గంగూలీ బీసీసీఐ చైర్మన్ అయినప్పటి నుండి క్రికెట్ కి మంచి రోజులొచ్చాయని అంతా భావిస్తున్నారు. గంగూలీకి ఉన్న క్రేజ్, అతని ఇమేజ్ అన్నీ వెరసి అతనికి ప్రాంతాలకతీతంగా అభిమానులను సంపాదించిపెట్టింది. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే అప్పటివరకు భారత అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న పింక్ బాల్ టెస్ట్ భారతీయ అభిమానులను ఆకట్టుకుంది.
undefined
కాకపోతే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గంగూలీ ఇమేజ్ ను డామేజ్ చేసివగా కనపడుతున్నాయి. మొన్నటి లోధా కమిటీ సిఫార్సులకు తిలోదకాలు ఇవ్వడం నుండి మొదలు తాజా జస్ప్రీత్ బుమ్రా వివాదం వరకు అనేక సంఘటనలు జరిగాయి. తాజాగా బుమ్రా ను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడడం నుండి మినహాయింపునివ్వడం ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల మధ్య చిచ్చుపెట్టేదిగా కనపడుతుంది.
undefined
భారత క్రికెట్ దిగ్గజాలు ఎవరైనా సరే... ప్రస్తుత జట్టులోని సూపర్ స్టార్స్ సైతం ఫామ్ కోల్పోయిన వేళ, ఫిట్‌నెస్ తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో, గాయం నుంచి కోలుకునే తరుణంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ద్వారానే తిరిగి జాతీయ జట్టు తలుపు తట్టారు, తట్టాలి.
undefined
భారత క్రికెట్‌లో గతంలో ఎన్నడూ జరుగని రీతిలో జస్ప్రీత్ బుమ్రా విషయంలో బోర్డు వరుసగా మినహాయింపులు ఇస్తూ వస్తోంది. బెంగళూర్‌లో జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్లను కాదని ముంబయిలో వ్యక్తిగత ట్రైనర్‌తో గాయానికి శస్త్రచికిత్స తర్వాత రిహాబిలిటేషన్ కొనసాగించాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్‌నెస్ నివేదిక. బుమ్రాకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించలేమని ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ స్టార్ సీమర్‌ను తిప్పి పంపాడు. దీంతో జట్టు ఫిజియో నితిన్ పటేల్ ఫిట్‌నెస్ నివేదిక ఆధారంగా జస్ప్రీత్ బుమ్రాను సీనియర్ జట్టులోకి ఎంపిక చేసింది ఎమ్మెస్కే బృందం.
undefined
ఆశ్చర్యకరంగా వరుస మినహాయింపులు పొందిన జస్ప్రీత్ బుమ్రాకు తాజాగా బీసీసీఐ బాస్ నుంచి మరో భారీ మినహాయింపు లభించింది. జాతీయ జట్టులోకి వచ్చే ముందు మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడాల్సిన అవసరం లేదని బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆదేశించాడు. దాదా ఆదేశంతో రంజీ ట్రోఫీలో ఆడాల్సిన అవసరం లేకుండానే బుమ్రా నేరుగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పాల్గొననున్నాడు.
undefined
బుమ్రా ఎపిసోడ్ కథాకమామీషు.... ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయానికి గురైన బుమ్రా ఇంగ్లాండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ కు వెళ్లలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజినికాంత్ వద్ద ముంబయిలో శిక్షణ తీసుకున్నాడు. రీఎంట్రీపై సలహా కోసం బుమ్రా మరోసారి బ్రిటన్‌లోని నిపుణులను సంప్రదించాడు. ఈ మొత్తం ప్రక్రియలో జాతీయ క్రికెట్ అకాడమీ పాత్రను బుమ్రా పూర్తిగా తప్పించాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఆదేశంతో ముందుగా టీమ్ ఇండియా నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా బౌలింగ్ చేశాడు. బుమ్రా ఫిట్‌నెస్‌ను జట్టు ట్రైనర్, బౌలింగ్ కోచ్, ఫిజియో, చీఫ్ కోచ్‌లు పర్యవేక్షించారు
undefined
బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని జట్టు మేనేజ్‌మెంట్ ఓ నిర్దారణకు వచ్చింది. ప్రోటోకాల్ నిమిత్తం ఫిట్‌నెస్ పరీక్ష కోసం ఎన్‌సీఏకు వెళ్లినా అక్కడ బుమ్రాకు ఊహించని చుక్కెదురైంది. గంగూలీ జోక్యంతో జట్టు ఫిజియో ఫిట్‌నెస్ నివేదికతో జట్టులోకి వచ్చాడు బుమ్రా. విరామం తర్వాత జాతీయ జట్టులోకి వస్తున్న జస్ప్రీత్ బుమ్రా రంజీ మ్యాచ్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలక్షన్ కమిటీ భావించింది. దీంతో బుధవారం కేరళతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో గుజరాత్ తరఫున బుమ్రా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే గాయం నుంచి ఇప్పుడే కోలుకున్న బుమ్రా రోజు 4-8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలని గుజరాత్ క్రికెట్ సంఘానికి సీనియర్ సెలక్షన్ కమిటీ సూచనలు చేసింది. బుమ్రా వంటి సీమర్‌తో రోజుకు 4-8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించటంతో జట్టుకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినా.. జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా గుజరాత్ షరతులకు అంగీకరించింది.
