ఐపీఎల్ పుష్కరం: 12 ఏండ్ల ప్రయాణంలో ట్విస్టులు ఇవే...!

First Published | Apr 18, 2020, 10:03 AM IST

2007 టీ20 వరల్డ్‌కప్‌ విజయం భారత్‌లో పొట్టి ఫార్మాట్‌ను పాపులర్‌ చేసింది. 20 ఓవర్ల ఆటలో విశ్వ విజేతగా నిలిచిన భారత్‌, 2008లో ఆ ఫార్మాట్‌లోనే క్రికెట్‌ లీగ్‌కు పురుడు పోసింది. వరల్డ్‌కప్‌ విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌, వినోదపు హంగులతో ముందుకొచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను సొంతం చేసేసుకుంది. 

క్రికెట్ ఒక జెంటిల్మన్ గేమ్ అనేది ఎప్పటినుండో వినిపించే ఒక మాట. వన్డేఆగమనంతోఒకింత జెంటిల్మన్ గేమ్ లో ఉత్కంఠ అనే ఎలిమెంట్ ఆడ్ అయింది. ఆ ఎలిమెంట్నుంచి ఇంకో మెట్టు ఎదిగిన క్రికెట్... ఏకంగా ఫుట్ బాల్ లెవెల్కి చేరుకుంది.ఆట నియమాలు మార్చివేసింది. క్రికెట్‌ కొలమానాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రపంచ క్రికెట్‌ గతిని పూర్తిగా మార్చివేసింది. వ్యాపార, సినీ దిగ్గజాలను క్రీడారంగంలోకి తీసుకొచ్చింది. ఆటలకు వినోద తాపడం అద్దింది.
undefined
మాట్లాడేది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) గురించి.బీసీసీఐకి ప్రాణ సంకటంగా తయారైన రెబల్‌ లీగ్‌ (ఐసీఎల్‌)కు అడ్డుకట్ట వేసేందుకు మొదలైన ఐపీఎల్‌, భారత క్రికెట్‌ బోర్డును మరింత శక్తిమంతం చేసింది.బీసీసీఐకి ఐపీఎల్‌ అన్ని విధాలుగా ఉపయోగపడింది. ప్రపంచ క్రికెట్‌ గతిని మార్చిన ఐపీఎల్‌కు నేడు తొలి పుష్కరం. 2008, ఏప్రిల్‌ 18న మొదలైన ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులను గత పన్నెండేండ్లుగాఅలరిస్తూనే ఉంది.
undefined

