పవన్ కల్యాణ్ జోరు తగ్గించడం వెనక బిజెపి వ్యూహం...

First Published | Aug 30, 2020, 10:31 AM IST

పత్రిక ప్రకటనలు వద్ధులుతున్నారు తప్పితే.... పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆక్టివ్ గా ఉన్నట్టు మాత్రం కనబడడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన రాజకీయ ఆక్టివిటీ పెద్దగా లేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంగ్రీ యంగ్మ్యాన్.....పవన్ కళ్యాణ్ పెద్దగా కనబడడం లేదు. చాతుర్మాస దీక్ష అంటూ ఆయన హైదరాబాద్ లోని తన ఫార్మ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఫార్మ్ హౌజ్ నుంచికూడా బయటకు పెద్దగా రావడం లేదు. మొన్నామధ్య నితిన్ పెళ్లి సందర్భంగా ఒకసారి కనిపిస్తే.... మరల ఆగష్టు 15 నాడు జెండావిష్కరణ కార్యక్రమంలో కనిపించారు.
పత్రిక ప్రకటనలు వద్ధులుతున్నారు తప్పితే.... పవన్ కళ్యాణ్రాజకీయంగా ఆక్టివ్ గా ఉన్నట్టు మాత్రం కనబడడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన రాజకీయ ఆక్టివిటీ పెద్దగా లేదు. ఇంతకుమునుపు ఆయన ఫీల్డ్ మీద లేకపోయినప్పటికీ.... ఆయన సోషల్ మీడియాలో ఆ విషయంపై స్పందించేవారు. కానీ ఈ మధ్య అది బాగా తగ్గిపోయింది.

పత్రిక ప్రకటనలు వద్ధులుతున్నారు తప్పితే.... పవన్ కళ్యాణ్రాజకీయంగా ఆక్టివ్ గా ఉన్నట్టు మాత్రం కనబడడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన రాజకీయ ఆక్టివిటీ పెద్దగా లేదు. ఇంతకుమునుపు ఆయన ఫీల్డ్ మీద లేకపోయినప్పటికీ.... ఆయన సోషల్ మీడియాలో ఆ విషయంపై స్పందించేవారు. కానీ ఈ మధ్య అది బాగా తగ్గిపోయింది.
ఆగస్టు నెలలో ఆయన పింగళి వెంకయ్య జయంతి నాడు జనసేన, వెంకయ్య నాయుడుల ట్వీట్లను రీట్వీట్ చేయగా... అమిత్ షా గారికి కరోనా వచ్చిందని తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ మరొక ట్వీట్ చేశారు. అంతే తప్ప ఆయన ట్విట్టర్ టైం లైన్ మీద కూడా ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ కూడా రిజిస్టర్ అవలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక విషయాలు రాజకీయంగా హాట్ టాపిక్ గా ఉన్నాయి. అమరావతి అంశం నుంచి మొదలుకొని ఆవ భూములు, పేదలకు ఇండ్ల పట్టాలు వంటి అంశాలను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్న వేళ... పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఏమిటి మీరు కనబడడం లేదు అంటే... కరోనా కాలంలో రాజకీయాల అని అంటారు. అంతే తప్ప రాజకీయంగా మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
పవన్ ఇలా సైలెంట్ గా ఉండడానికి కారణం బీజేపీ అని ఒక టాక్ నడుస్తుంది. గతంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వినిపించినప్పటికీ.... ఈ మధ్య మాత్రం పవన్ కళ్యాణ్ నిశ్శబ్దానికి కారణం బీజేపీనే అని విస్తృతమైన చర్చ నడుస్తుంది.
రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని బీజేపీ బలపడాలని చూస్తుందని, అది ఈ పరిస్థితుల్లో జరగాలంటే... పవన్ కళ్యాణ్ కొంత కాలంపాటు సైలెంట్ అయిపోవాలని వారు దిశా నిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీ స్పీడ్పెంచిందని అంటున్నారు.
గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ బీజేపీ. రాష్ట్రంలో సంస్థాగతంగా నిర్మాణం లేదు. రాష్ట్రంలో కూడా చరిష్మా కలిగిన నాయకుడు లేడు. కేంద్రంలో అధికారంలో ఉండడం, మోడీ వంటి చరిష్మా కలిగిన నేత ప్రధానిగా ఉండడం మినహా వారికి వేరే ప్లస్సులు మాత్రం లేవు.
కాబట్టి వారిప్పుడు రాష్ట్రంలో బలపడాలంటే.... టీడీపీని ఖాళీ చేపించి, ఆ నాయకులందరినీ బీజేపీలోకి ఆహ్వానించాలి. ప్రస్తుతం టార్గెట్ టిడిపిగా కమలనాథులు దూసుకుపోతున్నారు. సోము వీర్రాజు ను అధ్యక్షుడిగా నియమించడం దగ్గరినుంచి.... మొన్నటి రామ్ మాధవ్ స్పీచ్ వరకు ఇందులో అర్ధమయ్యే విషయం ఇదే..!
వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేక టీడీపీలోని నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. కొందరు నేరుగా వైసీపీలో చేరుతుండగా... వైసీపీలోకి వెళ్లలేని మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. ఇలా చేరికలు జరిగేటప్పుడు జనసేన అనే ఆప్షన్ ని టీడీపీ నుండి వెడలేనాయకుల ముందు ఉంచొద్దనుకుంటుంది బీజేపీ.
అలా టీడీపీ నుండి వచ్చి చేరిన కొంతమంది ద్వారా అయినా... బీజేపీ క్రమంగా బలపడుతుంది అనే ఇమేజ్ వచ్చెనంతవరకు జనసేనాని ఇలా సైలెంట్ గా ఉండాలని వారు చెప్పారంట. అందుకోసమే జనసేన ప్రస్తుతం అరకొర టీవీ డిబేట్లలో కనిపిస్తుంది తప్ప.... పెద్దగా గ్రౌండ్ మీద మాత్రం కనబడడం లేదు.
బీజేపీ బలపడిన తరువాత జనసేన గనుక ఒకింత బలంగా ఉంటే ఓకే. లేదంటే జనసేనను సైతం బీజేపీలో కలిపేసుకుని పవన్ ని స్టార్ క్యాంపెయినర్ చేసేసి 2024లో సోము వీర్రాజు అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లాలని యోచన చేస్తుందట బీజేపీ అధినాయకత్వం.అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇలా మౌనముని అవతారమెత్తారని, జనసేన కూడా రాజకీయంగా ఆక్టివ్ గా లేదని విశ్లేషణలు వినబడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడకపోవడంతో.... జనసైనికులు సైతం అసహనంగానే ఉన్నారు.

Latest Videos

click me!