భర్త పరకాల వ్యాఖ్యలు: నిర్మలా సీతారామన్ కు చిక్కులు?

First Published | Oct 15, 2019, 12:33 PM IST

ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది? 

ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?
undefined
ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది.
undefined

Latest Videos


ఈ వ్యాసంలో ఏకంగా బీజేపీ పార్టీకి ఒక ఆర్ధిక అజెండా లేదని కేవలం నెహ్రూ సోషలిస్ట్ విధానాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుతుందని ఆయన అన్నారు. ఒక పక్క ఆర్ధిక మంత్రేమో మోడీ హయాంలో, దిశా నిర్దేశంలో ఆర్ధిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందంటుంటే ఇలా ఆమె భర్త అసలు బీజేపీ పార్టీకే సొంత ఎకనామిక్ పాలసీ లేదనడంతో యావత్ దేశంలో ఈ విషయమై చర్చ మొదలయ్యింది
undefined
కొద్దీ సేపు ఈ వ్యాసంలోని అంశాలను పక్కకు పెడదాము. ఈ వ్యాసం వివాదాస్పదమైన అంశం వాస్తవం. ఇది ఇప్పుడు నిర్మల సీతారామన్ కు మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టనుందా అనే సందేహం కలుగక మానదు. ఇప్పటికే ఆర్ధిక స్థితిపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు ఈ కొత్త అస్త్రం దొరకడంతో దాడిని తీవ్రతరం చేసాయి.
undefined
బీజేపీ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. ఇతర పార్టీల మాదిరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోరు. వారి క్యాడర్ ని వారే తయారు చేసుకోవడం వల్ల ఇలా అధిష్టాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరు కూడా. వారి పార్టీ రాజ్యాంగాన్ని ప్రతి కార్యకర్త నరనరాన ఎక్కించుకొని ఉంటాడు. ఏబీవీపీ, ఆరెస్సెస్ వంటి సంస్థల్లోనుంచి నేతలు పుట్టుకొస్తారు కాబట్టి ఆ పార్టీకిది సాధ్యపడుతుంది.
undefined
ఇలాంటి పార్టీలో ఇప్పుడు స్వయానా ఆర్ధిక మంత్రి భర్త ఇలా ప్రభుత్వ వ్యతిరేకమైన వ్యాసం రాయడంతో బీజేపీ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అసలే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శలు వస్తున్న వేళ ఈ వ్యాసం నూతన తలనొప్పులు ఇటు పార్టీకి అటు ఆర్థికమంత్రికి తెచ్చిపెట్టాయి.
undefined
పరోక్షంగా ఆ వ్యాఖ్యలకు నిర్మల సీతారామన్ సమాధానమిచ్చారు. గత దఫాలో మౌలికమైన అంశాలకు సంబంధించిన జీఎస్టీ వంటి సంస్కరణలెన్నో జరిగాయని, సంస్థాగత మార్పులకి ఇవే కారణమని ఆమె అన్నారు. సూటిగానో, పరోక్షంగానో ఎలానో ఒకలా ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాధానం ఈ వివాదాన్ని చల్లార్చకపోగా ఈ విషయమై మరింత చర్చ మొదలయ్యింది. జీఎస్టీపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
undefined
ఈ వివాదం ఇప్పుడప్పుడు సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద అంశాలకు కారణభూతులైనవారిని ఏ పార్టీయైనా లైమ్ లైట్ నుంచి తప్పిస్తుంది. బీజేపీ దానికి అతీతం కాదు. అందునా క్రమశిక్షణకు పెద్ద పీట వేసే పార్టీ. ఇక్కడ నేరుగా ఆర్ధిక మంత్రి వివాదానికి తెరలేపకున్నా అది ఆమెనే చుట్టుముట్టింది. ఈ పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
undefined
గత మోడీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా సేవలందించిన జయంత్ సిన్హా ను మోడీ ప్రభుత్వం ఈ సారి తప్పించింది. జయంత్ సిన్హా స్వతహాగా మంచి ఆర్థికవేత్త. తాను పనిచేసిన రెండు శాఖల్లో ఎన్నో మౌలికమైన సంస్కరణలు చేపట్టారు కూడా. మరి పని చేసిన మంత్రి కి ప్రమోషన్ బదులు, డిమోషన్ ఎందుకిచ్చారు? ఇలా జయంత్ సిన్హాను తప్పించడానికి కారణం లేకపోలేదు.
undefined
జయంత్ సిన్హాను మంత్రివర్గం నుంచి తప్పించడానికి ముఖ్యకారణం అతని తండ్రి, మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. యశ్వంత్ సిన్హా అటల్ బిహారి వాజపేయి హయాంలో ఆర్ధిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించినప్పటి నుండి మొదలు పార్టీ కి కొద్దిగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ 2018లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.
undefined
రాజీనామా చేసింది మొదలు మోడీ సర్కార్ కు బద్ధ విరోధిగా మారారు. తన తనయుడు, గత మోడీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేస్తున్న జయంత్ సిన్హాపై కూడా తీవ్ర విమర్శలు చేసాడు. మూక దాడి నిందితులకు పూలమాల వేసిన ఘటనలో జయంత్ సిన్హా పై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఆ దుమారం ఎంత పెద్దదయ్యిందంటే జయంత్ సిన్హా కు మంత్రి పదవిని దూరంచేసేంత!
undefined
బీజేపీ విధి విధానాలను పరిశీలించినా, బీజేపీ గత చరిత్ర చూసినా మనకు అర్ధమయ్యే విషయం ఒక్కటే. ఈ వివాదం ఎంత పెద్దదవుతుంది? ఆ దుమారం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు మోడీ సర్కార్ ను ప్రేరేపిస్తుంది? ఇవీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు.
undefined
click me!