దేశమంతా మూడవదఫా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ మూడవదఫా విధించిన లాక్ డౌన్ లో ఎన్నో సడలింపులు ప్రజలకు ఇచ్చిందికేంద్రం. పరిశ్రమలనుతెరవడం దగ్గరినుండి మొదలు మద్యం షాపులను తెరవడం వరకు అనేక సడలింపులు ఇచ్చింది.
undefined
ఈ అన్ని సడలింపుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మద్యం షాపులను తెరవడానికి ఇచ్చిన అనుమతి. మందు బాబులయితే... తమ కల నెరవేరినట్టుగా పూజలు చేస్తూ, టపాకాయలుకాలుస్తూ, పూజలు చేస్తూమద్యం షాపులవద్దసందడి చేసారు.
undefined
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... అక్కడ ఉద్యమమద్యం షాపులను తెరవడానికి ముందే.... అక్కడ క్యూలు కట్టారు. భౌతిక దూరం పాటించడం అనే పదం ఎప్పుడు విననట్టుగా ఒకరిమీద ఒకరు పడుతూ మద్యం కోసం కొట్టుకున్నారు కూడా. చాలా చోట్లకు పోలీసులుతమ లాఠీలకు పని కూడా చెప్పవలిసి వచ్చింది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇలా ఉంటే... పక్కనున్నతెలంగాణాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ప్రజలు భౌతిక దూరాన్ని చక్కగా పాటిస్తూ... మద్యాన్ని కొనుగోలు చేసుకొని వెళ్లారు. రెండు చోట్లా మద్యం అమ్మకాలు మొదలయ్యాయి, ఏపీకన్నా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువ. అయినప్పటికీ... ఏపీలోజరిగినంత రచ్చ తెలంగాణలో మాత్రం జరగలేదు.
undefined
ఈ నేపథ్యంలోఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీతో మద్యం కోసం జనాలు ఎగబడితే.... తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ నియమాలకు అనుగుణంగా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలుచేశారు మందుబాబులు.కారణాలేమిటనే విషయాన్నీవిషయాన్నీ తెలుసుకుందాం.
undefined
మొదటగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అవునన్నా కాదన్నా మద్యం దుకాణాల సంఖ్యా చాలా తక్కువ. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో ఆయన మద్యం దుకాణాలను తగ్గించేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వమే నడుపుతుంది.
undefined
దుకాణాలు తక్కువగా ఉండడం వల్ల రద్దీ పెరిగిందనేది కొట్టి పారేయలేని అంశం. ఇక దానితోపట్టుగాఏపీ, ఇతర రాష్ట్రాల్లో మద్యం షాపులు తీసిన తీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కేసీఆర్ ఒక అంచనాకు వచ్చిన తరువాత మాత్రమే దుకాణాలను తెరిచారు.
undefined
ఇవన్నీ పక్కనపెడితే..... కేసీఆర్ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నఒకమాట కూడా చాలా బాగా పనిచేసింది. ఆ మాట ఇటు మద్యం షాపుల ఓనర్లకు, అటు మందుబాబులకు గట్టి వార్నింగ్ లాగ పనిచేసింది.
undefined
మద్యం షాపుల వద్ద జనాలుభౌతిక దూరాన్ని పాటించకుండా, ఒకరిమీద ఒకరు పడితే... మద్యం షాపునుసీజ్ చేస్తామని హెచ్చరించారు. మమ్మల్నెవారు చూస్తారులేఅని వారు అనుకునే ప్రమాదాన్ని కూడా ముందే పసిగట్టినకేసీఆర్... మీడియాను ఈ విషయంలోమరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎక్కడ మద్యం షాపు వద్ద లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డాతమ దృష్టికి తీసుకురావాలనికోరారు.
undefined
మీడియాలో వస్తే, వెంటనే షాపులను వెంటనే మూసివేయిస్తామనికేసీఆర్ అనడంతో షాపుల వద్ద యజమానులుకొంతమంది సిబ్బందితో ఈ క్యూ లైన్లలోభౌతిక దూరం పాటించేలా చేసారు. ఇకపోతే... మందుబాబులకు పోలీసులభయాన్ని పెట్టారు కేసీఆర్.
undefined
మద్యం షాపును మూసేస్తే... మద్యం కొనుగోలుదారుసైతం వేరే దగ్గరకు వెళ్లి కొనుక్కోవలిసి వస్తుంది. ఒకవేళ సదరు మందుబాబుఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో గనుక మద్యం షాపు లేకపోతే, అతడు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సివస్తుంది. అప్పుడు గనుకపోలీసులకు దొరికితే... అది మరో తలనొప్పి.ఇలా ప్రజల నాడినికరెక్ట్ గా పట్టుకున్న కేసీఆర్తెలంగాణాలో మద్యం షాపుల వద్ద రద్దీని పూర్తి స్థాయిలో తగ్గించడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పక తప్పదు.
undefined