ఈటల బీసీ కార్డు ప్రయోగం, కేసీఆర్ కి భవిష్యత్ చిక్కులు ఇవే...

First Published | Apr 30, 2021, 10:44 PM IST

ప్రెస్ మీట్ లో ఈటల తెలంగాణ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడారు.ఈ విషయాల కన్నా కూడా ప్రెస్ మీట్ లో ఆయన ఎత్తుకున్న బీసీ కార్డు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేదిలా కనబడుతుంది. 

కరోనా మహమ్మారి విలయతాండవం దెబ్బకు నిన్న జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక, నేటి మునిసిపల్ ఎన్నికలు కూడా వార్తల్లో చోటు సంపాదించలేకపోయాయి. కానీ ఉన్నట్టుండి నేటి సాయంత్రం తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, వెనువెంటనే సీఎం విచారణకు ఆదేశించడం, ఈటల ప్రెస్ మీట్ అన్ని వెరసి తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
undefined
మునిసిపల్ ఎన్నికలు నేడు ముగియగానే ఒక్కసారిగా చెలరేగిన ఈ రాజకీయ దుమారం ఇప్పుడు మంచి రసకందాయంలో పడింది. మున్ముందు ఇది కార్చిచ్చులా మారే ఆస్కారం కూడా లేకపోలేదు. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ గురించి తెలియని వారుండరు. ఉద్యమ సమయం నుంచి మొదలు ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.
undefined

Latest Videos


తాజాగా కొన్ని రోజుల కింద ఆయన పార్టీకి ఓనర్లు అనే విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన విషయం తెలిసిందే. అంతకు మునుపే పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి కోవిడ్ మహమ్మారి లేకుండా ఉంటే ఆయనకు గత ఏడాదే ఉద్వాసన పలికేవారని వార్తలు తెరాస వర్గాల నుండే వినబడుతున్నాయి.
undefined
అయితే తాజాగా నేటి ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన మనసు ఎందుకు నొచ్చుకుందో కూడా వివరించారు. వాస్తవానికి ఈటల రాజేందర్ స్వభావం తెలిసిన వారంతా ఆయన రాజీనామా చేస్తారని అనుకున్నారు. తొలుత ఈటల రాజేందర్ కూడా అందుకు సిద్ధపడ్డప్పటికీ.... ఆ తరువాత తన సన్నిహితులతో చర్చించి రాజీనామా చేయొద్దని డిసైడ్ అయ్యారు.
undefined
నేటి ప్రెస్ మీట్ లో ఈటల తెలంగాణ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడారు. కేసీఆర్ కి సైతం నేరుగా సవాల్ విసిరారు. కానీ ఈ అన్ని విషయాల కన్నా కూడా ప్రెస్ మీట్ లో ఆయన ఎత్తుకున్న బీసీ కార్డు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేదిలా కనబడుతుంది.
undefined
తాను బీసీ సామాజికర్గానికి చెందినవాడనని, ముదిరాజ్ బిడ్డనని, తన జాతి భయపడే జాతి కాదని ఆయన స్పష్టం చేసారు. బీసీ సామాజికవర్గ నేతగా ఈటల రాజేందర్ కి మంచి గుర్తింపు ఉంది. తన కులాన్ని గురించి ప్రశ్నలు లేవనెత్తుతుండడంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ ఆత్మగౌరవం అంటూ ఈటలను తెరాస వీడాలని కోరారు. ఇప్పుడు మరోసారి అదే అంశం తెర మీదకు వచ్చే ఆస్కారం లేకపోలేదు.
undefined
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలోని బీసీలను ఐక్యం చేసి టీడీపీ పట్టు సాధించింది. ఆ తరువాత బీసీలకందరికి రకరకాల పథకాలను ప్రవేశపెట్టి చేప పిల్లల పంపిణి నుండి గొర్రెల పంపిణి వరకు, దోబీ ఘాట్ ల నుండి సెలూన్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి కేసీఆర్ బీసీలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ అదే బీసీ ఆత్మ గౌరవ కార్డును ఎత్తుకుంటే అది భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం మాత్రం వేచి చూడాలి.
undefined
click me!