తెలంగాణ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కేసులు పెరిగిపోతుండడంతోపాటుగా తెలంగాణలోమరణాల సంఖ్య కూడా విస్తుపోయేలా ఉన్నాయి. భారతదేశ మొత్తంతో పోల్చి చూస్తే తక్కువే అని తెలంగాణ సర్కార్ చెబుతున్నప్పటికీ.... తెలంగాణ సర్కార్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి మాత్రం ఇవి చాలా భయం గొలిపే లెక్కలు.
undefined
ఈ కరోనా వైరస్ విషయంలో రోజు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు. అంతే తప్ప కేటీఆర్ మాత్రం మాట్లాడడం లేదు. యువనాయకుడు తెలంగాణలో ఒక విజన్ ఉన్న నేతగా చెప్పే కేటీఆర్ మాత్రం కరోనా వ్యాప్తిపై ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు.
undefined
తెలంగాణలో 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుండి ఫోకస్ అంతా కూడా కేటీఆర్ పైన్నే ఉంది. యువరాజు పట్టాభిషేకం తథ్యం అనే సిగ్నల్స్ వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనుకాలే వెన్నంటి నడిచిన హరీష్ రావు తెలంగాణ ఏర్పడ్డాక స్క్రీన్ పై పెద్దగా కనబడలేదు.
undefined
జిహెచ్ఎంసి ఎన్నికలు మొదలు కేటీఆర్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయ్యారు. అలా నెమ్మదిగా తొలిసారి కేసీఆర్ అధికారం చేపట్టినప్పుడు మొదలు తన ఇమేజ్ గ్రాఫ్ ని పెంచుకున్నారు.
undefined
కేటీఆర్ ఇమేజ్ ఏ లెవెల్ లో పెరిగిందంటే.... కేటీఆర్ తో లోకేష్ ని పోల్చి కేటీఆర్ లా ఉండాలి కానీ లోకేష్ లా పప్పులా కాదు అంటూ అప్పటి ఏపీప్రతిపక్ష వైసీపీ లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.హైదరాబాద్ లో అంతర్జాతీయఈవెంట్లు నిర్వహించడం వల్ల కేటీఆర్ ఇమేజ్ తార స్థాయికి చేరింది.
undefined
2018 ఎన్నికలప్పుడు పూర్తిగా కేటీఆర్ ఆధీనంలోనే పూర్తిగా పార్టీ కార్యకలాపాలు నడిచాయి. టిక్కెట్ల కేటాయింపు నుండి ప్రచార కార్యక్రమాల వరకు అన్ని కేటీఆర్ ఏ చూసుకున్నారు. ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన తరువాత తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గాబాధ్యతలు చేపట్టారు.
undefined
కేటీఆర్ తన వారసుడు అని కేసీఆర్ చెప్పకనే చెప్పాడు. హరీష్ రావు దాదాపుగా సైడ్ అయిపోయాడు. తెలంగాణాలో ఇప్పడు నాయకుడు అంటే కేటీఆర్ అన్న విధంగాఎదిగాడు. యువతలో మంచి క్రేజ్ సంపాదించాడు. తాను సైతం ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచే రావడం, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ బాగా అభివృద్ధి చెందుతుండడం అన్నీ వెరసి కేటీఆర్ ఒక విజనరీ నాయకుడిగా ఎదిగాడు.
undefined
ఇది మొన్నటి వరకు లెక్క. కానీ తెలంగాణాలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ... కేటీఆర్ మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ట్విట్టర్ లో ఎవరికీ ఏ చిన్న ఆపద వచ్చిందన్నా ముందుండి సహాయం చేసే కేటీఆర్ కరోనా వైరస్ వల్ల మాకు ఊపిరాడక సచ్చిపోతున్నామంటూ రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ.... ఆయన మాత్రం స్పందించటం లేదు.
undefined
కరోనా తొలినాళ్లలో తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా నిర్వహిస్తున్నారన్నప్పుడు ప్రభుత్వ వాణిని ఆయన బలంగా వినిపించారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి కేసులు పెరగకుండా చూస్తామని అన్నారు. కానీ ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పుడు మాత్రం ఆయన కనబడడం లేదు.
undefined
ఇప్పటికి కూడా కరోనా వైరస్ టెస్టింగ్ తక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్రం పై అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. విశ్లేషకులు, శాస్త్రవేత్తలయితే తెలంగాణ ఒక కరోనా టైం బాంబు మీద కూర్చొని ఉందని అంటున్నారు.గాంధీ డాక్టర్లు రోడ్డెక్కి సమ్మె నిర్వహించినప్పుడు తెలంగాణ వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ల్యాబ్ టెక్నిషియన్ల దగ్గరి నుండి డాక్టర్ల వరకు అనేకవైద్య సిబ్బంది కొరత తెలంగాణాలో ఉంది.
undefined
ట్విట్టర్ వేదికగా ఈ విషయాలన్నీ అందరూ ప్రస్తావిస్తూనే మాత్రం మాట్లాడడం లేదు. ఆయన అసలు కరోనా అనేసమస్యే తెలంగాణలో లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయంగా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నప్పటికీ.... కరోనా వైరస్ విషయంలో మాత్రం మాట్లాడడం లేదు. ఏది ఏమైనా ఈటెల మాత్రమే మాట్లాడుతున్నారు. కేటీఆర్ అభిమానులు సైతం ఈ విషయంలో ఆయన స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
undefined
కేటీఆర్ అంటే ఉండే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కరోనా వైరస్ వల్ల వెల్లువెత్తిహుతున్న నిరసనలకు కొట్టుకుపోతుంది. ఒకపక్క హై కోర్ట్, ఒక పక్క కేంద్రం, మరోపక్క ప్రతిపక్షాలు అందరూ ఈ విషయంలో ముప్పేట దాడి చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకింత సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నప్పటికీ... సోషల్ మీడియాలో మాత్రం వ్యతిరేకత తీవ్రమవుతుంది. ఇది బ్రాండ్ కేటీఆర్ కి చాలా ప్రమాదం.
undefined