ఎమ్మెల్సీ ఎన్నికలు: కేసీఆర్ మదిలో ఇదీ, తెర మీదికి బొంతు రామ్మోహన్

First Published Sep 17, 2020, 12:45 PM IST

గ్రేటర్ ఎన్నికలకు ముందే.... జంటనగరాల పరిధిలో తమదే బలం అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలనుకుంటుంది తెరాస. తెలంగాణాలో ఇక మీదట జరిగే ఏ ఎన్నికల్లో అయినా తెరాస ఓటమి చెందితే... కాచుకొని కూర్చున్న ప్రతిపక్షాలు అధికారపక్షం పై లంఘించేందుకు ఎదురుచూస్తున్నాయి. 

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం వైఫల్యంచెందిందన్నవాదన బలపడుతున్న వేళ..... గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది. గత కొన్ని వారాలుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సుందరీకరణ పనులను చూస్తే మనకు ఇట్టేఅర్థమవుతుంది.
undefined
ఇక ఈ గ్రేటర్ ఎన్నికలతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకో తెరాస కు అంతగా అచ్చివచ్చినట్టు కనబడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస కు భారీ షాకులే తగిలాయి.
undefined
గతంలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల సంగ్రామంలో ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ ను బరిలోకి దింపిన తెరాస కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. రామచంద్ర రావు దేవి ప్రసాద్ ని ఓడించి పట్టభద్రుల స్థానం నుండి గెలుపొందడం అధికార పక్షానికి ఊహించని దెబ్బ.
undefined
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం సాధించిన తరువాత కూడా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యేగా ఓటమి చెందిన జీవన్రెడ్డి కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ గా గెలుపొంది మరో షాక్ ఇచ్చాడు. ఇలా వరుస షాకులతో జాగ్రత్త పడుతున్న తెరాస ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది.
undefined
గ్రేటర్ ఎన్నికలకు ముందే.... జంటనగరాలపరిధిలో తమదే బలం అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలనుకుంటుంది తెరాస. తెలంగాణాలో ఇక మీదట జరిగే ఏ ఎన్నికల్లో అయినా తెరాస ఓటమి చెందితే... కాచుకొని కూర్చున్న ప్రతిపక్షాలు అధికారపక్షం పై లంఘించేందుకు ఎదురుచూస్తున్నాయి.
undefined
ఈ పరిస్థితి తలెత్తకుండా గ్రేటర్ ఎన్నికలకు ముందే హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకోవాలని అనుకుంటుంది తెరాస. దీని వల్ల రెండు లాభాలు కలుగుతాయి తెరాస కు. మొదటగా బీజేపీ నాలుగు పార్లమెంటు సీట్లు గెలిచినా అది వాపు తప్ప, బలుపు కాదు అని చెప్పే వీలవుతుంది.
undefined
ఇక మరో ప్రయోజనం.... జంట నగరాలపరిధిలో కూడా తెరాస దే హవా అని చెప్పే వీలుంటుంది. సంస్థాగతంగా ఎప్పటినుండో కూడా నగరంలో బీజేపీకి మంచి పట్టే ఉంది. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలను, ఎంపీ స్థానాలను, కార్పొరేటర్ స్థానాలను బీజేపీ ఎప్పటినుండో కూడా గెలుస్తూనే ఉంది.
undefined
ఈ నేపథ్యంలోనే బీజేపీని జంటనగరాల పరిధిలో దెబ్బతీయాలంటే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కీలకం అని భావిస్తుంది అధికార తెరాస పార్టీ. ఇందుకోసం బీజేపీని ధీటుగా ఢీకొనే ఒక గ్రేటర్ నాయకుడికోసం అన్వేషిస్తుంది.
undefined
ఇందులో భాగంగా కేటీఆర్ కన్ను ప్రస్తుత మేయర్ బొంతు రామ్ మోహన్ పై పడింది. బొంతు రామ్ మోహన్ హైదరాబాద్ మేయర్ గా అందరికి సుపరిచితం. ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ వాణిని బలంగా వినిపించాడు. వీటికి తోడు బొంతు రామ్ మోహన్ ఏబీవీపీ ప్రోడక్ట్.
undefined
ఏబీవీపీ ఉస్మానియా క్యాంపస్ ఇంచార్జి గా పనిచేసిన అనుభవం బొంతు రామ్ మోహన్ సొంతం. ఆ తరువాత అతను వెళ్లి తెరాస లో చేరాడు. దీనివల్ల బీజేపీ సానుభూతిపరుల ఓట్లు కొన్నయినా తమ వైపు మళ్ళించుకోవచ్చు అనేది వీరి ఉద్దేశం. దీని వల్ల బీజేపీ సంస్థాగత వోట్ బ్యాంకుకు ఎంతో కొంత మేర గండి కొట్టొచ్చు అని తెరాస భావిస్తుంది.
undefined
అంతే కాకుండా ఈసారి గ్రేటర్ పరిధిలో ఖరారయిన రేజర్వేషన్లలో మేయర్ పదవి బీసీ మహిళకు దక్కనుంది. కేటీఆర్ కి వీర విధేయుడైన బొంతు రామ్ మోహన్ కి తగిన గౌరవం ఇవ్వాలంటే.... అతనిని ఎమ్మెల్సీ చేయడమొక్కటే అని భావిస్తున్నారు. అంతే కాకుండా ఆయన ఎమ్మెల్సీ గా గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవిని కూడా హామీ ఇచ్చినట్టు తెలియవస్తుంది.
undefined
వేచి చూడాలి ఈ ఎన్నికల్లో తెరాస వ్యూహం ఎంతమేర సత్ఫలితాలను ఇస్తుందో...! ఈసారైనా తెరాస అనుకున్నట్టుగా ఎన్నికల ఫలితం ఉంటుందో, లేదా ఈసారి కూడా ఖంగు తినిపించాలనుకున్న పార్టీ ఖంగుతింటుందో ఆసక్తిగా మారింది!
undefined
click me!