విరాట్ కోహ్లీ సహా ప్రపంచ టాప్ 4 బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లోపాలు ఇవే!

First Published Apr 9, 2020, 4:33 PM IST

ప్రపంచ క్రికెట్‌ పరిపూర్ణ బ్యాట్స్‌మెన్‌లను అతి కొద్ది మందినే చూసింది. ఓ బ్యాట్స్‌మన్‌ ఎంత తెలివైన వాడైనా, ఎంత టెక్నిక్‌ కలిగిఉన్నా ఏదో ఒక దశలో ప్రత్యర్థులకు ఓ లోపాన్ని వదిలేస్తాడు. ఆ సమయంలో ఆ బ్యాట్స్‌మెన్‌ గొప్పతనం పరీక్షకు నిలుస్తుంది. పెవిలియన్‌కు చేర్చే ప్రమాదం ఉన్న షాట్లను ఆడకుండా కొంత మంది స్వీయ నియంత్రణ పాటిస్తే, మరికొందరు బలహీనతను తరమికొట్టి నిలిచేందుకు ప్రయత్నిస్తారు. 

వాస్తవానికి ఈ కరోనా ప్రభావం గనుక లేకుండా ఉంటే... ఈ పాటికి ఐపీఎల్ మజాలో మునిగితేలేవాళ్ళం. కానీ కరోనా వైరస్ దెబ్బకు అందరం ఇండ్లకే పరిమితమై ఈ మహమ్మారి పీడా ఎప్పుడు వదులుతుంది? లాక్ డౌన్ ముగుస్తోందా లేదా అనే ఆలోచనల్లో మునిగిపోయాము.  మొన్నటి న్యూజిలాండ్ టూర్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఇబ్బంది పడ్డాడు అనే కన్నా, న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు అనాలేమో! ఆ కివీస్ పర్యటన కోహ్లీకి, టీం ఇండియాకు ఓ పీడా కల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
undefined
ప్రపంచంలో అత్యుత్తుమ బ్యాట్స్ మెన్ లలో ఒక్కడిగా కొనసాగే విరాట్ కోహ్లీ ఇలా ఇబ్బంది పడడం ఈ మధ్య కాలంలో కొత్త కావచ్చు కానీ, గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఇలానే ఇబ్బంది పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఈ సమస్య విరాట్ కోహ్లీ ఒక్కడిది మాత్రమే కాదు. క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా కొనసాగేవారందరు ఇలా ఏదో ఒక విషయం వల్ల ఇబ్బంది పడుతున్నవారు.
undefined
ప్రపంచ క్రికెట్‌ పరిపూర్ణ బ్యాట్స్‌మెన్‌లను అతి కొద్ది మందినే చూసింది. ఓ బ్యాట్స్‌మన్‌ ఎంత తెలివైన వాడైనా, ఎంత టెక్నిక్‌ కలిగిఉన్నా ఏదో ఒక దశలో ప్రత్యర్థులకు ఓ లోపాన్ని వదిలేస్తాడు. ఆ సమయంలో ఆ బ్యాట్స్‌మెన్‌ గొప్పతనం పరీక్షకు నిలుస్తుంది. పెవిలియన్‌కు చేర్చే ప్రమాదం ఉన్న షాట్లను ఆడకుండా కొంత మంది స్వీయ నియంత్రణ పాటిస్తే, మరికొందరు బలహీనతను తరమికొట్టి నిలిచేందుకు ప్రయత్నిస్తారు.
undefined
వికెట్‌ నిలుపుకునేందుకు బలహీనతను అధిగమించటంలో పాటించే మార్గాలు కొన్నిసార్లు సఫలం కావచ్చు, మరికొన్ని సార్లు బలహీనత మరింత బలంగా తయారు కావచ్చు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ రేసులో నలుగురు పోటీపడుతున్నారు. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ సామర్థ్యం అంచనా వేయడానికి సంప్రదాయ క్రికెట్‌ షాట్లు ఆడగలిగే సత్తా, నాణ్యమైన టెక్నిక్‌ను బేరీజు వేసేవారు. ఆధునిక క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌ ప్రవేశం బ్యాట్స్‌మెన్‌ సామర్థ్యం కొలిచే కొలమానాలను మార్చివేసింది. అంతిమంగా చేయాల్సినది పరుగులే కదా, బ్యాట్స్‌మన్‌ సత్తా అవే చెబుతాయనే నిర్దారణకు వచ్చేశాం.
