కొన్ని రోజుల కింద హీరోయిన్ మాధవీలత పవన్ కళ్యాణ్ పై చేసిన ఒక వ్యాఖ్యను పదే పదే టీవీ9 ప్రచారం చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై జనసేన పార్టీ టీవీ9 కి ఒక లేఖ కూడా రాసింది. పదే పదే వ్యాఖ్యలను ప్రసారంచేయడం ఏమిటని వాపోయింది.
undefined
పవన్ అభిమానులు ఏకంగా షేమ్ ఆన్ టీవీ9 పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేసారు. దీనిపై చాలా తీవ్రంగా స్పందించిన పవన్ ఫ్యాన్స్ టీవీ9 గతంలో ప్రసారం చేసిన వాటిని వెతికి ట్రోల్స్ రూపంలోసోషల్ మీడియాలోపోస్ట్ చేస్తుపవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేయడంతో.... జనసైనికులు తీవ్ర ఆగ్రహం చెందారు.పవన్ అభిమానులు ఏకంగా "షేమ్ లెస్టీవీ9" పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేసారు. దీనిపై చాలా తీవ్రంగా స్పందించిన పవన్ ఫ్యాన్స్ టీవీ9 గతంలో ప్రసారం చేసిన వాటిని వెతికి ట్రోల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.న్నారు.
undefined
గతంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా టీవీ9 చీప్ పబ్లిసిటీ కోసం ఇలానే ప్రసారం చేసిందని గుర్తు చేస్తున్న అభిమానులు.... బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ అయిన న్యూస్ యాంకర్దేవి నాగవల్లి ని టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడిచింది. ఆమెను ఎలిమినేట్ చేయడానికి వోటింగ్ ఎలా సాగాలో కూడా ఫాన్స్ గ్రూపుల్లో చర్చలు నడిచాయి.
undefined
టీవీ9 పై కారాలు మిర్యాలు నూరుతూగుర్రుగా ఉన్న జనసేనాని అభిమానులు ఉన్నట్టుండి ఒక్కసారిగా తమ పంథాను మార్చుకొని అదే టీవీ9 లో ప్రసారం అయినా క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. టీవీ9 చాల తెలివిగా పవన్ అభిమానుల నాడినిపసిగట్టి వారిని శాంతిపజేసింది.
undefined
పవన్ తదుపరి చిత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని పిలిచి ఇంటర్వ్యూ చేసింది. దీనితో తమ అభిమాన హీరో గురించిన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ ని ఏకంగా చిత్ర డైరెక్టరే ఇస్తుండడంతో వారంతా చూసారు. చూడడమే కాకుండా అవేక్లిప్స్ ని షేర్ చేసారు కూడా.
undefined
ఫాన్స్ విషయాన్నీ పక్కనబెడితే.....జనసేన అయినా ఈ విషయంలో ఒకింత జాగ్రత్త పడాల్సింది. తెలుగులో టీవీ చానెల్స్ కి కొదవ లేదు. అలానే పవన్ చిత్రం అంటేనే ఆ హైప్ వేరు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని కించపరిచారు అని భావించి అధికారికంగా లేఖ ఇచ్చిన ఛానల్ కేవెళ్లి పవన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ వెళ్లిఇంటర్వ్యూ ఇవ్వడం వారి రాజకీయ అపరిపక్వతను తెలియచేస్తుంది.
undefined
చిత్రాలు వేరు రాజకీయాలు వేరు అనవచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక పవన్ పబ్లిక్ఫిగర్. ప్రజల ఓట్లు సంపాదించడానికి పవన్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇస్తాను అంటే ఏ ఛానల్ కాదంటుంది చెప్పండి. రెగ్యులర్ టీవీ చానల్స్ కూడా అవసరమైతే తమ కార్యక్రమాలను పక్కనపెట్టి మరి దీన్ని ప్రసారం చేస్తాయి.
undefined
కానీ విచిత్రంగా చిత్ర డైరెక్టర్ ని జనసేన పార్టీ కూడా ఆపకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమయింది. ఇప్పటికే పవన్ ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేసేవారు లేకపోలేదు. ఇక మీదట ఈ విషయాన్నీ కూడా ప్రతిపక్షాలు ఎత్తి చూపెడుతూ... సొంతసినిమా డైరెక్టరే పవన్ మాట వినడం లేదు అని అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
దీని వల్ల మరొక మెసేజ్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను ప్రసారం చేసినా... ఆయన ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్సినిమాల గురించో ఏదో ఒక తాయిలం ప్రకటిస్తే.... అభిమానులు సైలెంట్ అయిపోతారు, విషయం సమసిపోతుంది అని అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.
undefined
అలాగే జనసేన ప్రెస్ నోట్ పై ఆమె ట్వీట్ చేస్తూ... నేను మీ లెటర్ ని ఖండిస్తున్నాను మిస్టర్ శివ ప్రసాద్. మీరు నా మీద పూర్తిగా తప్పుడు ఆరోపణ చేసారు. నాకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమను,అభిమానాన్ని అవమానిస్తున్నారు. మీ డ్రామాలు ఆపండి, అలాగే జనసేన పేరుని మీ స్టుపిడ్ చేస్టలతో పాడు చేయకండి. మీకు ఏమైనా గట్స్ ఉంటే పీకేని తిట్టిన నటీమణులపై యాక్షన్ తీసుకోండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
undefined