సీతక్క స్టైలే వేరు: లాక్ డౌన్ లో అలుపెరుగని నేత, ఆప్షన్ ఈమెనే....!

First Published May 8, 2020, 7:53 AM IST

కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిపుత్రులకు అండగా తానున్నానంటూ ఈ కరోనా కష్టకాలంలో వారందరికీ నిత్యావసరాలను చేరవేస్తూ... మామూలు టీవీల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నాయకుల్లాగా గో కరోనా గో అనకుండా ఆకలిని తరుముదాం అనే మహోన్నత లక్ష్యంతో, ఆకలి అన్నవారికి అన్నం పెట్టండి అని పిలుపునిస్తూ, ముందుకు సాగుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న మహిళ.....  ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఉరఫ్ సీతక్క. 

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయినవిషయం తెలిసిందే! వైరస్ కి మందు లేదు, వాక్సిన్ ఇంకాఅందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోమహమ్మారి కరాళ నృత్యానికిజనాలుపిట్టల్లా రాలిపోతున్న వేళ, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా లాక్ డౌన్ లోనే కాలం వెళ్లదీస్తుంది.భారతదేశం కూడా మిగిలిన దేశాలను అనుసరించి లాక్ డౌన్ మార్గంలోనేనడుస్తోంది. ప్రస్తుతం మే 17 వరకు లాక్ డౌన్ మూడవ దఫా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే3వ తేదీతో లాక్ డౌన్ నలభై రోజులను కూడా పూర్తి చేసుకొని 50 రోజుల వైపుగా సాగుతోంది.
undefined
ఈ లాక్ డౌన్ కాలంలోభారతదేశంలోని అత్యధికమంది ప్రజలుతీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. పేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని ఎందరో సామాన్య ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారు. కొందరు కనీసం తమ ఇండ్లనోనైనా ఉండిపోయేఅద్భుత అవకాశం దక్కిందని వలసకూలీలను చూసిన తరువాత అనుకోక తప్పదేమో!ఇక ఈ సమయంలో ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చందసంస్థలుఇలా ఒక్కరేమిటి,ఎన్నో శక్తులు ఈ సమాజానికి తమ వంతు బాధ్యతగా ఆకలి అన్న వారికి అన్నం పెడుతున్నాయి. ఇన్ని చేస్తున్నా... ఎక్కడో ఏదో ఒక మూల మాత్రం ప్రజలు సహాయం అందకుండానే ఉండిపోతున్నారు.ముఖ్యంగా విసిరేసినట్టుండే గిరిజన ప్రాంతాల్లోఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాలను చేరుకోవడం కూడా కష్టం కాబట్టి మీడియాలో వారి గురించి చూపెట్టడం కూడా అరుదు.
undefined
అలా కొండ ప్రాంతాల్లోఉంటున్న గిరిపుత్రులకుఅండగా తానున్నానంటూ ఈ కరోనాకష్టకాలంలో వారందరికీ నిత్యావసరాలను చేరవేస్తూ... మామూలు టీవీల్లోఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నాయకుల్లాగా గో కరోనా గో అనకుండా ఆకలిని తరుముదాం అనే మహోన్నత లక్ష్యంతో, ఆకలి అన్నవారికిఅన్నం పెట్టండిఅనిపిలుపునిస్తూ, ముందుకు సాగుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న మహిళ.....ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఉరఫ్ సీతక్క.
undefined
ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి తన నియోజకవర్గ ప్రజల బాగోగులను చూసుకుంటూ... రోజుకి కనీసం 12 నుంచి 14 గంటలు నియోజికవర్గమంతా పర్యటిస్తూ తన ప్రాంతంలోని ప్రజలందరికీ నేనున్నానని అభయమిస్తున్నారు.రోడ్డు బాగుంటేకారు, ఆ తరువాత కారు వెళ్లే వీలు లేదు అంటే ట్రాక్టర్, అది కూడా సాధ్యపడని చోట ద్విచక్ర వాహనం లేదా ఎడ్ల బండి, ఇక కొండా ప్రాంతాల్లోవాహనాలు ఏవీ వెళ్ళలేవు అంటే కాలినడకన. ఇలా నిత్యావసరాలను తన సిబ్బందితో సహా కలిసి తాను కూడా భుజాల మీద మోస్తూ... ఆ గిరి పుత్రుల ఆకలిని తీరుస్తున్నారు.
