తెలంగాణ ఖజురహో

First Published | Jun 13, 2019, 12:38 PM IST

ఆధ్యాత్మిక క్షేత్రాలలో అరుదైన ఆలయం డిచ్ పల్లి ఖిల్లా రామాలయం.‘తెలంగాణ ఖజురహో’గా పేరొందిన ఈ ఆలయంలో రమణీయమైన రతికేళీ దృశ్యాలు భక్తులకురక్తిని కలిగిస్తాయి.      -ఫోటోలు, కథనం: కందుకూరి రమేష్ బాబు 

ఆధ్యాత్మిక క్షేత్రాలలో అరుదైన ఆలయం డిచ్ పల్లి ఖిల్లా రామాలయం.‘తెలంగాణ ఖజురహో’గా పేరొందిన ఈ ఆలయంలో రమణీయమైన రతికేళీ దృశ్యాలు భక్తులకురక్తిని కలిగిస్తాయి.
undefined
చూపరులకుమొదట ఇక్కడ రతిభంగిమల దృశ్యాలు ఉన్నాయనే భావన కలుగదు. నిదానంగా చూస్తుంటే, ఆలయం అంతటాఅవే ప్రధానంగా ఆక్రమించాయని తెలుస్తుంది. చూస్తుంటే కనిపిస్తూ ఉంటాయి.
undefined

Latest Videos


ఒకే పురుషుడు, ఆరుగురు స్త్రీలతో రమించే శిల్పం ఒకటి ఇక్కడ ప్రత్యకం. అభిషేకం చేసిన నీటిని బయటకు వదిలేందుకు అరటి పూవు మాదిరిగా నిర్మించిన ‘సోమ సూత్రం’ఇక్కడిశిల్పకళా చాతుర్యానికి మరో మచ్చు తునక.
undefined
భారత దేశంలో తాబేలు (కూర్మ) ఆకారంలో నిర్మాణమైన ఆలయాల్లో ఇదొకటి. మరొకటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. కాగా, వచ్చేనెలఫిబ్రవరి15న- వైకుంట ఏకాదశి పర్వదినం నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఈ వేడుకల్లోసుమారు 40 గ్రామాల ప్రజలు పాల్గొంటారని అర్చకులు చెప్పారు. సందర్శకులకు గొప్ప అనుభవంగా నిలిచే ఈ ఆలయం తెలంగాణ పర్యాటకానికి మనోహరమైనచేర్పుఅనే చెప్పాలి.
undefined
నిజామాబాద్ కి 27 కి.మీ ల దూరంలో ఉన్న డిచ్ పల్లి రామాలయం హైదరాబాద్ నుండి 167 కి.మీ. ల దూరం ఉంటుంది.ఈ ఆలయం పై భాగాన, చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయనకామసూత్రల నుంఛిస్ఫూర్తిపొంది రూపొందించినశిల్పాలే కావడంతోఅవిసహజంగానే‘ఖజురహో’ను గుర్తుకు తెస్తాయి.
undefined
డిచ్ పల్లికికిలోమీటరు దూరంలో ఉన్న‘దీక్షానగరం’ 12 లేదా 13వ శతాబ్దంలో వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడయుద్ధానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారు. పర రాజులు ఎవరైనా విక్రయానికి వస్తే ఉండటానికి సదుపాయంగా, విశ్రాంతికి యోగ్యంగా అతి సుందరమైన శిల్పకళా చాతుర్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారన్నది చరిత్ర అని ఆలయ ప్రధాన అర్చకులు వానమామలై వెంకట కృష్ణమాచార్యులు చెప్పారు. ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు ‘గిచ్చు బొమ్మలు’గాపిలిచేవారని, సంస్కృతంలో‘గిచ్చు’ శృంగారానికి పర్యాయ పదం కావడంతో ఈ ఊరుని ‘గిచ్చుపల్లి’ అని, అదే‘డిచ్ పల్లి’గా మారిందనీ అంటారు.
undefined
మూడవ శతాబ్దానికి చెందిన వాత్సాయనుడికామసూత్రం గ్రంధంలోని కళలకు సంబంధించిన సూత్రాలు...తొలుతఅలంకరణ, తర్వాత శోభనానికిసన్నద్ధం అయ్యే దృశ్యాలు, అటు పిమ్మట శృంగారంలో లీనం అయ్యేవి, ఇట్లాచాలా శిల్పాలు అవ్యక్తంగా ఎన్నో కథలు చెబుతాయి.
undefined
దంపతులు, ప్రేమికులు, అభిరుచితో తప్పక చూసి తరించవలసిన ఆలయం ఇది.
undefined
మొదటి నుంచీ ఈ ఆలయం వైష్ణవ అలయమా శివాలయమా అన్నది అంతుపట్టదు. ఇది16వ శతాబ్దంలో నిర్మాణం అయిందనికొందరు, కాకతీయుల కాలం నాటిదని మరికొందరు అంటారు. ఐతే,1311 ప్రాంతంలో నవాబుల కాలంలో అర్థాంతరంగా దీని నిర్మాణం ఆగిపొయిందంటారు. కాగా1949 లో గజవాడ చిన్నయ్య గుప్త పూనికతో రామాలయంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి చేయడంతో ఇది ఖిల్లా రామాలయంగా పేరొందింది.
undefined
ఆలయం పక్కనే, దక్షిణాన ఉన్న కోనేరు, దాని మధ్యన ఉన్న మండపం ఈ అరుదైన శిల్పాల వీక్షణం నుంచి గొప్ప విరామం.
undefined
అపురూప శిల్పాలయం డిచ్ పల్లి రామాలయం
undefined
click me!