రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్ పక్కా: 2001 నుంచే ప్లాన్

First Published | Apr 26, 2021, 6:35 PM IST

టీడీపీ నాయకత్వానికి ఊపిరిలూదాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయాల్సిందేనన్న డిమాండ్ వినపడుతుంది. ఆశ్చర్యకరంగా వైసీపీ నేతలు కూడా దీనికి వంత పాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ జీవన్మరణ సమస్యను ఎదుర్కుంటోంది. ఎన్నికల్లో 23 మంది మాత్రమే గెలవడం, ఆ తరువాత వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేక పార్టీని చాలా మంది వీడడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం అన్నీ వెరసి టీడీపీ డీలా పడిపోయింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నాయకత్వం ఎంత ప్రయత్నించినా అది జరగడం లేదు. చంద్రబాబు తరువాత పార్టీ బాధ్యతలను ఎవరు మోస్తారు అనే విషయంలో రాజకీయ చర్చ ఎప్పటినుండో జరుగుతూనే ఉంది.
చంద్రబాబు తనయుడు లోకేష్ పార్టీ కార్యక్రమాలను భుజస్కంధాలపై మోస్తున్నప్పటికీ.... గతంలో వైసీపీ నేతలు చేసిన ఇమేజ్ డ్యామేజ్ వల్ల ఆయన ఇంకా పూర్తిస్థాయి పరిపక్వత చెందిన నేతగా ఎదగలేకపోతున్నారు. రకరకాల పేర్లతో, వ్యంగ్యాస్త్రాలతో లోకేష్ ని పొలిటికల్ గా కౌంటర్ చేసారు వైసీపీ వారు. ఎవిరీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్, వార్ అండ్ పాలిటిక్స్ అన్నట్టు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇదొక సాధారణ అంశమైపోయింది. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సైతం ఇదే కోవలోకి బీజేపీ చేత నెట్టివేయబడ్డాడు.

ఇక లోకేష్ విషయం పక్కనబెడితే... టీడీపీ నాయకత్వానికి ఊపిరిలూదాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయాల్సిందేనన్న డిమాండ్ వినపడుతుంది. ఇది టీడీపీ శ్రేణులనుంచి కూడా బలంగా వినిపిస్తున్న వాదన. ఆశ్చర్యకరంగా వైసీపీ నేతలు కూడా దీనికి వంత పాడుతున్నారు (వారి రాజకీయ అవసరాలు వారికున్నాయనుకోండి). తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కి సంబంధించిన కార్యక్రమంలో విలేఖరులు రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎన్టీఆర్ ను అడగడంతో మరోసారి ఈ విషయానికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది.
అందరూ అడుగుతూ ఉన్నప్పటికీ... ఎన్టీఆర్ మాత్రం తన మౌనాన్ని వీడడంలేదు. ఏ విషయాన్నీ కూడా తేల్చి చెప్పడం లేదు. అసలు ఎన్టీఆర్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేదా అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ జా మూవ్ అయ్యే ఒక వ్యక్తి ఎన్టీఆర్ కి రాజకీయాల మీదున్న ఇంటరెస్ట్ గురించి ఒక కీలక వ్యాఖ్య చేసాడు. అతనెవరో కాదు ఎన్టీఆర్ మిత్రుడు, సుబ్బు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జీకే చౌదరి.
2001లోనే జనిర్ ఎన్టీఆర్ కి సీఎం అవ్వాలని కల ఉండేదని చెప్పడు ఈ కో డైరెక్టర్. సుబ్బు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రినవుతా అని అనేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
వాస్తవంగా కూడా ఎన్టీఆర్ అనేక రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. టీడీపీ కోసం ఆయన బహిరంగసభలు నుంచి రోడ్ షో ల వరకు అనేకం చేసాడు. ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ తనయుడిగా ఆ నట వారసత్వంతోపాటు రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నాడు. 2009లో ఆక్సిడెంట్ అయిన తరువాతి నుండి ఎన్టీఆర్ రాజకీయ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి టైం లో ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ గురించి న్యూస్ హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీఖుషీగా ఉన్నారు

Latest Videos

click me!