undefined
బహుశా మావోయిస్టుగా ఉన్నప్పుడు తనకు అన్నం పెట్టిన వారి బాధలను స్వయంగా చూసిన అనుభవమేమో కానీ ఆమె మాత్రం వారు అన్నమోరామచంద్ర అని అనకుండా చూసుకుంటున్నారు. ఆమె కీర్తి ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిధ్వనిస్తుంది.ఆమె పనులను ఇప్పుడు కేవలం మన తెలుగు మీడియా మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయ మీడియాదృష్టిని కూడా ఆకర్షించింది. మిగిలిన నాయకుల్లాగా కరోనా సేవ అంటే ఆహారాన్ని అందిస్తూఫోటోల కోసం పాకులాడుతూ, కరోనా లాక్ డౌన్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండానిజమైన సేవ చేస్తున్నారు.
undefined
ముఖ్యమైన నాయకులంతా టీవీలకే పరిమితమైన వేళ నిజమైన నాయకురాలు, ప్రజా ప్రతినిధి అంటే నిర్వచనం చెబుతూ అందరికి ఎలా పనిచేయాలో తాను చేసి చూపుతున్నారు. ఇప్పుడు ఆమె ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు ఒక శక్తి.ఆమె గురించి ఇప్పటికేఅనేక మీడియా సంస్థలుకవరేజ్ కూడా ఇచ్చాయి. ఆమె చేసే పనికి ఎవ్వరమూ సర్టిఫికెట్లుఇవ్వనవసరం లేదు. ఆమె నిబద్ధతతో చేస్తున్న పనికి ఇప్పుడు భారతదేశమేమురిసిపోతుంది.
undefined
ఇక సీతక్క ఈ లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది. ఆమె చేసే మంచి పనులకు ఎందరో నెటిజన్లు ఫిదా అయ్యారు. కేవలం ఈ లాక్ డౌన్ కాలంలోనే అంతగా మీడియాదృష్టిని ఆకర్షించలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దాదాపుగా 10,000 పైచిలుకుఫాలోవర్లను సంపాదించుకున్నారు.నాడు తుపాకీ పట్టి ప్రజా సమస్యలపై పోరాడిన గొంతుక నేడు ప్రజల ఆకలి గొంతుకలనుఅర్థం చేసుకొని, ఈ కరోనా మహమ్మారికంటే భయంకరమైన ఆకలి రోగాన్నితరిమి కొడుతున్నారు.
undefined
ఇకపోతే... ఇప్పుడు సీతక్క మన తెలంగాణ సమాజంలోఅందరికి పరిచయం అవసరం లేని పేరుగా మారారు. ఆమె తొలిసారి కరోనా పై అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అధికార తెరాస వర్గాలు ఆమె మాటలను కొట్టిపారేశారు. లేని కరోనా గురించి అనవసర మాటలెందుకని ఎద్దేవా కూడా చేసారు.స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మాటలను చాలా చిన్నవిగాతీసిపారేసారు.కానీ ఆరోజు ఆమె అన్న మాటలే నేడు నిజమయ్యాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, ప్రభుత్వాన్ని తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నిస్తూనే... తన వంతుగాప్రజలకు సహాయం చేస్తున్నారు.
undefined
ఆమె మాటను ఇప్పుడు ఎవ్వరు కూడా లైట్ గా తీసుకోలేరు. ఆమె మాటలను ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన కాంగ్రెస్ నాయకుల మాటలను తీసేసినట్టుగా తీసేయలేరు. ఆమె మాటలను హేళన చేయలేరు.ఆమె ఇప్పుడు ఒక బలమైన శక్తి.ఆమె మాటలు ఇప్పుడు చాలా పదనుగా కూడా మారాయి. టెస్టులు తక్కువగా చేస్తున్నారు అనే విషయం మొదలు మద్యం షాపులను తెరవడం వరకు ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
undefined
కేసీఆర్ ఉత్తమ్కుమార్ రెడ్డి మాటలనో, రేవంత్ రెడ్డి మాటలనోతీసిపారేసేంత తేలికగా సీతక్క మాటను తీసిపారేయలేరు(సోషల్ మీడియాలో వారి సైన్యాలు చేసే పోరాటాలను పక్కనపెడితే).ఆమెకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన మద్దతు ఉంది. ప్రజా సమస్యలపై నిజంగా పోరాడుతూముందుంటున్నారు. అధికార తెరాస చెప్పినట్టు వారి వారి నాయకులు ఎంతమంది ఈ కరోనా మహమ్మారికరాళనృత్యం చేస్తున్న వేళ కూడా బయట ఫీల్డ్ మీద తిరుగుతున్నారో తెలియదు కానీ... సీతక్కమాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటూఈ కరోనా పై పోరును సాగిస్తూనే ఉన్నారు.
