వితంతువును చెట్టుకు కట్టేసి, దుస్తులు విప్పేసి దాడి చేసిన మహిళలు.. ఆ అనుమానంతోనే..!!

Published : Jul 02, 2023, 12:36 PM ISTUpdated : Jul 02, 2023, 12:41 PM IST

రాజస్తాన్‌‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వితంతువును చెట్టుకు కట్టేసిన కొందరు మహిళలు.. ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. 

PREV
15
వితంతువును చెట్టుకు కట్టేసి, దుస్తులు విప్పేసి దాడి చేసిన మహిళలు.. ఆ అనుమానంతోనే..!!

రాజస్తాన్‌‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వితంతువును చెట్టుకు కట్టేసిన కొందరు మహిళలు.. ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

25

ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే దాదాపు 10 మందికి పైగా మహిళలు ఆమెపై దాడి చేసినట్టుగా పోలీసులు తెలిపారు. మహిళను చెట్టుకు కట్టేసి  దాడి చేయడంతో పాటు.. ఆమె దుస్తులు విప్పి, జట్టును  కూడా కత్తిరించారు. 

35

జూన్ 29న బెకారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్లా ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని.. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 

45

‘‘మేము ఐటీ చట్టం, ఐపీసీలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. నిందితులను అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మేము బాధిత మహిళకు అన్ని విధాలుగా సహాయం చేస్తాము’’ అని ఉదయపూర్ పోలీసు సూపరింటెండెంట్ భువన్ భూషణ్ యాదవ్ అన్నారు.
 

55

ఇక, బాధితురాలు ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తుంంది. ఆమె భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతోనే కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 

click me!

Recommended Stories