కరోనా వేళ వేరే యావ: జపాన్ ప్రధానికి అదీ, వైఎస్ జగన్ కు ఇదీ...

First Published Apr 16, 2020, 7:13 PM IST
జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు. 
కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా ఇటలీ, అమెరికాల ఉదాహరణలు చూసిన తరువాత లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని మిగిలిన దేశాలన్నీకూడా లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే.
undefined
అందరికన్నాఆలస్యంగా జపాన్ ప్రధాన మంత్రి నిద్రలేసినట్టున్నారు. ఆయన కేవలం కొద్దీ రోజుల కింద మాత్రమే లాక్ డౌన్ ని ప్రకటించారు. ఆయన ఇన్ని రోజులు కూడా పరిస్థితి అంతా బాహీగానే ఉందంటూబీరాలు పలికాడు.
undefined
ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ ధాటికివిలవిల్లాడిపోతుంటే జపాన్ ప్రధాని షింజో అబే మాత్రం ఒలింపిక్స్ ఎక్కడ వాయిదా పడిపోతాయిఅంటూ ఆయన పరిస్థితి అంతా చక్కాగానే ఉందంటూజపాన్ లోని ఆర్ధిక వ్యవస్థనంతాకరోనా కేసులు నమోదవుతున్నా తెరిచే ఉంచాడు.
undefined
అసలే జపాన్ లోని జనాభాలో అధిక శాతం మంది ముసలివారు. మరొపక్కనేమో కరోనామహమ్మారి వయసుపైబడినవారిపై అధిక ప్రభావము చూపెడుతుంది చైనా పక్కనే ఉన్నప్పటికీ జపాన్ మాత్రం తమ ఆర్ధిక వ్యవస్థను మాత్రం మూయలేదు. ఆర్ధిక వ్యవస్థనంతా రన్నింగ్ లోనే ఉంచారు.
undefined
ఇలా ఇన్ని రోజుల పాటు దేశానికి అన్ని వైపులా నుండి ద్వారాలు తెరిచి పెట్టడంతో దేశంలోకి కరోనా వైరస్ మహమ్మారిదిగుమతి అవుతూనే ఉంది, అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది.జపాన్ పరిస్థితిని, అక్కడి జనాభా వయసును మనం అర్థం చేసుకోవాలంటే... ఒక చిన్న లెక్క చూస్తే సరిపోతుంది. ప్రపంచంలోఅత్యధికంగా అడల్ట్ డైపర్లు అమ్ముడు పోయేదిజపాన్ లోనే. ఈ లెక్కలను బట్టి అక్కడి పరిస్థితి ఏమిటో మనము అర్థం చేసుకోవచ్చు.
undefined
జపాన్ ప్రధాని తెలివి తక్కువవాడుకాదు. అతడు ముందు చూపున్న వ్యక్తి. ప్రజామోదం, ప్రజల వెన్నుదన్నులు అధికంగా ఉన్న నేత. అయినప్పటికీ షింజో అబే ఇలా ప్రవర్తించడం ఇప్పుడు అక్కడ సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.
undefined
జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితినిచూసినాఅచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.
undefined
భారతదేశం లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందు ప్రాథమికంగా దేశంలోని స్కూళ్ళు, కాలేజీలనుమూసేసింది. అందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు అందాయి.
undefined
పక్కనున్న తెలంగాణరాష్ట్రం ముందు నుంచే స్కూళ్ళు, జిమ్ములు క్లబ్బులు అన్నిటిని మూసేస్తే.... మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం పరిస్థిలుతి అంతా సజావుగానే ఉంది అని చెప్పేటందుకు, అందరికి ప్రూవ్ చేసేందుకుఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను,కాలేజీలను అన్ని రాష్ట్రాలు బంద్ చేసినప్పుడు చేయలేదు.
undefined
ముందున్న స్థానిక సంస్థలఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు.(వాస్తవానికి అప్పటికి కరోనా ఈ స్థాయిలో విజృంభించలేదు. అలా విజృంభించకూడదనే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది)
undefined
ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగాఆయన అయినా విషయం మనం అందరం చూసాము.
undefined
ఆయన పారాసిటమాల్ వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అవ్వడంతోపాటుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. బ్లీచింగ్ పొడి, పారాసిటమాల్ జుగల్బందీతివో కరోనా ను ఎదుర్కోవడం అంటూ విపరీతంగా సోషల్ మీడియాలోమీమ్స్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
undefined
ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తుంది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూనే తిరగడం మాత్రం సర్వత్రావిమర్శలకు దారి తీస్తుంది.ఈ విషయంపైన్నే ఈ ప్రమాదకర కరోనా వైరస్ విరుచుకుపడుతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఈ విషయంపైన్నే అక్కడ రాజకీయం జరుగుతుండడం నిజంగా శోచనీయం!
undefined
click me!