undefined
టీ20 ఫార్మాట్‌తో బ్యాటింగ్‌లో టెక్నిక్‌ ప్రాధాన్యత తక్కువైంది. ఈ కాలంలోనూ క్రికెట్‌ పుస్తకాల్లోని సంప్రదాయ షాట్లను ఆడుతూ, కళాత్మక బ్యాటింగ్‌ విన్యాసాలతో ఆటను ఆసక్తికరంగా నిలుపుతున్న కొందరు బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. టెస్టు క్రికెట్‌ను ప్రేమించేవారు ఆ బ్యాట్స్‌మెన్‌ ఆడే సంప్రదాయ షాట్లకు మంత్రముగ్ధులవుతారు. టెస్టు క్రికెట్‌లో సహనం, ఏకాగ్రతలు బ్యాట్స్‌మన్‌లో పరుగుల దాహగ్నిని రగిలిస్తాయి. ఫీల్డింగ్‌ కెప్టెన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉన్న ఫీల్డింగ్‌ మొహరింపుల్లో బ్యాట్స్‌మన్‌ను ఓ రకంగా పద్మవ్యూహంలో బంధిస్తారు. అప్పుడు సంప్రదాయ క్రికెట్‌ షాట్లతో పద్మవ్యూహన్ని ఛేదించి శతక బాజాలు మోగిస్తున్న వారిలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌, ఆసీస్‌ మాజీ నాయకుడు స్టీవ్‌ స్మిత్‌, న్యూజిలాండ్‌ లీడర్‌ కేన్‌ విలియమ్సన్‌ ముందున్నారు. ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న ఈ నలుగురు బ్యాట్స్‌మెన్‌ లోపాలు ఏమిటో తెలుసుకుందాం.
undefined
వరల్డ్‌ క్రికెట్‌ సూపర్‌-4లో ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ ఒకరు. కోహ్లి, స్మిత్‌, విలియమ్సన్‌లతో పోల్చితే రూట్‌ శతకాల రేటు తక్కువ. అయినా, ఇంగ్లాండ్‌ గడ్డపై ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌గా రూట్‌ కితాబు అందుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత రూట్‌ శతక దారిలోనే ఎక్కువగా వికెట్‌ కోల్పోతున్నాడు. వికెట్ల మీదకు దూసుకొచ్చే బంతులను ఆడటంలో రూట్‌ సమన్వయం కోల్పోతున్నాడు. 2017-18 యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ సీమర్‌ పాట్‌ కమిన్స్‌ ఈ బలహీనతను బయటపెట్టాడు. రూట్‌కు వరుసగా అవుట్‌స్వింగర్లు సంధించిన కమిన్స్‌, అనూహ్య ఇన్‌స్వింగర్‌తో వికెట్‌ తీసుకున్నాడు.
undefined
అవుట్‌స్వింగర్‌ భ్రమలో ఆడిన రూట్‌, ఇన్‌స్వింగర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. యాషెస్‌ సిరీస్‌ నుంచి ఆడిన 18 టెస్టుల్లో రూట్‌ ఈ విధంగా 9 సార్లు వికెట్‌ కోల్పోయాడు. రూట్‌ ముందు ప్యాడ్‌ బంతి లైన్‌లో ఉండటం, బ్యాట్‌ కిందకు రావటానికి సమయం పడుతుండటం ఎల్బీడబ్ల్యూ అవుట్‌కు ఎక్కువ ఆస్కారం ఇచ్చింది. ఈ బలహీనత అధిగమించేందుకు జో రూట్‌ తన బ్యాటింగ్‌ టెక్నిక్‌, స్టాన్స్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. దీంతో ఇన్‌స్వింగర్‌ ఫోబియో నుంచి కాస్త ఉపశమనం లభించినా, పూర్తిగా ముప్పు తొలగలేదు. చాలా జట్లు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రూట్‌ను వెనక్కి పంపుతున్నాయి. జో రూట్‌ రోజురోజుకు మెరుగవతున్న బ్యాట్స్‌మన్‌. భవిష్యత్‌లో ఈ లోపం నుంచి పూర్తిగా బయటపడతాడేమో చూడాలి.
