తెలంగాణాలో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ప్రాకంపనలను సృష్టిస్తూనే ఉంది. రాజేందర్ పార్టీని వీడడం ఖాయమని తేలినప్పటికీ... తదుపరి రాజకీయ కార్యాచరణపై తొలుత ఎవ్వరికి అంతుబట్టలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన వెంటనే అందరికీ ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న విషయం అర్థమైపోయింది. ఇంకొన్ని రోజుల్లో ఆయన కాషాయజెండాధారి కాబోతున్నాడు.
undefined
ఈటెల తెరాస నుంచి బయటకు వెళ్ళబోతున్నదానికన్నా.... ఈటెల రాజకీయ కార్యాచరణపైన్నే అందరి దృష్టి నిలిచింది. సహజంగా మనిషి నెక్స్ట్ స్టెప్ తెలుసుకోవాలన్న ఆతృత కొంతైతే.... ఈటెల వేసే రాజకీయ అడుగు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారబోవడం అసలు విషయం. ఈటెల కాంగ్రెస్ లో చేరి ఉంటే... కాంగ్రెస్ బలపడేది. ఇప్పుడు బీజేపీలో చేరితే బీజేపీ బలపడుతుంది. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో ఈయన చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.
undefined
ఈటెల ఒక్కడి వల్లే బీజేపీ గెలుస్తుందని కాదు. కానీ... ఈటెల చేరిక వల్ల ఒక రాజకీయ మోమెంటమ్ అనేదయితే ఏర్పడుతుంది. ఒకపక్క సరైన చుక్కాని లేని నావ ప్రయాణంలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. తెరాసలో ఇమడలేకపోతున్నవారు కాంగ్రెస్ బీజేపీల మధ్య తేల్చుకోవాలిసి వస్తే బీజేపీ వైపే మొగ్గు చూపడానికి ఈటెల చేరిక బాగా పనికొస్తుంది. ఈటెల బీజేపీలో చేరుతున్నారనగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీకే అరుణతో సమావేశం అయ్యారు కూడా.
undefined
దుబ్బాక, హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలతో జోరుమీదున్న బీజేపీకి... ఎమ్మెల్సీ ఎన్నిక, ఆతరువాత జరిగిన సాగర్ ఉపఎన్నిక నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు ఇలాంటి చేరికలు వారికి ఎంతో ఉపకరించగలవు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కి ఇది తలనొప్పిగా కూడా తయారవ్వొచ్చు. అపరచాణక్యుడు కేసీఆర్ ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడు కదా..!
undefined
బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతానికి దేశంలో కరోనా తాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ఒకింత శాంతిస్తున్నట్టు కనబడుతున్నా... పొంచి ఉన్న థర్డ్ వేవ్ జనాలను భయాందోళనలకు గురిచేస్తుంది. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగి అన్నీ అనుకూలిస్తే దాదాపు ఒక సంవత్సరంలో సాధారణ పరిస్థితులకు మనం చేరుకునే వీలుంటుంది.
undefined
ఈ పరిస్థితిని పూర్తిగా తనకనుకూలంగా వాడుకొని బీజేపీని దెబ్బకొట్టాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్టు సమాచారం. గతంలో ప్రయోగించిన ముందస్తు ఎన్నికల అస్త్రాన్ని బీజేపీ పై ప్రయోగిస్తే సమయం లేనందున తమ విజయం సులభమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. 2023 చివరినాటికి తెలంగాణ అసెంబ్లీ గడువు ముగిసిపోతుంది. అప్పడిదాకా ఆగితే బీజేపీ మరింత బలం పుంజుకునే ఆస్కారం లేకపోలేదు.
undefined
ఇది జరగొద్దు అంటే బీజేపీకి ఎక్కువ బలపడే సమయం ఇవ్వొద్దు. సమయం పెరుగుతున్న కొద్దీ... అసమ్మతులు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. పార్టీలో చాలామంది కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నప్పటికీ... ఇంకో రెండేండ్ల సమయం ఉన్నందున ఏమీ మాట్లాడడం లేదు. అదే ఎన్నికలు సమీపిస్తే వారు పార్టీని వీడే ఆస్కారం లేకపోలేదు.
undefined
బీజేపీ ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లో ఒకింత బలాన్ని కలిగి ఉన్నప్పటికీ... గ్రామీణ స్థాయిలో మాత్రం ఇంకా బీజేపీ బలపడలేదు. క్యాడర్ నిర్మాణం లేదు. ఒకవేళ బీజేపీకి గనుక సమయం చిక్కితే వారి స్పీడ్ ఎలా ఉంటుందో దేశంలోని అనేక ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షాల నుంచి మొదలుకొని చిన్నాపెద్దా బీజేపీ నాయకులంతా తెలంగాణలోనే తిష్ట వేసే ఆస్కారం ఉంది.
undefined
ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే... ముందస్తు ఎన్నికలొక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల భోగట్టా. 2022 చివర్లోనో లేదా 2023 తొలి నాళ్లలోనో అసెంబ్లీని రద్దు చేసే ఆస్కారం కనబడుతుంది. దానికి తోడు ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ఒకింత తొలుత అపఖ్యాతి పాలైనా... సోషల్ మీడియా లెవెల్ వరకు పెర్సెప్షన్ మానేజ్మెంట్ ని బాగానే చేసింది. కేటీఆర్ నిరంతరం అందుబాటులో ఉండడం, ట్విట్టర్ వేదికగా ఆయన చేస్తున్న సహాయాలు అన్నీ ఒక ఇమేజ్ ని అయితే క్రియేట్ చేసాయి. చూడాలి కేసీఆర్ ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే అది ఆయనకు కలిసొస్తుందా... లేక అనవసరంగా సంవత్సర పరిపాలనా కాలాన్ని పోగొట్టుకున్నామని బాధపడతారో కాలమే సమాధానం చెప్పాలి..!
undefined