కౌంటర్లు, చేస్తున్న విమర్శలు చూస్తుంటే మాత్రం షర్మిల భారీ ప్లాన్ తోనే తెలంగాణ రాజకీయాల్లో అడుగిడినట్టుగా కనబడుతుంది. ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య, వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా దూరదృష్టితో వేస్తున్నట్టుగా అర్థమవుతుంది.
undefined
రాజకీయాల్లో నిలవాలంటే తొలుత చేయాల్సిన పని సర్కారులో సమస్యలను అందరికంటే భిన్నంగా ఎత్తి చూపడమే కాకుండా దానిని తాము ఎలా తీరుస్తామో తెలపడం. అదృష్టవశాత్తు షర్మిల రాజన్న రాజ్యం అనే రెడీమేడ్ కాన్సెప్ట్ ద్వారా కేసీఆర్ సర్కార్ లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు. గతంలో మా నాన్న రాజన్న హయాంలో ఎలా ఉండేదో ఊహించుకోండి అంటూ అదే రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తానని చెబుతున్న షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వచ్చినట్టుగా అవగతమవుతుంది.
undefined
షర్మిల నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు మీద బలమైన వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ సర్కారు తొలి సారి మంత్రిమండలిలో మహిళ లేదు అనే విషయాన్నీ ఎత్తి చూపింది. 5 సంవత్సరాల తరువాత కేసీఆర్ మహిళలకు అవకాశం ఇచ్చినప్పటికీ... అది కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే పరిమితమయ్యిందని చెప్పుకొచ్చారు.
undefined
ఈ ఆరోపణ చేస్తూనే ఆమె తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంతటి ప్రాధాన్యతను కల్పించారో గుర్తుచేశారు. తెలంగాణలో మహిళలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదని ఆమె ఈ సందర్భంగా నొక్కి వక్కాణించారు. మహిళలందరం కలిసికట్టుగా తమ హక్కుల కోసం పోరాడాలని, మహిళలందరికోసం తానుముందుండి పోరాడతానని ఆమె అన్నారు.
undefined
తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించిన తరువాత....ఒక పార్టీని స్థాపించి దానిని నడుపుతున్నతొలి మహిళగా ఆమె రికార్డును కూడా సృష్టించనుంది. ఈ సందర్భంగా ఆమె అదే విషయాన్నీ తన బలమైన రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకోవాలనుకుంటుంది. రాష్ట్ర జనాభాలో దాదాపుగా సగం ఉన్న మహిళలను తన వైపుగా తిప్పుకోవాలనేది షర్మిల ఆలోచనగా కనబడుతుంది. దానికి తోడు రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు ఉపయుక్తకరమైన సంక్షేమపథకాలను అనేకం ప్రారంభించారు. వాటన్నిటి ద్వారా ఆమె రాజన్న రాజ్యం కాన్సెప్ట్ ని తెర మీదకు తీసుకువస్తున్నారు.
undefined
కేవలం మహిళలకు గుర్తింపు అనే అంశం మాత్రమే కాకుండా... ఆమె ఇప్పటికే నిరుద్యోగం,ఫీజులు వంటి అనేక అంశాల మీద ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక త్వరలో రాష్ట్రంలో పాదయాత్రకు సైతం శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. తన తండ్రి, అన్నల మాదిరి రాష్ట్రమంతా కలియతిరిగి ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టనున్నారు. చూడబోతుంటే షర్మిల అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఒడిసి పట్టుకునేలా కనబడుతున్నారు.
undefined
click me!