undefined
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వరల్డ్‌ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి నిలుస్తున్నాడు. వన్డేల్లో విరాట్‌ మేనియా పూర్తిగా కొత్త పుంతలు తొక్కుతుంది. టెస్టుల్లో సైతం విరాట్‌ కోహ్లిని పెవిలియన్‌కు చేర్చటం అంత సులువు కాదు. అన్ని ఫార్మాట్లలోనూ బ్యాటింగ్‌ సగటు 50 పైనే. ఎంత కఠిన పరిస్థితుల్లో ఆడితే విరాట్‌ కోహ్లి అంత గొప్ప విజయాలు సాధించగలడు అనే నానుడి సృష్టించాడు. అలాంటి విరాట్‌ కోహ్లికి బలహీనత ఏముంటుంది? 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో జేమ్స్‌ అండర్సన్‌ ఈ బలహీనతను ఎత్తి చూపాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ లైన్‌లో బంతులతో విరాట్‌ను నియంత్రివచ్చని ఇప్పుడు అందరికి తెలుసు.
undefined
2014 ఇంగ్లాండ్‌ పర్యటన కెరీర్‌లో అత్యంత ఇబ్బంది పడిన సమయం అని కోహ్లి స్వయంగా ఒప్పుకున్నాడు. 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో 600 ప్లస్‌ పరుగులు చేసి, ఇంగ్లీష్‌ పరిస్థితుల్లోనూ ఇరగదీస్తానని చాటి చెప్పాడు. మిగతా బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడిన చోట పరుగుల ప్రవాహం పారించాడు. ఇక కోహ్లిలో లోపం ఎక్కడుంది?. విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభంలో వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఎక్కువ. ఆరంభంలో బౌలర్లకు ఎక్కువగా అనిశ్చితితో కూడిన బంతులను సంధించాలి. కోహ్లి బంతిని డ్రైవ్‌ చేసేందుకు ఎదురుచూడాలి. న్యూజిలాండ్‌ ఇదే వ్యూహం అమలు చేసింది. కవర్‌ డ్రైవ్‌ ఇష్టపడే కోహ్లిని డ్రైవ్‌ చేసేందుకు ఉసిగొల్పింది. కివీస్‌పై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 7, 43, 15, 30 బంతులనే కోహ్లి ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్‌ ఇందుకు పక్కా ప్రణాళికను సహనంతో, జట్టుగా అమలు చేసింది. కవర్‌ డ్రైవ్‌ ఆడటంలో విరాట్‌ కోహ్లి నిపుణుడు. అటువంటిది ఆ షాట్‌ ఆడించటంతోనే విరాట్‌ను అవుట్‌ చేయటం న్యూజిలాండ్‌ నయా వ్యూహ చతురతకు నిదర్శనం.
undefined
క్రికెట్‌ పుస్తకాల్లోని సంప్రదాయ షాట్లు ఆడటంలో మిగతా ముగ్గురి కంటే దిట్ట, చూడచక్కని స్ట్రోక్‌ప్లేయర్‌ అయినా సూపర్‌-4లో కేన్‌ విలియమ్సన్‌కు అండర్‌డాగ్‌ ట్యాగ్‌ ఉంది!. 2019 ముందు వరకు విలియమ్సన్‌కు వరల్డ్‌ క్రికెట్‌లో అభిమానులు సైతం తక్కువ. కానీ 2019 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత విలియమ్సన్‌కు అభిమాన ఆదరణ గణనీయంగా పెరిగింది. జెంటిల్‌మెన్‌ గేమ్‌లో గెలుపును, ఓటమిని చిరునవ్వుతో స్వీకరించే గొప్ప క్రీడా స్ఫూర్తి కలిగిన క్రికెటర్‌, నాయకుడిగా కేన్‌ విలియమ్సన్‌ అభిమానుల్లో వెలకట్టలేని ప్రేమను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్‌ సగటు 50కి పైనే.
