ఇదిలావుంటే, జగన్ ఆలోచన టీడీపీ వర్గాలను మరింత కలవరానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లను జగన్ నిరాకరించవచ్చునని అంటున్నారు. అదే జరిగితే వారు టీడీపీలో చేరడానికి ఉత్సుకత ప్రదర్శించవచ్చునని అంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారికి టికెట్లు ఇస్తే ఎదురు దెబ్బ తగిలిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ టికెట్లు దక్కనివారు తమ పార్టీలోకి వస్తామంటే తీసుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు.