జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేటీఆర్ కు హైదరాబాదు వరదల పోటు

First Published Oct 14, 2020, 6:56 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హైదరాబాద్ వరదల విషయం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంది. అధికార తెరాస పై అనేక అస్త్రాలను సాధించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది.

హైదరాబాద్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నిన్న సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు వర్షం కలిగించిన బీభత్సం అంతాఇంతా కాదు. రోడ్లన్నీ చెరువులయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
undefined
అనధికారిక లెక్కలప్రకారం దాదాపుగా 20 మంది వరకు మరణించి ఉంటారని అంచనా. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించడానికి రాత్రి 9.00 గంటలకే రెస్క్యూ బోట్లను వినియోగించాల్సి వచ్చిందంటే వర్షం ఏ స్థాయిలో పడిందో ఊహించుకోవచ్చు.
undefined
ఇకపోతే ఈ వర్షం దెబ్బను ప్రజలు ఇప్పుడప్పుడు మరిచిపోయేలా కనబడడం లేదు. ఇంకా కూడా నీటమునిగిన ప్రాంతాలు పూర్తి స్థాయిలో తేరుకోలేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. మూసి ఉగ్ర రూపం దాల్చింది. వరద ప్రవాహానికి మూసారాంబాగ్ బ్రిడ్జి అసలు కనబడడమే లేదు.
undefined
ఇక ఈ జోరు వానల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలెర్ట్ అయి రేయనక పగలనక శ్రమిస్తున్నారు. విద్యుత్ నుండి పోలీసు సిబ్బంది వరకు అంతా కూడా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నారు.
undefined
మంత్రి కేటీఆర్ సైతం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ... సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి సైతం నేటి సాయంత్రం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
undefined
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హైదరాబాద్వరదలవిషయం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంది. అధికార తెరాస పై అనేక అస్త్రాలను సాధించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే బీజేపీ ఇప్పటికే ఈ విషయమై రంగంలోకి దిగింది.
undefined
హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయి అంటూ రకరకాల మీమ్స్, వీడియోలు, ట్రోల్స్ తో విరుచుకుపడుతుంది. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవడాన్ని చూపెడుతూ... ఆరేండ్ల పాలనలో మారిందేమిటని ప్రశ్నిస్తున్నారు?
undefined
కేటీఆర్ చెప్పిన మాటలను పాతవాటన్నిటిని కట్ చేస్తూ హైదరాబాద్ వరదలకు సింక్ చేస్తూ హైదరాబాద్ నగరం గొప్పతనం ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఐటీమంత్రిగారు హైదరాబాద్ ఐటీకారిడార్ కూడా వరదల్లో ఉందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
undefined
ఇక తాజాగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను టార్గెట్ గా ఈ మునిగిపోయే లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసేది అంటూ కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు బీజేపీ నాయకులు.
undefined
గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ నాటికి నిర్వహించాలనే యోచనలో ఉంది. ఈ సమయంలో ఈ వరదలను చూపెడుతూ తెరాస సర్కార్ ఆధిపత్యానికి గండికొట్టాలని చూస్తున్నారు బీజేపీ నాయకులు.
undefined
మరోపక్క తెరాస నేతలేమో... ప్రకృతి కన్నెర్రజేసినదానికి ఎవరు మాత్రం ఏమి చేయగలరని చెబుతూనే.... తమకు సాధ్యమైనంత మేర నిర్విరామంగా కృషి చేస్తుంది. ఆహారాన్ని అందించడం దగ్గరినుండి రెస్క్యూ చేయడం వరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
undefined
ఇక ఈ రాబోయే ఎన్నికలు తెరాస కు అత్యంత కీలకమైనవి. తమ బలాన్ని చాటుకోవాలని చూస్తున్న బీజేపీని సైలెంట్ చేయాలంటే ఈ ఎన్నికల్లో ఘానా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో గనుక తెరాస సరైన విజయం నమోదు చేయకపోతే.... బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం గాలివాటు కాదు అని చెప్పడమే కాకుండా.... అన్ని పార్టీల్లోని నాయకులను తమ వైపుగా తిప్పుకోవడం మొదలుపెడుతుంది. మొత్తానికి రానున్న ఈ గ్రేటర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేయబోతున్నాయి. చూడాలి అందులో ఈ వరదలు ఎంతమేర ప్రభావం చూపుతాయో..!
undefined
click me!