నిమ్మగడ్డ రహస్య భేటీ: వైఎస్ జగన్ కు చెక్, వెనక బిజెపి పెద్దలు?

First Published | Jun 23, 2020, 4:08 PM IST

ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లోని ఒక హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారని సీసీటీవీ ఫుటేజీ వీడియో బయటకొచ్చింది. దీనిపైన్నే అధికార వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనా, కామినేనిల భేటీ ఇప్పుడు రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ నాయకులను కలవడం ఒకెత్తయితే.... కోర్టులో తనపై ఉన్న ఒక కేసులో పిల్ దాఖలు చేసిన వ్యక్తిని కలవడం ఎటువంటి రాజకీయ నిష్పాక్షికత అని అధికార వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
undefined
ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లోని ఒక హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారని సీసీటీవీ ఫుటేజీ వీడియో బయటకొచ్చింది. దీనిపైన్నే అధికార వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది.
undefined

Latest Videos


రమేష్ కుమార్ ఇలా బీజేపీ నేతలతో భేటీ అవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీకి గలకారణాలేమిటని అందరూ చర్చించుకుంటున్నారు. బీజేపీతో రమేష్కుమార్ మైత్రి కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనిఅందరూ గుసగుసలాడుకుంటున్నారు.
undefined
ఇకపోతే రమేష్ కుమార్ విషయంలో ఆదినుంచి కూడా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటిని గనుక పరిశీలించి, ఒకదానితో ఒకటి పోల్చి చూసుకుంటే మనకు ఒక అవగాహన ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది.
undefined
తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.
undefined
ఆ తరువాత అయన తనకు కేంద్రబలగాలతో రక్షణ కావాలని కేంద్రానికి ఒక లేఖ రాసారు. వెంటనే కేంద్ర బలగాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఇక ఈ సంఘటన జరిగిన తరువాత లేఖ విషయంలో చర్చ జరుగుతుండగానే... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దానిపై క్లారిటీ ఇచ్చారు.
undefined
ఇక జగన్ ని పెద్దగా విమర్శించని కేంద్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా జగన్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. జగన్ అంతా రివర్స్ అంటూ రామ్ మాధవ్ జగన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ స్పీచ్ లో ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు.
undefined
ఈ సంఘటనలు చోటు చేసుకుంటుండగానే హై కోర్టు రమేష్ కుమార్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, జగన్ సర్కార్ సుప్రీమ్ కోర్టుకి వెళ్లడం, అక్కడ సుప్రీంకోర్టుకూడా హై కోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సొంత భాష్యాలు చెబుతూ నేటికీ... ఆయనను పునర్నియమించకుండా సొంతభాష్యాలు చెబుతూ కాలయాపన సాగిస్తూనే ఉన్నారు. ఇక ఈ తతంగం జరుగుతుండగా, సుప్రీమ్ కోర్టు తీర్పుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ గవర్నర్ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఒక లేఖ రాసారు.
undefined
సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో నడుస్తున్న కేసులో కామినేని శ్రీనివాసరావు కావియేట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కోర్టు విషయాలను పక్కకుంచితే... రఘురామ కృష్ణంరాజు వ్యవహారం.ఆయన వైసీపీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయనను ఒక్కమాటంటే.. ఆయన నాలుగుమాటలంటున్నారు. తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితేనే తాను పార్టీలో చేరానని, తాను జగన్ బొమ్మ వల్ల గెలవలేదని చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు.
undefined
ఆయనను తనంతట తాను వైసీపీ వెళ్లరు.వైసీపీ సస్పెండ్ చేస్తే వెళ్లి బీజేపీలో చూస్తున్నాడు. తాజాగా ఆయన తనకు ప్రాణహాని ఉందని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రానికి ఒక లేఖ రాసారు. ఆయన హస్తినకు పయనమయ్యారు.
undefined
చూడబోతుంటే... మొన్నటివరకు వైసీపీతో సన్నిహితంగా మెలిగిన కేంద్రనాయకత్వం రాష్ట్రంలో బీజేపీ పెరుగుదల కోసం జగన్ ను దూరం పెడుతుందా అనే అనుమానాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో గనుక వైసీపీ కి ప్రత్యామ్నాయం గా బీజేపీ ఎదిగితే.... బీజేపీలో చేరినవారిని జగన్ ఎలాగూ రాజకీయంగా కానీ, అధికార బలాన్ని ఉపయోగించికానీ ఇబ్బంది పెట్టలేడు గనుక, తాము అక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నట్టున్నారు.
undefined
ప్రస్తుతానికి టీడీపీ..... అరెస్టులతో, కేసులతో డీలాపడిపోయి ఉంది. టీడీపీ నేతలు ఈ చిక్కులు మాకెందుకు అనుకుంటే వైసీపీలోకి వెళుతున్నారు. అదే బీజేపీ గనుక అక్కడ బలపడితే జగన్ బ్యాటింగ్ ను తట్టుకోలేనివారంతా, వైసీపీలోకి పోలేనివారంతాబీజేపీలో చేరడానికి ఆస్కారం ఉంటుంది.
undefined
ఒకవేళ రఘురామ వ్యవహారం గనుక పనిచేసి...ప్రతిపక్షంతోపాటుగా ఎవరైనా జగన్ మీద అసంతృప్తిగా ఉన్నవారు సైతం బీజేపీలో చేరడానికి ఆస్కారం ఉంటుంది అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసమే రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీతో ఢీఅనడానికి బీజేపీ సిద్ధపడుతోందని అంటున్నారు.
undefined
click me!