Latest Videos


2007 టీ20 వరల్డ్‌కప్‌ విజయం భారత్‌లో పొట్టి ఫార్మాట్‌ను పాపులర్‌ చేసింది. 20 ఓవర్ల ఆటలో విశ్వ విజేతగా నిలిచిన భారత్‌, 2008లో ఆ ఫార్మాట్‌లోనే క్రికెట్‌ లీగ్‌కు పురుడు పోసింది. వరల్డ్‌కప్‌ విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌, వినోదపు హంగులతో ముందుకొచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను సొంతం చేసేసుకుంది.చిన్నా పెద్దా, స్త్రీ పురుష కొలమానాలతో నిమిత్తం లేకుండా ఐపీఎల్‌ తొలి సీజన్‌తోనే విశేష ఆదరణ సంపాదించింది. ఐపీఎల్‌ భారత క్రికెట్‌ రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. పెద్ద మనుషుల ఆట ఆడే విధానమే ఇక్కడ మారిపోయింది.
undefined
ఐపీఎల్‌ భారత క్రికెట్‌ బోర్డును అత్యంత ధనిక బోర్డునుకూడా చేసింది. భారత క్రికెట్‌ జట్టును ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా నిలిపింది. అటువంటి ఐపీఎల్‌కు నేటితో 12 ఏండ్లు!. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ఆలోచన, అమలు, తదనంతర ప్రభావం గురించి ఒక లుక్కేద్దాం.
undefined
ఐపీఎల్ ఎందుకు, ఎలా పుట్టిందంటే....భారత క్రికెట్‌ జట్టు మీడియా హక్కులు దక్కని జీ మీడియా, బీసీసీఐకి రెబల్‌గా ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌) మొదలెట్టింది. ఐసీఎల్‌లో ఆడేందుకు దేశవాళీ క్రికెటర్ల క్యూ కట్టారు. కపిల్‌ దేవ్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు మెంటర్లుగా ఐసీఎల్‌లో చేరిపోయారు. అంబటి రాయుడు కొద తొలుత ఐసీఎల్ లో ఆడినవాడే!యువ క్రికెటర్లను విశేషంగా ఆకర్షిస్తున్న ఐసీఎల్‌ను అడ్డుకునేందుకు బీసీసీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఐసీఎల్‌లో చేరిన ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించింది. 2007 టీ20 వరల్డ్‌కప్‌ విజయం బీసీసీఐ చేతికి వజ్రాయుధం అయ్యింది.
undefined
పొట్టి ఫార్మాట్‌తో ప్రేమలో పడిన క్రికెట్‌ ప్రియులను ఐపీఎల్‌తో తనవైపు తిప్పుకుంది. ఇంగ్లాండ్‌లోని ప్రీమియర్‌ లీగ్‌, అమెరికాలోని ఎన్‌బీఏ తరహాలో ప్రాంఛైజీ లీగ్‌కు రూపకల్పన చేసింది. అప్పటి బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోడి ఐపీఎల్‌ను అన్నీ తానై ఆరంభించాడు. (ఐపీఎల్‌ చైర్మన్‌గా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మోడిపై బీసీసీఐ తర్వాత జీవితకాల నిషేధం విధించింది. ఇప్పుడు మోడి లండన్‌లో ఉంటున్నారు).ఐపీఎల్‌ ఆలోచన 2006 నుంచీ బిసీసీఐ మదిలో ఉన్నట్టు మోడి చాలాసార్లు చెప్పారు. కారణాలు ఏమైనా సరే.... సరైన సమయంలో ఐపీఎల్‌ పట్టాలెక్కింది. 2008 జనవరిలో బీసీసీఐ పిలిచిన ప్రాంఛైజీల వేలానికి విశేష స్పందన లభించింది.
undefined
న్యూఢిల్లీ, ముంబయి, జైపూర్‌, బెంగళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కత, మొహాలి నగరాలు కేంద్రంగా ప్రాంఛైజీల వేలం నిర్వహించారు. బీసీసీఐ 8 ప్రాంఛైజీలకు కలిపి రూ. 3040 కోట్ల కనీస ధర నిర్ణయించింది. అనూహ్యంగావేలంలో బీసీసీఐ రూ.5494 కోట్లను దక్కించుకుంది.
undefined
