ఆ రాష్ట్రాల సీఎంల కన్నా.. మోదీ మూడు రోజులు ఎక్కువే.. ఎందుకలా?

First Published | Apr 14, 2020, 2:49 PM IST
తొలుత మోడీ కన్నా కూడా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో ముందడుగు వేశాయి. ఈ నెల 30వ తేదీ వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించేశారు. 
మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.
తొలుత దేశంలో 550 పాజిటివ్ కేసులు నమోదైన సమయంలో 21 రోజుల లాక్ డౌన్ ను విధించారు.ఈ 21 రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోయాయి.

లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని ప్రధాని మోడీ తెలిపారు. మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని మోడీ తెలిపారు.
అయితే, ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని మోడీ తెలిపారు.
తొలుత మోడీ కన్నా కూడా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో ముందడుగు వేశాయి. ఈ నెల 30వ తేదీ వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చాలా మంది ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు.
ఈమేరకు ప్రధాని నిర్ణయం తీసుకుంటారని.. లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగిస్తారని అందరూ భావించారు. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మోదీ.. మే 3వ తేదీ వరకు పొడిగించారు.
వాళ్లు చెప్పినదానికంటే. మరో మూడు రోజులు అదనంగా ఎందుకు పెంచారు అనే విషయంపై అందరి దృష్టి పడింది. అయితే. దానికి కారణం లేకపోలేదంటున్నారు.
ఆ కారణం ఏమిటంటే.. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అంటే రాష్ట్రాలు పొడిగించిన లాక్ డౌన్ ఏప్రిల్ 30 గురువారంతో ముగుస్తుంది. ఇక మే 1వ తేదీ శుక్రవారం మేడే(సెలవు), 2వ తేదీన శనివారం, 3వ తేదీన ఆదివారం వస్తుంది.
కాబట్టి ఈ మూడు రోజులు వరుస సెలవులు వస్తాయి కాబట్టి ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మరింత ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండడంతో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది.

Latest Videos

click me!