తిరగబడుతున్న స్థితి: కేసీఆర్ తో ఢీకి రేవంత్ రెడ్డి వ్యూహం ఇదీ...

Published : Sep 02, 2020, 08:59 AM IST

అధికార పక్షం పై దాడి చేయడం వల్ల కేసీఆర్ ని టార్గెట్ చేసే ఏకైక నాయకుడిగా ప్రోజెక్టు అవడమే కాకుండా, కాంగ్రెస్ లో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కునే నాయకుడు కేవలం రేవంత్ మాత్రమే అనే పబ్లిక్ పెర్సెప్షన్ ను క్రియేట్ చేస్తున్నారు. 

PREV
112
తిరగబడుతున్న స్థితి: కేసీఆర్ తో ఢీకి రేవంత్ రెడ్డి వ్యూహం ఇదీ...

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ తొలి ఐదేండ్లలో ఎలాంటి ప్రజాభిమానాన్ని చూరగొన్నదో అందరికి తెలిసిందే. ఆ అభిమానమే తెలంగాణాలో కేసీఆర్ కి బ్రహ్మాండమైన విజయాన్ని 2018లో అందించి పెట్టింది. కానీ రెండవ దఫాలో మాత్రం కేసీఆర్ కి పరిస్థితులు అంతలా అనుకూలిస్తున్నట్టుగా కనబడడంలేదు. 

212

కరోనా వైరస్ కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ పై తొలినాళ్లలో పొగడ్తల వర్షం కురిపించిన ప్రజలు తరువాతి కాలంలో హై కోర్టు మొట్టికాయలు, కేంద్రం అక్షింతలు అన్ని వెరసి... ఈ మహమ్మారి కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ విఫలమైందనే భావన మొదలయింది. 

312

ఇప్పటికే ఈ సమస్యతోనే ప్రభుత్వం ఇబ్బంది పడిపోతుంటే... తాజాగా కురిసిన భారీ వర్షాలకు జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. వరదపోటెత్తడంతో తెలంగాణ అంతా అలుగు పోసింది. 

412

కేసీఆర్ కి కొరకరాని కొయ్యగా తయారైన రేవంత్ రెడ్డి ఈ వరదల వల్ల కొండపోచమ్మ సాగర్ కు జరిగిన నష్టాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో విరుచుకుపడుతున్నారు. స్వయంగా కేసీఆర్ ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ పరిస్థితి ఇది అంటూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసారు. 

512

కొండపోచమ్మ కథలు పేరిట ఆయన ఈ ట్వీట్లను చేసారు... "కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ లో అవినీతి ఆనవాళ్లు అనంతం. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే...తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు...సిగ్గు!" అంటూ పోస్ట్ చేసారు. 

612

ఆ తరువాత మరో ట్వీట్లో "కొండపోచమ్మలో అవినీతికి పోలీసు కాపలా! కూలిన వంతెన బాగోతం ప్రపంచానికి తెలియకుండా ఇదిగో ఇలా ఖాకీ పహారాతో జనం కళ్లుకప్పే యత్నం. సిగ్గు...సిగ్గు!" అంటూ ట్వీట్ చేసారు. 

712

ఇలా కేసీఆర్ మీద రేవంత్ గన్ను ఎక్కుపెట్టడం ఇది కొత్త కాదు. ఆయన ఎప్పటినుండో కూడా రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారుపై ఘాటైన విమర్శలను చేస్తూనే ఉన్నాడు. ప్రతిపక్షం నుంచి కేసీఆర్ కి వ్యతిరేకంగా వినబడే ఏకైక గొంతుక రేవంత్ అనే విషయం నిర్వివాదాంశం. 

812

రేవంత్ ఇలాంటి ట్వీట్ల ద్వారా కేసీఆర్ ని ఎక్స్ పోజ్ చేస్తూ... రాష్ట్రంలో తన స్థానాన్ని స్థిరీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇలా అధికార పక్షం పై దాడి చేయడం వల్ల కేసీఆర్ ని టార్గెట్ చేసే ఏకైక నాయకుడిగా ప్రోజెక్టు అవడమే కాకుండా, కాంగ్రెస్ లో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కునే నాయకుడు కేవలం రేవంత్ మాత్రమే అనే పబ్లిక్ పెర్సెప్షన్ ను క్రియేట్ చేస్తున్నారు. 

912

దీనివల్ల రేవంత్ కి రెండు లాభాలు కలుగనున్నాయి. ఒకటి కాంగ్రెస్ నాయకులందరికన్నా తానే బెటర్ అని, ఒక వేళా పీసీసీ అధ్యక్ష పదవిని గనుక ఇస్తే అది తనకే అనే ఇండికేషన్ ను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్టవుతుంది. 

1012

ఒకవేళ తనకు గనుక పీసీసీ పదవి దక్కనట్టయితే.... రేవంత్ తన సొంత అజెండాతో ముందుకెళ్లాలని యోచిస్తున్నారు. సొంతగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టె ఆలోచనలో రేవంత్ ఉన్నారనేది ఈ మధ్య వినబడుతున్న మాట. రేవంత్ సొంత పార్టీ పెట్టి లాభపడాలంటే... కేసీఆర్ కి ధీటైన నాయకుడు అని అనిపించుకోవాలి. కేసీఆర్ మీద చేస్తున్న ఈ యుద్ధం రేవంత్ ఇమేజ్ ని పెంచడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. 

1112

1212

ఒకవేళ రేవంత్ ప్రాంతీయ పార్టీ పెడితే.... ప్రతిపక్షాలలో బలమైన ప్రతిపక్షం తానే అని నిరూపించుకోవాలిసి ఉంటుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నిటిని కూడగట్టాలంటే.... రేవంత్ ఒక బలమైన లీడర్ గా ఎదగాల్సి ఉంటుంది. అందుకు ఈ విధమైన దాడి ఎంతగానో ఉపయోగపడనుంది. ఏదిఏమైనా రేవంత్ ప్రస్తుత స్ట్రాటెజితో తాననుకుంటున్నదాన్నయితే సాధిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. 

click me!

Recommended Stories