జూ.ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్: నారావారి పార్టీగా టీడీపీ, భవిష్యత్తు?

First Published | Jun 24, 2020, 7:08 AM IST

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 70 సంవత్సరాలు. వచ్చే 2024 ఎన్నికల నాటికి ఆయన వయసు 74 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆ ఎన్నికను కూడా ఎదుర్కోగలరు. ఆయన చాల ఆరోగ్యంగా ఉన్నారు. అందులో సందేహం లేదు. కానీ ఆ తరువాతి ఎన్నికలను పోరాడాల్సి వచ్చేసరికి ఆయన దాదాపుగా 80వ పడిలోకి ప్రవేశిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతానికి మంచి జోరు మీదున్నాయి. టీడీపీ నాయకుల అరెస్టులు, రమేష్ కుమార్ వ్యవహారం, మరల లైం లైట్లోకి వచ్చిన మూడు రాజధానుల వ్యవహారం...అన్ని వెరసి మంచి కాకమీద ఉన్నాయి.
undefined
ఒక పక్క జగన్ రాజకీయంగా దూసుకుపోతున్నాడు. టీడీపీని చూస్తే ఇంకా చంద్రబాబే బరువు బాధ్యతలన్నిటిని మోస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్య విషయం జరిగినా... చంద్రబాబు వచ్చే ప్రెస్ మీట్ నిర్వహించాలి, ఆయనే ఆ పోరాటానికినాయకత్వం వహించాల్సి వస్తుంది.
undefined

Latest Videos


ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 70 సంవత్సరాలు. వచ్చే 2024 ఎన్నికల నాటికి ఆయన వయసు 74 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆ ఎన్నికను కూడా ఎదుర్కోగలరు. ఆయన చాల ఆరోగ్యంగా ఉన్నారు. అందులో సందేహం లేదు. కానీ ఆ తరువాతి ఎన్నికలను పోరాడాల్సి వచ్చేసరికి ఆయన దాదాపుగా 80వ పడిలోకి ప్రవేశిస్తారు.
undefined
దీన్ని బట్టి చూస్తుంటే... ఇప్పటికిప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే... తాను వెనకాల ఉండి రాజకీయ నాయకత్వ మార్పును జరిపించాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో డీఎంకే లో ఇలా కరుణానిధి ఉన్నప్పుడే నాయకత్వ మార్పు సరైన రీతిలో జరగడంతో... ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం.
undefined
కరుణానిధి నీడలోనే స్టాలిన్ ని డీఎంకే తదుపరి నాయకుడిగా ప్రకటించేశారు. దానితో ఆయన మరణం తరువాత పార్టీలో పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు. నాయకత్వ పోరు జరగకుండానే సాఫీగా డీఎంకే రాజకీయ పార్టీగా దూసుకుపోతుంది.
undefined
మరోవైపు అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే ఇందుకు పూర్తి భిన్నంగా... రాజకీయ వారసులెవ్వరంటూ కొన్నాళ్లకిందటి వరకు ఆ యుద్ధమే జరిగింది. ఇప్పటికి సమసిపోయినట్టు కనబడుతున్నప్పటికీ... అది నివురుగప్పిన నిప్పులా అలానే ఉంది.
undefined
ఈ పరిస్థితులను చూస్తున్న చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ ని తన తరువాత పార్టీ నాయకుడిగా, తన రాజకీయ వారసత్వానికి వారసుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి.
undefined
ఈ ప్రయత్నాల్లో భాగంగానే లోకేష్ ను 2014 ఎన్నికల విజయం తరువాత ముందు స్సీట్లోకి తీసుకువచ్చారు.మంత్రిగా నియమించడం జరిగింది కూడా ఇందుకే. లోకేషే తన తరువాత పార్టీని నడుపడుతాడు అని ప్రకటించడానికి, ఆ సంకేతాలను స్పష్టంగా అందరికి కనబడేలా చేయడానికి చంద్రబాబు.... హరికృష్ణ, ఎన్టీఆర్ లను దూరం పెట్టాడు.
undefined
ఇప్పుడు హరికృష్ణ లేరు. ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంటి ముట్టనట్టుగా పార్టీ నుంచే దూరం వహిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నాను అని అంటున్నారు. 2018 డిసెంబర్ లో తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుహాసిని ఎన్నికల్లో నిలబడ్డప్పటికీ.... జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రచారానికి రాలేదు. సొంత అక్క కోసం కూడా ప్రచారానికి రాలేదు ఎన్టీఆర్.
undefined
ఇలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది, దానికి తోడుగా కొందరి వ్యాఖ్యలు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు భరత్ కూడా ఈ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసాడు.
undefined
పార్టీకి ఎవరి అవసరం లేదని, వారే కావాలనుకుంటే రావాలని జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడాడు భరత్. బాలకృష్ణ ఏ స్థాయిలో పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. ఆయన అంత ధీటైన రాజకీయనాయకుడా అనేది ఇంతవరకు ఎక్కడా నిరూపితమవలేదు.
undefined
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇంకోపక్క జగన్ దూకుడు. జగన్ అన్ని వైపులనుండి దూసుకొస్తూ, టీడీపీ మీద దాడిని ముమ్మరం చేస్తూ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
undefined
ఒకవైపు అరెస్టులు, నాయకులూ టీడీపీని వీడుతున్నారు. పెరుగుతున్న జగన్ గ్రాఫ్. ఈ సందర్భంలోనే టీడీపీలో రాజకీయ మార్పు జరగాల్సిన సమయం. జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో తోడుగా ఉండాల్సిన కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. కుటుంబం కలిసికట్టుగా లేదు.
undefined
nara lokesh
undefined
click me!