సెలెబ్రిటీల ఎంట్రీ... నయాహంగులు!రిలయన్స్‌ అధిపతి ముఖేష్‌ అంబాని ముంబయి కోసం అత్యధికంగా రూ. 851 కోట్లు (111.9 మిలియన్‌ డాలర్లు) వెచ్చించాడు. బెంగళూర్‌ ప్రాంఛైజీ కోసం విజయ్మాల్యా రూ. 848 కోట్లు ఖర్చు చేశాడు. ఇండియా సిమెంట్స్‌ సంస్థ చెన్నైకి రూ. 691 కోట్లు, మౌళికవసతుల అభివృద్ది రంగ కంపెనీ జిఎంఆర్‌ ఢిల్లీని రూ.638 కోట్లు, మీడియా సంస్థ డెక్కన్‌ క్రానికల్‌ హైదరాబాద్‌ను రూ. 813 కోట్లు, ఎమర్జింగ్‌ మీడియా గ్రూప్‌ జైపూర్‌ను రూ. 510 కోట్లు, షారుఖ్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ సంస్థ కోల్‌కతను రూ.570 కోట్లు, బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా తదితరులు మొహాలిని రూ. 577 కోట్లతో దక్కించుకున్నారు.
undefined
వ్యాపార దిగ్గజాలు ముఖేష్‌ అంబాని, జి. మల్లికార్జున్‌, టి. వెంకట్రామిరెడ్డి, ఎన్‌. శ్రీనివాసన్‌లు విలువైన ప్రాంఛైజీలను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌, జూహి చావ్లాలు కోల్‌కతను కైవసం చేసుకున్నారు. శిల్ప శెట్టి జైపూర్‌లో వాటా దక్కించుకుంది. దీంతో తొలిసారి క్రికెట్‌కు కార్పోరేట్‌, సినీ హంగులు జత కలిశాయి.
undefined
ఆరంభం అదిరింది.... అభిమానులను అలరించింది!భారత్‌ 2007 టీ20 వరల్డ్‌కప్‌ ముద్దాడినసరిగ్గా 200 రోజుల తర్వాత బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి.కోల్‌కత ఐకాన్‌ ఆటగాడు, కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్‌ తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో కోల్‌కత బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సునామీ సృష్టించాడు. 13 సిక్సర్లు, 10 ఫోర్లతో 78 బంతుల్లోనే 158 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌ బాదాడు.అప్పుడే పురుడు పోసుకున్న ఐపీఎల్‌కు అంతకుమించిన ఆరంభం ఇంకేం కావాలి. ఆ మ్యాచ్‌లో కోల్‌కత 2223 పరుగులు చేయగా, ఛేదనలో బెంగళూర్‌ 15.1 ఓవర్లలో 82 పరుగులకే చేతులెత్తేసింది.
undefined
ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ ఎంత అలరించిందో, ఆఖరు మ్యాచ్‌ అంతకుమించిన ఉత్కంఠను మిగిల్చింది. టైటిల్‌ వేటలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చివరి బంతికి ఓడించిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ తొలి విజేతగా నిలిచింది.ఆస్ట్రేలియా క్రికెట్‌ ఎన్నడూ ప్రయత్నించని గొప్ప కెప్టెన్‌ షేన్‌ వార్న్‌ అని ఐపీఎల్‌ తొలి సీజన్‌ నిరూపించింది. రిటైర్మెంట్‌ నుంచి వెనక్కి వచ్చి ఐపీఎల్‌ ఆడిన వార్న్‌.. రాజస్థాన్‌ను మెంటర్‌ కమ్‌ కోచ్‌ కమ్‌ కెప్టెన్‌గా ముందుండి నడిపించాడు. అండర్ డాగ్స్గా బరిలోకి దిగి ఏకంగా కప్పు కొట్టి చరిత్ర సృష్టించారు.
undefined
ఐపీఎల్ అదోకొత్త మాయాలోకం....ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులకు కొత్త కోణం పరిచయం చేసింది. జెంటిల్‌మెన్‌ గేమ్‌ను చూసే పద్దతులను ఐపీఎల్‌ పునఃనిర్వరించింది. బాలీవుడ్‌ సంగీతం, ఛీర్‌ గర్ల్స్‌ నృత్యం, మ్యాచ్‌ మధ్యలోస్ట్రాటజిక్ టైం అవుట్, మూడు గంటల్లోపు ముగిసే మ్యాచ్ ఇవన్నీ వెరసిఅభిమానులను ఐపీఎల్‌కు మరింత చేరువ చేసింది.భారత్‌లో క్రికెట్‌ ఓ మతంగా ఎదగటం ఐపీఎల్‌కు గొప్పగా ఉపయోగపడింది. అంతర్జాతీయ మ్యాచుల వీక్షణకు, ఐపీఎల్‌కు స్పష్టమైన అంతరం ఏర్పడింది. ప్రాంఛైజీ క్రికెట్‌లో ప్రపంచ స్టార్‌ క్రికెటర్లు జట్టుగాఒకనగరానికి ప్రాతినిథ్యం వహించటం భారతీయులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. అన్ని రంగాల్లోనూ మార్పులు ఏదో ఒక దశలో అనివార్యం. క్రికెట్‌ గమనాన్ని నిర్దేశించిన ఓ మార్పు ఐపీఎల్‌ అని చెప్పక తప్పదు. మనం ఆస్వాదిస్తున్న ఆ మార్పునకు నేటితోపన్నెండేండ్లు. అలాంటి ఈ ఐపీఎల్ కు ఈ కరోనాపుణ్యమానిగట్టి దెబ్బే తగిలేలా ఉంది!
undefined
click me!