ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేళ కూడా రాజకీయ దుమారాలకుమాత్రం కొనసాగుతూనేఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా నాగబాబు గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.
undefined
గాడ్సేనిజమైన దేశ భక్తుడు అని, అతడిని చంపడం కరెక్ట్ ఆ కాదా అనేది డిబేటబుల్ అంశమని, దాన్ని పక్కకుంచితే.... తనకు అపఖ్యాతి వస్తుందని తెలిసి కూడా తాననుకున్నది చేశాడంటూ గాడ్సేపై జాలి చూపించాడుజనసేనసీనియర్ నేత, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.
undefined
సాధారణంగా బీజేపీలోని కోర్ హిందుత్వ వర్గం మాత్రమే ఈ ఐడియానుబహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. గతంలో గాడ్సేను పొగుడుతూ సాధ్వి ప్రగ్య ఠాకూర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై ప్రధాని నరేంద్రమోడీ ఆమెను ఎప్పటికి క్షమించలేను అని అన్నారు.
undefined
ఇంకొందరు విశ్వా హిందూ పరిషత్, ఇతర మరికొన్ని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలుకూడా ఇలాంటి అభిప్రాయాన్ని బహిరంగంగానే వెలిబుచ్చాయి. మహాత్మా గాంధీకివ్యతిరేకంగా వెలిబుచ్చినవారిని బహిరంగంగానేబీజేపీ కేంద్ర నాయకత్వం కూడా విమర్శించి.
undefined
ఇలాంటి తరుణంలో ఇలా నాగబాబుఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలిసివచ్చిందనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. బీజేపీతో ఇప్పటివరకు అనేక పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.... వారు వారి పార్టీ సిద్ధాంతాలను మాత్రం వదలలేదు. ఇలాంటి విషయాల్లో వారు బీజేపీ తో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పలుమార్లు ప్రయాణం చేసినా ఆయన కానీ, ఆయన పార్టీ నేతలు కానీ ఎప్పుడు ఇలాంటి విపరీత చర్యలకుపాల్పడలేదు.
undefined
ఇలా పవన్ కళ్యాణ్ సోదరుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండే సిద్ధాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పల్టీలు కొట్టారు.
undefined
తొలుత తానసిద్ధాంతం విప్లవమని, తాను చేగువేరాను చూసి స్ఫూర్తి పొందాననిఅన్నాడు. ఆ తరువాత ఏమయిందో తెలీదు,, తెలుగుదేశం బీజేపీల కూటమికి తన మద్దతు అన్నాడు.2019 ఎన్నికలకు వచ్చేసరికితాను కమ్యూనిస్టునంటూ వారితోకలిసి నడిచాడు. ఎన్నికలకు ముందు "లాల్ నీల్" అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చిమాయావతితో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాడు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తాను బీజేపీకి ఎక్కడ దూరమయ్యానని, తమది బీజేపీది ఒకే సిద్ధాంతమనిఅన్నాడు.
undefined
ఇలా సిద్ధాంతాల విషయంలోవరుస పల్టీలు కొడుతున్నపవన్ కళ్యాణ్ ఒక పక్క ఉంటే... అన్న చిరంజీవి గాంధీ గిరి అంటూ గాంధీ మహాత్ముని మీద సినిమాలు కూడా తీసాడు. ఇలా ఒక రకంగా సిద్ధాంతాల ఖిచిడీ అక్కడ మనకు దర్శనమిస్తుంది.
undefined
ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను గనుక చూసుకుంటే.... ఆయన ఈ వ్యాఖ్యలను సొంతగా చేసారా, లేదా పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే చేసారా అనేది ఇక్కడ అంతుచిక్కని ఒక విషయం. ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నట్టు ఏకంగా ఒక కోర్ బీజేపీ వ్యక్తి మాట్లాడినట్టుగానాగబాబు అభిప్రాయముంది.పవన్ కళ్యాణ్ ఆరెస్సెస్ కు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే...అవుననే సమాధానం వస్తుంది.లేకపోతే... ఆరెస్సెస్ సిద్ధాంతాలను అంతగా ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం లేదు.
undefined