ప్రశాంత్ కిషోర్ మార్క్: జగన్ నుంచి కేజ్రీవాల్ వరకు...

First Published Dec 28, 2019, 11:24 AM IST

ప్రచార కార్యక్రమంలో కూడా ఒక కొత్త ఆకట్టుకునే స్లోగన్ కనపడుతుంది. "అచ్చే బీతే పాంచ్ సాల్... లగే రహో కేజ్రీవాల్" బాగా గడిచాయి 5 వసంతాలు.... మీరే కొనసాగండి అని దాని అర్థం. ఈ స్లోగన్ చూడగానే మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే, ఇది ప్రశాంత్ కిషోర్ మార్క్ స్టైల్ అఫ్ ప్రచారం.

ప్రస్తుతం దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సి లపై నిరసనలు, మద్దతుల మధ్య రాజకీయం నడుస్తుంది. ఈ విషయం ఇలా కొనసాగుతుండగానే అరవింద్ కేజ్రీవాల్ మాత్రం నెమ్మదిగా తన పని తాను చూసుకుంటూ ఎన్నికల ప్రచారంలో బిజీగా దూసుకుపోతున్నారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టౌన్ హాల్ లో ఒక ప్రచార సభకి హాజరయ్యారు.
undefined
ఆయన ఆ సభలో ఎం మాట్లాడారు అనే దానికన్నా అరవింద్ కేజ్రీవాల్ డ్రెస్సింగ్ స్టైల్ పై అందరి దృష్టి పడింది. ఆయన చలికాలంలో తన మార్క్ స్టైల్ అయినా మఫ్లర్ మిస్సింగ్. సాధారణంగా ఆత్రవింద కేజ్రీవాల్ అంటేనే మనకు గుర్తొచ్చేది...టోపీ పెట్టుకొని మఫ్లర్ చుట్టుకొన్న ఒక మనిషి. కానీ ఆయన దానికి భిన్నంగా ఇప్పుడు మఫ్లర్ లేకుండా కనబడుతున్నాడు. మునుపటిలా కాకుండా చాలా బ్రైట్ గా కనబడుతున్నారు.
undefined
ఆయన ప్రచార కార్యక్రమంలో కూడా ఒక కొత్త ఆకట్టుకునే స్లోగన్ కనపడుతుంది. "అచ్చే బీతే పాంచ్ సాల్... లగే రహో కేజ్రీవాల్" బాగా గడిచాయి 5 వసంతాలు.... మీరే కొనసాగండి అని దాని అర్థం. ఈ స్లోగన్ చూడగానే మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే, ఇది ప్రశాంత్ కిషోర్ మార్క్ స్టైల్ అఫ్ ప్రచారం. సో అరవింద్ కేజ్రీవాల్ లుక్ మారడానికి కూడా వెనక ఉన్నదీ ప్రశాంత్ కిశోరే!
undefined
2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పై అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడు  కేజ్రీవాల్ ఏకంగా ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే సరిపొద్దని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఒక రెండున్నర సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే... ఇప్పుడు కేజ్రీవాల్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ ని తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ ప్రచారానికి నూత్జన జీవం పోసాడు. మొదటగా కేజ్రీవాల్ పోస్టర్ల రంగు మార్చాడు.
undefined
రంగులపట్ల ప్రశాంత్ కిషోర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎరుపు రంగును వాడాడు. దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. బీజేపీ కాషాయ రంగును అంతే బలమైన ఆకర్షణీయమైన ఎరుపు రంగును ప్రాజెక్ట్ చేయడం ఒకటైతే... లాలూ, నితీష్ ల ప్రచారానికి ఒక లెఫ్ట్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసాడు ప్రశాంత్ కిషోర్. ఇక పంజాబ్ లో అతను అకాలీదళ్ తాము మాత్రమే సిక్కుల ప్రతినిధులం అని చెప్పుకొని తిరుగుతున్న సమయంలో సిక్కులకు పవిత్ర రంగైన బ్లూ ని వాడాడు.
undefined
ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ కోసం వైసీపీ పార్టీ రంగులనే వాడినప్పటికీ కూడా ఆయన ప్రధానంగా ఆకుపచ్చ రంగును వాడాడు. చంద్రబాబు ఉంటే వర్షాలు పడవు అనే సెంటిమెంటు ఎలా ప్రజల్లో ఉందొ దాన్ని వాడుకుంటూ.. తండ్రి రాజశేఖర్ రెడ్డి హరితాంధ్రప్రదేశ్ ని గుర్తు చేస్తూ, గ్రీన్ కలర్ ని ఎంచుకోవడం జరిగింది.  ఇక ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో నల్లటి పోస్టర్లపైనా అక్షరాలను పసుపు రంగులో రాయడంద్వారా హిందువులకు దగ్గరగా ఉంచే ప్రయత్నం కూడా చేసాడు.
undefined
గతంలో ఢిల్లీ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్లు ఇబ్బడి ముబ్బడిగా తెలుపురంగులో వెలిసేవి. ఒక రకంగా ఎక్కడ చూసినా ఈ కేజ్రీవాల్ గొడవేందిరా బాబు అని అనిపించేంతలా ఉండేవి. కానీ ప్రశాంత్ కిషోర్ ఆ తెలుపు రంగును ఒక్కసారిగా నలుపు రంగులోకి మార్చదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కేజ్రీవాల్ ప్రచారంలో నలుపు రంగు మాత్రమే కనబడుతుంది. ఒక్కసారిగా తెలుపు రంగు నాలుగులోకి మారడంతో సాధారణంగా కనబడే ఆప్ పోస్టర్లు ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి.
undefined
అరవింద్ కేజ్రీవాల్ ఒక నియంత లాగ వ్యవహరిస్తారనే ఇమేజ్ బయట బాగా ఉంది. దాన్ని తగ్గించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించి ఇలా కేజ్రీవాల్ చిత్రాన్ని చాలా చిన్నగా ఉంచాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ బొమ్మను మాత్రం అత్యంత పెద్దదిగా ఉంచాడు. దానికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్రాన్ని బాగుపర్చాలంటే జగన్ రావలిసిందే అన్న ఇమేజ్ కి తగ్గట్టుగా రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని నడిపించాడు.
undefined
ఇప్పుడు కేజ్రీవాల్ రిపోర్ట్ కార్డు అంటూ మీటింగులు నిర్వహిస్తున్నాడు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ రావడం రావడంతోనే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న  ఢిల్లీ ఎన్నికలపై కేజ్రీవాల్ ని బాగానే ప్రొజెక్ట్ చేస్తున్నాడు.
undefined
click me!