బిగ్ బాస్ లో అడల్ట్ కంటెంట్ ఇదే: పిల్లలతో కలిసి చూడాలంటేనే....

First Published | Sep 8, 2020, 4:33 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమయిందో లేదో.... బిగ్ బాస్ పైన నెగటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి.కంటెస్టెంట్స్ సరిగా లేకపోవడం ఒకెత్తయితే.... బిగ్ బాస్ షో కూడా బోరింగ్ గా ఉందనేది అందరి నుండి వినిపిస్తున్నమాట.

బిగ్ బాస్ షో అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. నాగార్జున హోస్ట్ గా కరోనా నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్ కలం పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్ ను టెస్టుల తర్వాతహౌజ్ లోకి అనుమతించారు. ఎటువంటి వినోదం లేక కొట్టుమిట్టాడుతున్న ప్రేక్షకులకు బనిగ్ బాస్ ఒక ఉపశమనం అని అందరూ భావించారు.
undefined
కానీ బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమయిందో లేదో.... బిగ్ బాస్ పైన నెగటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి. కంటెస్టెంట్స్ సెలక్షన్ సరిగా లేదనేది అందరి మాట. పెద్దగా పరిచయం ఉన్నవారు ఆ హౌజ్ లో లేరు. 90 శాతం మంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలీదు.
undefined

Latest Videos


కంటెస్టెంట్స్ సరిగా లేకపోవడం ఒకెత్తయితే.... బిగ్ బాస్ షో కూడా బోరింగ్ గా ఉందనేది అందరి నుండి వినిపిస్తున్నమాట. ప్రోగ్రాం ని అత్యంత కాంట్రవర్సియల్ గా రూపొందించే యావలో పడ్డ నిర్వాహకులు బేసిక్ విషయాలను గాలికి వదిలేసారు. బిగ్ బాస్ కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని పక్కనబెట్టి ఏవేవో అనవసర అంశాలను తెర మీదకు తీసుకొస్తున్నారు.
undefined
ఈ కోణంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవలిసింది బిగ్ బాస్ కార్యక్రమం ఉద్దేశం గురించి. కొంతమంది సభ్యులు బయటప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఉంటె వారి బిహేవియర్ ఎలా ఉంటుంది. దాన్ని తట్టుకొని ఎలా నిలబడతారు అనేది ప్రధానాంశం.మానసికంగా అత్యంత ధృడంగా ఉన్న వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అవుతాడు.
undefined
అలా మానసికంగా తమ దృఢత్వాన్ని నిరూపించుకునే వారు సెలెబ్రిటీలు అవడంతో... ప్రేక్షకులు కూడా దాన్ని విపరీతంగా ఆదరిస్తారు. వారి జీవితాల్లోని అనేక సంఘటనల గురించి వారు అక్కడ షేర్ చేసుకుంటూ ఉండడంతో సహజంగానే పక్కోడి జీవితం ఎలా ఉందొ తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉండే సగటు మానవుడు సెలెబ్రిటీల విషయం అనేసరికి ఇంకా ఇంటరెస్ట్ ని చూపిస్తాడు. దానితో విపరీతంగా ఆ ప్రోగ్రాం క్రేజ్ ని సంపాదించుకుంది.
undefined
ఈ ఉద్దేశంతో ప్రారంభమైన షో పూర్తిగా గాడి తప్పినట్టుగా కనబడుతుంది. ఇంగ్లీష్ బిగ్ బ్రదర్ షో గా కాకుండా కుటుంబమంతా కూర్చొని చూసే షో అని చెప్పారు. 12 సంవత్సరాల వయసు పైబడ్డ వారు ఈ షో చూడవచ్చు అని నిర్వాహకులే ప్రకటించారు.బాగానే ఉంది.
undefined
కానీ ప్రస్తుత షో లో నాగార్జున ఒక్కొక్కరిని హౌజ్ లోపలికివెళ్ళాక ఎవరైనా ప్రపోజ్ చేస్తేఏమిటి, ఎలా రియాక్ట్ అవుతారు వంటి ఇబ్బందికర ప్రశ్నలను అడిగారు. ఓకే నార్మల్ గానే అడిగారు బాగానే ఉంది. ప్రేమ తప్పు కాదు. హౌజ్ లోపలి వెళ్ళాక ఎవరైనా ప్రేమలో పడితే దానివల్లషో రేటింగ్ అమాంతం పెరుగుతుంది. అప్పుడు అది నాచురల్ గాఉంటుంది.
undefined
కానీ.... ఇలా హింట్ ఇస్తున్నట్టుగా లోపలి వెళ్ళాక మీరు ఖచ్చితంగా లవ్ ట్రాక్ నడపాలి అని సిగ్నల్స్ ఇవ్వడమే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. లోపలి వెళ్ళాక ప్రేమ చిగురిస్తే అందరూ సంతోషిస్తారు. ఒక ట్రాక్ పునర్నవి, రాహుల్ ల మధ్య గత సీజన్ లో నడిచింది కాబట్టి ఆ సీజన్ కి అది మంచి టీఆర్పీ రేటింగులను తీసుకొచ్చింది. అంతకుముందు సీజన్లో తేజస్వి, సామ్రాట్ ల మధ్య కూడా ఒక ట్రాక్ నడిచింది. అది ఎబ్బెట్టుగా అనిపించలేదు.
undefined
ఇక మరో అంశం బిగ్ బాస్ ఏమీ పెళ్లి సంబంధాలను కుదిర్చే ప్రోగ్రాం కాదు. మ్యాట్రిమోనియాల్ వెబ్ సైట్ అంతకన్నా కాదు.ఒక వేళ అదే గనుక అయితే ఏ స్వయంవరమనే పేరుపెట్టో ప్రోగ్రాం నడిపిస్తే సరిపోతుంది.
undefined
ఇక ఈ సీజన్లో చూసేవారికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్న మరో విషయం నెయిబర్స్ హౌస్ అని అరియనా గ్లోరీ, సోహైల్ ని ఒకే రూమ్ లో ఉంచడం. పిల్లల్తో కలిసి చూడడానికి ఫామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. యువతకు చూడడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు... కానీ పిల్లల్తో కలిసి చూసే కుటుంబాలకు అది ఇబ్బందికరంగానే అనిపిస్తుంది.
undefined
పిల్లలకు అన్ని తెలియాలి. కానీ వారి వయసుకు తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప అవసరానికి మించినది అందించాల్సిన వసరం లేదు. ఇంటర్నెట్ ఈ సమస్య తీసుకొస్తుందని బాధపడే తల్లితండ్రులు కోకొల్లలు. పసి హృదయాల మీద ఇలాంటి సంఘటనలు బలమైన ముద్రను వేసే ఆస్కారం ఉంది.
undefined
అవును బిగ్ బాస్ హౌజ్ లో ఏమైనా జరగొచ్చు. అందరూ ఆ సస్పెన్స్ నే కోరుకుంటారు. ఫస్ట్ సీజన్ లో కూడా బిగ్ బాస్ బ్రహ్మాండమైన టీఆర్పీలతో దూసుకుపోయింది. తారక్ హోస్ట్ గా ఉండడం కారణాన్ని పక్కకుబెట్టినా వారంలో మిగిలిన రోజులను కూడా ప్రేక్షకులు అంతే ఆసక్తితో చూసారు. అందులో ఇలాంటి ఎబ్బెట్టుకర సంఘటనలు మనకు కనిపించవు.
undefined
click me!