వైఎస్ ను అధికారంలోకి తెచ్చిన ఉచిత విద్యుత్తే జగన్ కు గుదిబండ

First Published Sep 7, 2020, 8:26 AM IST

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలో కూడా రాజశేఖర్ రెడ్డినే చూసుకుంటూ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కి పట్టం గట్టారు. జగన్ అఖండ మెజారిటీకి కారణం రాజన్న రాజ్యాన్ని హామీ ఇవ్వడమే అనడంలో ఇసుమంతైనా సంశయం లేదు. 

వ్యవసాయ పుంపు సెట్లకు మీటర్లను బిగించాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయింది. రైతు సంఘాలు, ప్రతిపక్షాలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పుంపు సెట్లకు మీటర్లు అంటే రైతు మెడకు ఉరితాళ్ళంటూ జగన్ సర్కార్ నిర్ణయం పై వారు మండిపడుతున్నారు.
undefined
మీటర్లను అమర్చినప్పటికీ.... బిల్లు ఎంత వచ్చినా దాన్నంతటిని ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది ప్రభుత్వం. దీని వల్ల రైతులపై ఎటువంటి అదనపు భారం కూడా పడదు. అయినప్పటికీ రైతు సంఘాలు, ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
undefined
అప్పు తెచ్చుకోవడానికి కేంద్రానికి 18 లక్షల రైతులజీవితాలను తాకట్టు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకసారి మీటర్లను బిగించి నగదు బదిలీ పథకంగా మారితే ఇక ఉచిత విద్యుత్ ఉండదు అనేది వారి ఆరోపణ. ప్రభుత్వం అలాంటిదేమి ఉండదు అని చెప్పినప్పటికీ... గ్యాస్ సీలిండర్లలో నగదు బదిలీ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితి ఎంతలా మారిపోయిందో చూడండి అంటూ వారు ఉదాహరణలను ఇస్తున్నారు.
undefined
రాష్ట్రంలో వివిధ సంక్షేమపథకాలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడుతుంది. దానితోపాటుగా మీద పడ్డ లాక్ డౌన్... అన్ని వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతిన్నది. కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ లో కొట్టుమిట్టాడుతున్న ఏపీపై కరోనా బాంబు తీవ్ర ప్రభావాన్ని చూపింది.
undefined
ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో దైనందిన కార్యక్రమాలు నడవాలన్నా అప్పు కావలిసిందే. ఈ నేపథ్యంలోకేంద్రం ఇచ్చిన ఎఫ్ఆర్బీఎం సడలింపులు వాడుకోవాలని ఏపీ భావించింది. ఇందుకోసం కేంద్రం విధించిన విద్యుత్ రంగం షరతుకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది.
undefined
ప్రస్తుతానికి పూర్తి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నప్పటికీ... భవిష్యత్తులో విద్యుత్ రంగాన్ని కేంద్రం పూర్తిగా హస్తగతం చేసుకోవాలనిఅనుకుంటుంది. అందుకు సంబంధించిన బిల్లు పైన్నే కేసీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
undefined
కేంద్రం ఇచ్చే అప్పు ఇవ్వకున్నా అక్కర్లేదు కానీ.... సమాఖ్య విధానానికి తూట్లు పొడిచే ఇలాంటి చర్యలను మాత్రం తాము సహించేది లేదని కేసీఆర్ అన్నాడు. ఒకసారి కేంద్రం నియమ నిబంధనలకు అంగీకరిస్తే.... రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలా వద్ద అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నుంచి జారిపోవచ్చు. అందుకోసమే కేసీఆర్ ఆరోజు అంతలా ఫైర్ అయ్యారు.
undefined
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఉచిత విద్యుత్ అనేది లేకుండా పోతుందని రైతులు, రైతు సంఘాలు అనుమానపడుతున్నాయి. కేసీఆర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు వారిని మరింతగా భయపెడుతున్నాయి.
undefined
2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఉచిత విద్యుత్ కీలక పాత్ర పోషించింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ... తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్ మీదనే చేసారు. చంద్రబాబు హయాంలో చాలా కష్టాలు పడ్డాము అనుకున్న రైతాంగం రాజశేఖర్ రెడ్డిని, ఉచిత విద్యుత్ హామీని నమ్మి ఓట్లు వేసింది.
undefined
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలో కూడా రాజశేఖర్ రెడ్డినే చూసుకుంటూ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కి పట్టం గట్టారు. జగన్ అఖండ మెజారిటీకి కారణం రాజన్న రాజ్యాన్ని హామీ ఇవ్వడమే అనడంలో ఇసుమంతైనా సంశయం లేదు.
undefined
ఇప్పుడు ఒకవేళ ఈ విద్యుత్ విషయంలో ప్రతిపక్షాల మాటలు, ముఖ్యంగా రైతు సంఘాల మాటలు గనుక జనంలోకి వెళితే అది జగన్ ఇమేజ్ కి దెబ్బ అవ్వొచ్చు. దానిపై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రజా ఉద్యమాలు కూడా నిర్మితమవ్వచ్చు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు. వేచి చూడాలి, జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో....
undefined
click me!