undefined
ఆసియాలో సైతం 45కి పైగా సగటుతో పరుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో భారత్‌ అరంగ్రేటం నాటి నుంచి విలియమ్సన్‌ బ్యాటింగ్‌కు తిరుగులేదు. తొలుత ప్రజ్ఞాన్‌ ఓజా లెఫ్టార్మ్‌ స్పిన్‌, ఆ తర్వాత అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్‌కు కేన్‌ వరుసగా వికెట్లు కోల్పోయాడు. స్వీప్‌ షాట్‌, లేట్‌ కట్‌ షాట్‌, బలమైన ఢిఫెన్స్‌ కేన్‌ను ఏ తరహా బౌలింగ్‌నైనా ఎదుర్కొనేలా చేశాయి. విలియమ్సన్‌ను ఏ బౌలర్‌ ప్రత్యేకించి ఓ తరహా బంతితో వెనక్కి పంపించలేదు. కానీ సీమర్లు మంచి లెంగ్త్‌తో బంతులు వేస్తే విలియమ్సన్‌ వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఎక్కువ. సూపర్‌-4 బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి, స్మీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌లు ప్రత్యర్థులకు అంత సులువుగా చిక్కే స్వభాగం కలిగిన వారు ఏమాత్రం కాదు. బౌలర్లపై ఎదురులేని ఆధిపత్యం కోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తారు. ప్రత్యర్థి వ్యూహలను ముందే పసిగట్టి అధిగమించేందుకు నిత్య విద్యార్థిలా శ్రమిస్తారు. ఏ బలహీనతను దీర్ఘకాలం ఉండనివ్వరు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్నారు. ఫార్మాట్‌ ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా, బౌలర్లు ఎవరైనా నిలకడగా రాణించటం వీరికి అలవాటుగా మారింది. మరి అలాంటి బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవాలంటే బౌలర్లు సైతం నిలకడగా క్రమశిక్షణతో గురిపెడితేనే సఫలం కాగలరు.
undefined
టెస్టు ఫార్మాట్‌నే తీసుకుంటే విరాట్‌ కోహ్లిపై స్టీవ్‌ స్మిత్‌ది స్పష్టమైన పైచేయి. నిరుడు యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ పరుగుల సునామి సృష్టించాడు. స్మిత్‌ను అవుట్‌ చేసేందుకు ఇంగ్లాండ్‌ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. కానీ ఏ వ్యూహమూ పనిచేయలేదు. స్మిత్‌ జోరుకు అడ్డుకట్ట పడలేదు. కానీ న్యూజిలాండ్‌పై స్మిత్‌ ఆట సాగలేదు. స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఎటువంటి లోపం లేదు. కానీ స్మిత్‌ను చిరాకు పెట్టించే బంతులతో అవుట్‌ చేసే మార్గాన్ని కివీస్‌ పేసర్‌ నీల్‌ వేగర్‌ కనుగొన్నాడు.
undefined
యాషెస్‌ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ బౌన్సర్లు స్మిత్‌ను భయపెట్టాయి. రెండో టెస్టులో ఓ బంతి మెడకు కాస్త దిగువన బలంగా తగిలింది. న్యూజిలాండ్‌తో స్వదేశీ సిరీస్‌ నీల్‌ వాగర్‌ షార్ట్‌ బాల్‌తో స్మిత్‌ను ఇరుకున పెట్టాడు. స్మిత్‌ను బాడీని లక్ష్యంగా చేసుకుని షార్ట్‌ బంతులు సంధించి అతడిలో అసహనాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇదే స్మిత్‌కు లోపమై, న్యూజిలాండ్‌కు వరమైంది. విరాట్‌ కోహ్లి తరహాలోనే స్మిత్‌నూ (నిజానికి ముందు స్మిత్‌పైనే తొలి ప్రయోగం) కివీస్‌ పక్కా వ్యూహం అమలు చేసింది. లెగ్‌ గల్లీలో ఓ ఫీల్డర్‌, స్వ్కేర్‌ లెగ్‌లో క్యాచ్‌ కోసం ఓ ఫీల్డర్‌ ఎదురుచూడటం స్మిత్‌ బ్యాటింగ్‌ సమయంలో సాధారణమైంది. వరుస షార్ట్‌ బంతులతో స్మిత్‌ను అసహనానికి గురి చేసి, క్యాచౌట్‌ చేయటంలో వాగర్‌ సక్సెస్‌ అయ్యాడు. మూడు మ్యాచుల సిరీస్‌లో వాగర్‌ స్మిత్‌ను నాలుగు సార్లు ఈ విధంగా అవుట్‌ చేశాడు.
undefined
click me!