కేసీఆర్ సెంటిమెంట్ వ్యూహం ఖతమ్: చంద్రబాబు, పవన్ పరిమితులివీ...

First Published Oct 12, 2019, 1:18 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్కా రాజకీయ పార్టీ అవతారం తీసుకుంది. ఇక అది ఎంత మాత్రమూ ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా, తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు మేలు చేయలేరనే ప్రజల నమ్మకం వల్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించలేదు. బొటాబొటీ మెజారిటీతోనే గెలిచింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్కా రాజకీయ పార్టీ అవతారం తీసుకుంది. ఇక అది ఎంత మాత్రమూ ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా, తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు మేలు చేయలేరనే ప్రజల నమ్మకం వల్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించలేదు. బొటాబొటీ మెజారిటీతోనే గెలిచింది.
undefined
తొలిసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత శాసనసభలో తన బలం పెంచుకోవడానికి, ప్రతిపక్షాలను ఖతం చేయడానికి పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన శాసనసభ్యులను, నేతలను ఆయన పార్టీలోకి తీసుకున్నారు. దాంతోనే దాదాపుగా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ రూపాన్ని కోల్పోయింది.
undefined
గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అప్పటికి కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఉండడమే కాకుండా, తెలంగాణలో తమను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదుకోలేడనే ఆంధ్ర సెటిలర్ల అభిప్రాయం వల్ల ఆ విజయం సాధ్యమైంది. పైగా, మంత్రి కెటీఆర్ సెటిలర్లతో నిర్వహించిన సమావేశాల్లో చెప్పిన మాటలు కూడా బాగా పనిచేశాయి.
undefined
తెలంగాణలో రెండోసారి శాసనసభ ఎన్నికలు వచ్చేనాటికి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత చోటు చేసుకుంది. అయితే, చంద్రబాబు వల్ల కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరిందనే అభిప్రాయం బలంగా ఉంది. కాంగ్రెసు, ఇతర పార్టీలతో కలిసి మహా ఫ్రంట్ కట్టి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ను ఎదుర్కునేది తానే అన్నట్లుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. దాంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెర మీదికి వచ్చింది. ఎన్నికల సమరం తెలంగాణలో చంద్రబాబుకు, కేసీఆర్ కు మధ్య జరుగుతుందనే అభిప్రాయం బలపడింది. దీంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
undefined
తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖతమ్ చేయడానికి కేసీఆర్ అనుసరించి, అమలు చేసిన వ్యూహం దాదాపుగా ఫలించింది. రెండోసారి విజయం సాధించిన తర్వాత ఆయన కాంగ్రెసును లక్ష్యం చేసుకున్నారు. బిజెపికి సన్నిహితంగా మెలుగుతూ కాంగ్రెసు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. దీంతో శాసనసభలో బలమైన పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది.
undefined
లోకసభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. అందులోనూ తనకు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి, తన కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి ఓడిపోవడం కేసీఆర్ కు ఎదురులేని దెబ్బగానే చెప్పాలి. అయితే, కాంగ్రెసు, బిజెపి కుమ్మక్కు కావడం వల్ల ఓడిపోయామని సర్దిచెప్పుకునేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నించారు. తెలంగాణలో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ వ్యవహరించిన తీరు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉండడం కూడా కాంగ్రెసు, బిజెపిలకు కలిసి వచ్చిందని చెప్పాలి.
undefined
ప్రస్తుతం ఆర్టీసి సమ్మె జరుగుతోంది. ఈ ఆర్టీసి సమ్మెకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. కానీ, చంద్రబాబు ఇప్పటి వరకు దానిపై ఏమీ మాట్లాడలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం స్పందించారు. వీరిద్దరు కూడా ఇందులో వేలు పెట్టకుండా ఉన్నంత వరకు కేసీఆర్ ను ఎదుర్కోవడానికి అది పనికి వస్తుందనే చెప్పాలి. వారిద్దరు రంగంలోకి దిగితే తెలంగాణ సెంటిమెంట్ రాజుకునే అవకాశం లేకపోలేదు. అది కేసీఆర్ కు ఉపయోగపడవచ్చు. తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు తమ పరిమితులను గుర్తించాల్సే ఉంది.
undefined
ఇక ముందు తెలంగాణలో పరిణామాలు కేసీఆర్ ఆశించినట్లుగా ముందుకు సాగే పరిస్థితి లేదు. రైతు బంధు వంటి కొన్ని సంక్షేమ పథకాలు తనకు అనుకూలంగా పనిచేస్తాయని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, పరిస్థితి అలా ఉండేలా కనిపించడం లేదు. దాదాపుగా అన్ని వర్గాల్లోనూ ఏదో రకమైన అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా రాజుకుంటునే ఉంది. దాన్ని గ్రహించి సరైన చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ముందుకు వచ్చేలా కనిపించడం లేదు.
undefined
తాను దుక్కలాగా ఉన్నానని, మరో రెండు విడతలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఎందుకు చేశారనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. నిజానికి, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే ఎజెండాతోనే కేసీఆర్ చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
undefined
click me!