undefined
ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిన వేళ, కాంగ్రెస్ పార్టీ అంతా కుదేలయినసమయంలో వారికి సీతక్క రూపంలో ఒక ఆశ కనబడుతుంది. ఆమె ఒక మాస్ లీడర్. ఆమె మాటకు ఇప్పుడు విలువ పెరిగింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న వేళ ఆమె వారికొకఆశాజ్యోతి అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. టీపీసీసీ అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తార స్థాయికి చేరుకున్న వేళ... ప్రతి ఒక్కరి అభ్యర్థిత్వానికి ఎవరో ఒకరు అడ్డు చెప్పే వేళ.... మిగిలిన నేతలెవ్వరూ మారు మాట్లాడలేని నేత సీతక్క!
undefined
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, బట్టి, హనుమంతరావు ఇలా చాంతాడంతమంది కాంగ్రెస్ నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ కరోనా సమయంలో వయసు మళ్లినవారు బయటకు రాకూడదని ప్రభుత్వాలు చెబుతున్న వేళ.... వీహెచ్ కనబడడం లేదు. ఈ మహమ్మారిసమాజంలో ఉన్నంత కాలం ఆయన ఇక బయటకు రాలేరు. కాబట్టి ఒక నేత లిస్టులోంచి తగ్గారు.ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక నేతను ఎన్నుకుంటే... వారు కేసీఆర్ కి ధీటైన రీతిలో నిలబడగలిగి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. వారి మాటను కేవలం కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజలంతా కూడా ఆలకించేలా ఉండాలి.
undefined
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ లోటు సీతక్కతో తీరేలా కనబడుతుంది. ఆమె ఇప్పుడు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. ఆమె మాటను ఇప్పుడు యావతా తెలంగాణ సమాజం శ్రద్ధగా వింటుంది. నాయకురాలిగా ఆమె పనితీరు అమోఘం. నాయకత్వ బాధ్యతలు ఆమెకు కొత్తకాదు. అప్పుడు మావోయిస్టుగా ఉన్నప్పుడే దళ కమాండర్ గా పనిచేసారు.ఇందాక మాట్లాడుకున్నట్టు ఆమె మాటను కేసీఆర్లైట్ గా తీసిపారేయలేరు. ఆమె ఇప్పుడొకప్రజా గింతుక. ప్రజా సమస్యలను దగ్గరి నుండి చూసిన, చూస్తున్న వ్యక్తి సీతక్క.
undefined
కేసీఆర్ ఎలాగైతే ఉద్యమ సమయంలో అందరి బాధలను స్వయంగా దగ్గరి నుండి చూసి ఒక బలమైన నాయకుడిగా ఎదిగారో.... ఇప్పుడు ఆమె అలా ప్రజా సమస్యలను దగ్గరి నుండి చూసి వాటిపై గొంతెత్తిపోరాడుతున్నారు.ఆమె చేసే పని ఇప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలందరికీ తెలుసు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా ఇప్పుడు మరొక్కమారు రాహుల్ గాంధీ చేతుల్లోకి వెళ్తున్న వేళ...సీతక్కకు ఇక్కడ టీపీసీసీ పగ్గాలు దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆమె అభ్యర్థిత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరూవ్యతిరేకించే పరిస్థితిలో లేరు. ఆమె వేరే పార్టీ నుంచి వచ్చింది అనే మాట అనలేరు. కారణం... ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి ఉన్న ఏకైక ఆశాకిరణంఆమె మాత్రమే! ఒకవేళ ఆమె అభ్యర్థిత్వాన్ని ఎదురిస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది!
undefined
click me!