undefined
కానీ గాయం నుంచి కోలుకున్న తర్వాత జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఇంత కఠిన ప్రక్రియ అవసరమా? అని బుమ్రా భావించాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి చేరవేసినట్టు సమాచారం.
undefined
దాదా కా వాద... జస్ప్రీత్ బుమ్రా టెస్టు సీజన్‌ను 2020 ఫిబ్రవరిలో మొదలెట్టనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఫిబ్రవరి 21 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టులోనే బుమ్రా ఐదు రోజుల ఆటలో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రానున్న శ్రీలంక టీ20 సిరీస్‌లో బుమ్రా నేరుగా ఆడితే.. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. అటువంటప్పుడు కీలక సీమర్ ఫిట్‌నెస్‌ను రంజీ ట్రోఫీలో ఆడించి ఇరుకున పెట్టడం కంటే నేరుగా టీ20 సిరీస్‌లోనే ఆడించాలని గంగూలీ భావించాడు. వెంటనే ఇదే విషయాన్ని సీనియర్ సెలక్షన్ కమిటీకి తెలియజేయగా.. గుజరాత్ క్రికెట్ సంఘం అధికారులు జస్ప్రీత్ బుమ్రాను కేరళతో రంజీ మ్యాచ్‌లో ఆడించలేదు. అవసరమనుకుంటే ఆ టెస్ట్ సిరీస్ కి ముందు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిస్తే సరిపోతుందని టీం యాజమాన్యం ఆలోచించింది.
undefined
ద్రావిడ్ వర్సెస్ గంగూలీ... ఇప్పటివరకూ భారత క్రికెట్‌కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అత్యంత కీలకం. భారత క్రికెట్‌లో ఏ విషయంలోనైనా ఎన్‌సీఏదే కీలక నిర్ణయం. తొలిసారి బుమ్రా విషయంలో ఎన్‌సీఏ ప్రాధాన్యత దారుణంగా తగ్గిపోయింది. రాహుల్ ద్రవిడ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. బుమ్రా తన విషయంలో ఎన్‌సీఏ నిబంధనలను పూర్తిగా విస్మరించాడు.
undefined
ఎన్‌సీఏకు దూరంగానే గాయంపై శస్త్రచికిత్స, ఎన్‌సీఏకు సంబంధం లేకుండా రీహాబిలిటేషన్, ఎన్‌సీఏ అనుమతి లేకుండానే ఫిట్‌నెస్ నివేదిక అందుకున్న బుమ్రా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ద్రావిడ్ ఫిట్నెస్ పరీక్ష చేయనని తేల్చినప్పుడు గంగూలీ జట్టు ఫీజియో ద్వారా ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్ తోని సరిపెట్టుడం నిజంగా బాధాకరం. ఇలా చేయడం వల్ల గంగూలీ ద్రావిడ్ ఇంపార్టెన్స్ ను తగ్గించినట్టుగా మిగిలిన జట్టు సభ్యులు, లేదా ఇతర కోచింగ్ స్టాఫ్ కూడా భావించే ప్రమాదం ఉంది. ఇలా బుమ్రా దారిలోనే ఇతర క్రికెటర్లు సైతం వెళితే జాతీయ క్రికెట్ అకాడమీ తన ప్రాధాన్యత కోల్పోవటం వేగంగానే చోటుచేసుకోనుంది!
undefined